వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్ | Jack Ma did a teacher job before starting Alibaba | Sakshi
Sakshi News home page

వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్

Published Thu, Sep 5 2024 11:13 AM | Last Updated on Thu, Sep 5 2024 1:16 PM

Jack Ma did a teacher job before starting Alibaba

విశాల విశ్వంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. ఇదే తరహాలో ఒక వ్యక్తి జీవితంలో కూడా తప్పకుండా మార్పులు జరుగుతాయి, పరిస్థితులు తారుమారవుతాయి. పేదవాడు కుబేరుడిగా మారవచ్చు, కుబేరుడు దీన స్థితికి రావచ్చు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో రెండు సార్లు ఫెయిల్ అయిన ఒక వ్యక్తి.. ఉపాధ్యాయుడుగా పనిచేశారు. చైనాలో అత్యంత ధనవంతుడిగా కూడా నిలిచారు. ఇంతకీ అయన ఎవరు? ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా ఉన్న 'జాక్ మా' (Jack Ma) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. ఆలీబాబా.కామ్‌ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత కూడా. 1964 సెప్టెంబర్ 15న జన్మించిన జాక్ మధ్య తరగతికి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తితో విదేశీ పర్యాటకులతో సంభాషించడానికి ప్రతిరోజూ ఉదయం సమీపంలో ఉన్న హోటల్‌కు సైకిల్ మీద వెళ్లేవాడు.

ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో గైడ్‌గా కూడా పనిచేశాడు. తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడాని ఇదొక అద్భుత అవకాశంగా భావించారు. అలా సుమారు తొమ్మిది సంవత్సరాలు గైడ్‌గా పనిచేసి ఎంతో నేర్చుకున్నాడు. గురువుల దగ్గర, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికంటే.. భిన్నమైన అంశాలను విదేశీ పర్యటకుల నుంచి గ్రహించగలిగాడు.

విద్య & ఉద్యోగం
ఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో జాక్ 'హాంగ్‌జౌ డియాంజీ యూనివర్సిటీ' (Hangzhou Dianzi University) ప్రవేశ పరీక్ష రాసారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. అయినా పట్టు వదలకుండా మూడోసారి పరీక్ష రాసి విజయం సాధించారు. అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు.

చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పేవాడు. యూనివర్సిటీలో జీతం సరిపోకపోవడంతో ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనీ లక్ష్యంగా ముందడు వేసాడు. ఇందులో భాగంగానే అనేక ఉద్యోగాలకు అప్లై చేసుకున్నాడు. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్క ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు.

ఏ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో 1994లో ఆంగ్ల అనువాదం, వివరణను అందించడానికి  'హైబో ట్రాన్స్‌లేషన్ ఏజెన్సీ' స్థాపించారు. ఆ తరువాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే అవకాశాన్ని వచ్చింది. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. ఇక్కడే మొదటి సారి ఇంటర్నెట్‌ గురించి తెలుసుకున్నాడు.

అంతర్జాలం (ఇంటర్నెట్) అతనికి ఒక పెద్ద మాయగా అనిపించింది. ఆ సమయంలోనే రూ.1.2 లక్షల పెట్టుబడితో  'చైనా పేజెస్' పేరుతో వెబ్‌సైట్‌ ప్రారంభించాడు. అప్పటి వరకు జాక్ కీ బోర్డు తాకనేలేదు. జాక్ జీవితం ఆ తరువాత ఇంటర్నెట్‌తో ముడిపడిపోయింది. కీబోర్డ్ కూడా తాకని వ్యక్తి ఏకంగా 'చైనా టెలికామ్' సంస్థకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు.

దీంతో ఆ కంపెనీ అప్పట్లోనే రూ. కోటి పెట్టుబడితో సంస్థ పెట్టి కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్.. జాక్‌కు చెప్పారు. అదే అదనుగా చూస్తున్న జాక్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ భాగస్వామ్యం నచ్చకుండా బయటకు వచ్చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నారు.

ఇదీ చదవండి: నేను మీలా అవ్వాలంటే?: ఇన్ఫీ నారాయణ మూర్తి సమాధానం

ఆఫ్ అలీబాబా ఈ-కామర్స్ కంపెనీ
1999లో 18 మంది వ్యక్తులతో కలిసి ఆన్‌లైన్ బిజినెస్ ప్రారంభించారు. దానికి అందరికి బాగా పరిచయమున్న పేరును పెట్టాలనే ఉద్దేశ్యంతో 'అలీబాబా' (Alibaba) పేరుని ఖరారు చేసాడు. ఈ సంస్థ కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే గొప్ప వృద్ధిని సాధించింది.

ఎంట్రన్స్ పరీక్షల్లోనే కస్టపడి సక్సెస్ సాధించిన జాక్ మా.. ఈ రోజు ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తగా టాప్ 100 ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా నిలిచాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇతడు ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తూ చైనాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. జాక్ తన స్నేహితురాలైన 'జాంగ్ యింగ్‌' (Zhang Ying)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనేదానికి జాక్ నిలువెత్తు నిదర్శనం, ఈయన జీవితం నేటీకి ఎంతోమందికి ఆదర్శప్రాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement