గత కొన్ని రోజులకు ముందు ట్విటర్ సేవలు కొంత అంతరాయం కలిగించాయి, అయితే ఇప్పుడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజర్లు ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడ్డ ఈ అంతరాయం వేలాది మంది వినియోగదారులను ప్రభావితం చేసిందని, యునైటెడ్ స్టేట్స్‌లో 46,000 కంటే ఎక్కువ మంది, యూకేలో 2,000 మంది, ఇండియా, ఆస్ట్రేలియా నుంచి 1,000 కంటే ఎక్కువమంది దీనిపైన పిర్యాదులు అందించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన అంతరాయానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ వినియోగదారులు లాగిన్ చేయడం, కంటెంట్‌ను పోస్ట్ చేయడం, యాప్ ఫీచర్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదుల్లో తెలిపారు. ఏదైనా సాంకేతిక సమస్యలకు సంబంధించినదా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు.
2022 సెప్టెంబర్ నెలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సమస్యలు తలెత్తాయని నివేదికలు వెల్లడించాయి. ఆ తరువాత అలంటి సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యకుగల కారణాలు త్వరలోనే తెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment