
ప్రమాణం సందర్భంగా వెంకయ్యతో మన్మోహన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారం ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్తాన్ నుంచి మన్మోహన్‌సింగ్ తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభకు ఆయన ఎన్నికవడం ఇది ఆరవసారి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, థావర్ చంద్ గెహ్లోత్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్‌తో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా హాజరయ్యారు. మన్మోహన్ ఇంతకుముందు 28 సంవత్సరాల పాటు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment