అపర కుబేరులు జిమ్‌లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి! | Check out these ai photos billionaires look like in the gym | Sakshi
Sakshi News home page

అపర కుబేరులు జిమ్‌లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి!

Published Mon, May 8 2023 4:13 PM | Last Updated on Mon, May 8 2023 5:57 PM

Check out these ai photos billionaires look like in the gym - Sakshi

ప్రపంచ కుబేరులైన ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ ఎప్పుడూ తమ వ్యాపారాల్లో బిజీగా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడూ బిజీగా ఉండే వీరు ఒక వేళా జిమ్‌లో వర్కౌట్లు చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించే ఉంటారు. అయితే అలాంటి వారు సాహిద్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఫోటోలను తప్పకుండా చూడాల్సిందే.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సాహిద్ షేర్ చేసిన ఫోటోలు కేవలం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినవి మాత్రమే. ఇందులో జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్, వారెన్ బఫెట్ మొదలైనవారు ఉన్నారు. ఈ చిత్రాలకు ఇప్పటి వరకు వెయ్యికంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కొంత మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో ఒకరు 'మనీ+మజిల్=పవర్' అంటూ కామెంట్ చేశారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. AI అందుబాటులోకి వచ్చిన తరువాత గతాన్ని, భవిష్యత్తుని ఊహించేస్తున్నారు. ఒక వ్యక్తి చిన్నప్పుడేలా ఉండేవాడు, ముసలివాడైతే ఎలా ఉంటాడు అనేది కూడా ఇది గ్రహించేస్తోంది. 

(ఇదీ చదవండి: ఇండియాకు కేఎఫ్‌సి, పిజ్జా హట్ రావడానికి కారణం ఇతడే..!)

ఈ ఫోటోలు చూసిన వారిలో కొంత మంది బిలీనియర్లు చిన్నప్పుడేలా ఉండేవారు, అలంటి చిత్రాలను కూడా రూపొందించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. AI మీద అవగాహన ఉన్న సాహిద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని, నరేంద్ర మోదీ వంటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసేవారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

(ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ - ఈ ధరతో ఒక కారు కొనేయొచ్చు!)

ఈ ఫొటోలన్నీ మిడ్‌జర్నీ అనే AI అప్లికేషన్‌ ద్వారా రూపొందించినట్లు షాహిద్ పోస్ట్ ద్వారానే వెల్లడించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement