Former PM Manmohan Singh
-
ఆరోసారి రాజ్యసభకు..
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారం ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్తాన్ నుంచి మన్మోహన్సింగ్ తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభకు ఆయన ఎన్నికవడం ఇది ఆరవసారి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, థావర్ చంద్ గెహ్లోత్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్‌తో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా హాజరయ్యారు. మన్మోహన్ ఇంతకుముందు 28 సంవత్సరాల పాటు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. -
‘మన్మోహన్ సింగ్ కొలువులో చేరొచ్చు’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవ అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టవచ్చని మంగళవారం పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఆయన రాజ్యసభ సభ్యత్వంపై ఈ కొత్త బాధ్యతల ప్రభావం ఉండబోదని తెలిపింది. జవహార్ లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్షిప్ బాధ్యతలు చేపట్టేందుకు రావాలని, తీరిక ఉన్న సమయాల్లోనే తమ విద్యార్థులకు, అధ్యాపకులకు బోధించాలని కోరుతూ పంజాబ్ యూనిర్సిటీ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ను కోరింది. దీంతో ఆయన ఈ ఏడాది జూలై నెలలోనే అలా చేయవచ్చా లేదా అనేది తెలుసుకునేందుకు రాజ్యసభ చైర్మన్‌ను సంప్రదించారు. భారత రాజ్యంగంలోని 102(1)(ఏ) నిబంధన తాను ఆ బాధ్యతలు చేపట్టేందుకు అనుమతి ఇస్తుందా లేదా సలహా ఇవ్వాలని కోరారు. ఈ నిబంధన ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లోని ఏ సభలో సభ్యుడు అయినా.. ఆ వ్యక్తి ఆదాయం వచ్చే ఇతర ఏ ప్రభుత్వ సంస్థలో విధులు నిర్వర్తించరాదు. దీనిపైనే వివరణ కోసమే చైర్మన్ ను సంప్రదించారు. అయితే, గౌరవ అధ్యాపక బాధ్యతలు మాత్రమే చేపడుతున్నందన మాజీ ప్రధాని వాటిని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చని, ఆయన రాజసభ సభ్యత్వానికి ఎలాంటి ఢోకా లేదని పార్లమెంటు కమిటీ స్పష్టం చేసింది. మన్మోహన్సింగ్ పంజాబ్ యూనివర్సిటీలోనే ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. అనంతరం 1963 నుంచి 65 మధ్యలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా మరోసారి ఆయన అదే యూనివర్సిటీలో తన విజ్ఞానాన్ని పంచేందుకు అవకాశం దక్కనుంది. ఈ బాధ్యతలు చేపట్టే వ్యక్తికి వర్సిటీ తరుపున విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్, ఓ కారు, డ్రైవర్, వసతి, రోజుకు రూ.5,000లు గౌరవంగా అందిస్తారు. చర్చల ద్వారా ఆయన విద్యార్థులతో, అధ్యాపకులతో బోధన చేస్తారు. -
చాపర్ స్కాం: సోనియా, మన్మోహన్ పై ఎఫ్ఐఆర్?
న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం తాజాగా న్యాయవ్యవస్థ నజర్ లోకి వచ్చింది. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తాజాగా విచారణకు స్వీకరించింది. హెలికాప్టర్ల కుంభకోణంలో ఇటలీ కోర్టు తీర్పులో ప్రస్తావించిన పలువురి పేర్లను కూడా ఈ పిల్ లో ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకృతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ పై కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీచేసింది. ఈ స్కాంపై దర్యాప్తును సీబీఐ నుంచి సుప్రీంకోర్టు ఏర్పాటుచేసే ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించే అంశంపై తమ ప్రతిస్పందన తెలియజేయాలని ధర్మాసనం కోరింది. ఇటలీ కోర్టు తన తీర్పులో ప్రముఖులైన రాజకీయ నాయకుల పేర్లను వెల్లడించినప్పటికీ, వారికి విరుద్ధంగా సీబీఐ చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిల్ దాఖలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచోసుకున్న మూడో అతిపెద్ద కుంభకోణం ఇది. ఇప్పటికే 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాలపై తన పర్యవేక్షణలో దర్యాప్తు జరుపుతున్న సుప్రీంకోర్టు తాజాగా హెలికాప్టర్ల స్కాంపైనా దృష్టిపెట్టింది. -
విద్యార్థులకు మౌనముని పాఠాలు
గాంధీనగర్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. గుజరాత్‌లోని ఓ కాలేజీలో ఆయన ఓ సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. భావి భారత రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయన సూచనలు ఇవ్వనున్నారు. గాంధీనగర్ లో గుజరాత్ నాలెడ్జ్ విలేజ్ క్యాంపస్ లో కాంగ్రెస్ పార్టీ నేత శంకర్ సింగ్ వాఘెలాకు ఓ కళాశాల ఉంది. అందులో చదువుతున్న విద్యార్థులకోసం ఓ సుధీర్ఘ సూచన చేయాలని వాఘెలా కోరడంతో అందుకు మన్మోహన్ సింగ్ అంగీకరించినట్లు తెలిసింది. శనివారం ఆయన ఈ ప్రసంగం చేస్తారు. వాస్తవానికి ఆయన ఈ ప్రసంగం గత 27న ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పుడు వాయిదా పడింది.