
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం 'క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్' అనే సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు లైవ్ స్ట్రీమ్ అనేది ఫాలోవర్స్ అందరికి కనిపించేది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తుంది.
క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో కావలసిన వాళ్ళను యాడ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేయవచ్చు. యూజర్ల భద్రతకు పెద్దపీట వేయడానికి ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇన్‌స్టా అకౌంట్ పబ్లిక్ అయితే ఎవ్వరైనా లైవ్ స్ట్రీమింగ్‌లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా.. యూజర్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఎవరైతే ఉండాలనుకుంటారో వారిని మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్.. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ అనే సరికొత్త ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా, మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను మరింత ప్రైవేట్ ప్లేస్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్‌లో.. గ్రిడ్‌లో పోస్ట్‌లను సన్నిహితులకు మాత్రమే కనిపించేలా చేయడానికి వినియోగదారులను అనుమతించే ఆప్షన్ ప్రవేశపెట్టింది.
🚨 NEW 🚨
Go Live with your Close Friends to ask for OOTD advice or just chat in real time 🎥✨ pic.twitter.com/wDYjqw1N4f— Instagram (@instagram) June 20, 2024