rahul ghandi
-
క్షమాపణ చెప్పేదే లే! కాంగ్రెస్ బీజేపీల మధ్య కొనసాగుతున్న పోరు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశం సైతం రసాభాసగ మారి ఉభయ సభల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే వాయిదాపడ్డాయి. అదే రగడ రెండో రోజు కూడా కొనసాగింది. లండన్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ పెద్ద ఎత్తున నిప్పులు చెరుగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ దాడిని పెంచుతూ..కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఒక సభ్యుడు విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే పార్లమెంట్ చూస్తూ కూర్చొదన్నారు. గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే, అన్ని పార్టీల ఎంపీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాల్సిందే అని డిమాండ్ చేసింది బీజేపీ. ఐతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చేసిన ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. పైగా ప్రజాస్వామ్యన్ని అణిచివేసేవారే రక్షించడం కోసం మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నాయకులు. దీంతో ఇరు పార్టీ మధ్య వాగ్వాదం సద్దుమణగకపోగా తీవ్రస్థాయికి చేరుకోవడంతో.. రెండో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమైన వెంటనే వాయిదాపడ్డాయి. ఈమేరకు మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు గురించి ప్రస్తావించారు. వారంతా మైనారిటీల దాడులు గురించి చెబుతున్నారు గానీ నాడు వేలాదిమంది సిక్కులు హత్యకు గురైనప్పుడు ఆ ఘటనలకు బాధ్యులైన వారిని సోనియా, రాజీవ్‌గాందీలు రక్షించారంటూ ఆరోపణలు గుప్పించారు. కాగా, కాంగ్రెస్‌కు చెందిన శక్తిసిన్హ గోహిల్ పీయూష్ గోయల్‌పై ప్రివలేజ్ ఉల్లంఘన నోటీసులు దాఖలు చేశారు. ఆ నోటీసుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా గోయల్ లోక్‌సభ సభ్యుడిని ఉద్దేశపూర్వకంగానే విమర్శించారని పేర్కొన్నారు గోహిల్. అలాగే ఏ సభ్యుడు మరో సభలోని సభ్యునిపై ఆరోపణలు చేయరాదనే చైర్ నిబంధనను గుర్తు చేశారు. అంతేగాదు తాము ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ గడ్డపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఎప్పుడూ లేవనెత్తలేదని కూడా అన్నారు. అయినా రాహుల్ క్షమాపణ చేప్పే ప్రశ్నే లేదని లోక్‌సభలోని కాంగ్రెస్ ఉపనేత మాణికం ఠాగూర్ అన్నారు. అసలు ఆ ప్రశ్నకు తావేలేదు ఎందుకంటే రాహుల్ కరెక్ట్‌గానే చెప్పారు. అయినా ఆర్ఎస్ఎస్కు చెందినవారు క్షమాపణ చెప్పనప్పుడూ కాంగ్రెస్‌కు చెందినవారు మాత్రం ఎందుకు చెప్పాలి అని నిలదీశారు. ఈ మేరకు ఠాగూర్ విదేశాల్లో ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలను సైతం ట్విట్టర్లో ఉంచారు. మోదీ విదేశాల్లో భారత్‌ని అవమానించారు కాబట్టి ముందు ఆయన క్షమాపణ చెప్పాలి లేదంటే సావర్కర్ లాగా చేయగలరు అని మాణిగం ఠాగూర్ అన్నారు. (చదవండి: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ) -
ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ మాజీ నాయకుడు, వాయ్‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అధికార బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రాహుల్ పర్యటన ముగింపు సందర్భంగా లండన్‌లోని చతం హౌస్ థింక్ ట్యాంక్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ భారతదేశంలో శాశ్వతంగా అధికారంలో ఉంటుందని భావిస్తోంది. కానీ అందులో నిజం లేదని, అలాని కాంగ్రెస్ పోతుందని అర్థం కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాలాన్ని పరిశీలిస్తే ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలోకి రాకమునుపే మేము పదేళ్లు అధికారంలో ఉన్నాం." అని అన్నారు. అలాగే మరోసారి ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెగాసెస్ గురించి మరోసారి ప్రస్తావించారు. అంతేగాదు భారత ప్రజస్వామ్యానికి మరమత్తులు చేపట్టడానికి ప్రతిపక్షాలన్ని కలిసి రావాలని పిలుపునిచ్చారు. భారత్‌లో జరుగుతున్న మార్పులను ఎత్తిచూపారు. తాము అధికారంలో ఉంటే గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టిసారిస్తాం అన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పోయిదనేది అవాస్తవం అని నొక్కి చెప్పారు. అలాగే కాంగ్రెస్ తోపాటు విదేశీ మీడియా సైతం భారత ప్రజాస్వామ్యంలో తీవ్ర సమస్య ఉందని హైలెట్ చేసి మరీ చెబుతోందన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ని ఫండమెంటలిస్ట్ ఫాసిస్ట్ సంస్థగా లక్ష్యం చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదీ దేశంలోని సంస్థలను స్వాధీనం చేసుకుంటోందని, దీన్ని ఒక రహస్య సమాజం అని పిలవచ్చని అన్నారు. ముస్లీం బ్రదర్ హుడ్ తరహాలో నిర్మితమైందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకుని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్నే అణిచేస్తుందని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పత్రికా, న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ఎన్నికల సంఘం తదితరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు రాహుల్. అలాగే భారత విదేశాంగ విధానంపై, భారత్ చైనా సంబంధాలపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. కాగా, విదేశీ గడ్డపై రాహుల్ భారత్‌ని దూషించారంటూ బీజేపీ ఆరోపించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ లండన్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత్‌కు ద్రోహం చేయకండి, భారత విదేశాంగ విధానంపై మీరు చేసిన వ్యాఖ్యలు మీ అవగాహనలేమికి నిదర్శనం అంటూ కొట్టిపారేశారు. విదేశీ గడ్డపై మీరు చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ నమ్మరన్నారు. ఆయన ఎంతసేపు తనను తాను హైలెట్ చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు అనురాగ్ ఠాగూర్. (చదవండి: కూతుళ్ల కోసం మళ్లీ పెళ్లి చేసుకుంటున్న జంట..ఓ తండ్రి గొప్ప నిర్ణయం..) -
జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఓ కొత్త లుక్‌లో రాహుల్: ఫోటోలు వైరల్
మొన్నటి వరకు భారత్ జోడో యాత్రలో ఫుల్ గడ్డం, జుట్టుతో కనిపించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా కొత్త లుక్‌లో కనిపించారు. ఒక్కసారిగా రాహుల్ జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఒక లెక్చరర్ మాదిరిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు లండన్‌లో ఒక వారం పర్యటించినున్న రాహుల్ మంగళవారమే అక్కడికి చేరుకున్నారు. అక్కడ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ విద్యార్థులతో మాత్రమే ఉపన్యసించనున్నారు. రాహుల్ కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్(కేంబ్రిడ్జ్ జేబీఎస్)ని కూడా సందర్శించి..అక్కడ 21వ శతాబ్దపు లెర్నింగ్ టు లిసన్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. అంతేగాదు రాహుల్ కేం బ్రిడ్జ్‌లో బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, ఇండియా-చైనా సంబంధాలు అనే అంశంపై యూనివర్సిటీ కార్పస్ క్రిస్టీ కాలేజ్ ట్యూటర్ అండ్ కోడైరెక్టర్, గ్లోబల హ్యూమానిటీస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ అయిన శ్రుతి కపిలాతో కలసి కొన్ని సెషన్లు కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ట్విట్టర్ వేదికగా భారత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. అందుకు సంబధించిన రాహుల్ కొత్త లుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. Rahul Gandhi in Cambridge. With a New Look 😎 pic.twitter.com/wOSZnl8MAE — Aaron Mathew (@AaronMathewINC) March 1, 2023 Rahul Gandhi ji in Cambridge. With a New Look 🫶🫶 #RahulGandhi pic.twitter.com/3GHKzm6q0r — Rabiul Hassan (@Rabiul__INC) March 1, 2023 (చదవండి: కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కేబినెట్లో సౌరవ్, అతిషిలకు చోటు) -
ఆ ముగ్గుర్నీ కలిశాకే ఈ నిర్ణయం తీసుకున్నా!..ఎప్పటికీ స్వెటర్స్ వేసుకోను
భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ టీషర్ట్స్ ధరించడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదీ కూడా శీతాకాలంలో ఇంత భయంకరమైన చలిలో సైతం రాహుల్ ఎందుకు టీషర్ట్స్ వేసుకుంటున్నారంటూ మీడియాతో సహా సర్వత్ర ఇదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై స్పందించారు. తాను ముగ్గురు బాలికలను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఆ చర్చలకు తెరదించారు. వారిని కలిసిన తర్వాత నుంచే టీ షర్టులు ధరించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందరూ ఈ టీ షర్ట్ ఎందుకు ధరిస్తున్నారు చలిగా అనిపించడం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. "ఐతే నేను కేరళలో ప్రవేశించినప్పుడూ కాస్త వేడిగ, తేమగా ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోకి వచ్చేటప్పటికీ కాస్త చల్లగా ఉంది. అప్పుడే అక్కడకి చిరిగిన బట్లతో ముగ్గురు పేద బాలికలు నా దగ్గరికి వచ్చారు. సరైన దుస్తులు ధరించకపోవడంతో చలికి గజగజ వణకుతున్నారు. దీంతో ఆరోజు నేను నిర్ణయించుకున్నా వారికి చలి అనిపించేంత వరకు(వారు స్వెటర్లు ధరించేంత వరకు) తనకు చలి అనిపించదు. అప్పటి వరకు నేను కూడా స్వెటర్స్ ధరించను. అంతేకాదు ఆ ముగ్గురు బాలికలకు చలి అనిపిస్తే రాహుల్‌కి కూడా చలి అనిపిస్తుందని ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారు. అయినా తాను టీషర్ట్స్ వేసుకోవడం అనేది ప్రధానాంశం కాదని, ఈ యాత్రలో తన వెంట వస్తున్న పేద రైతులు, కూలీలపై దృష్టి పెట్టండని మీడియాకి చురకలంటించారు. పేద రైతులు, కార్మికులు, వారి పిల్లలు చిరిగిని బట్టలు, టీషర్ట్లు, స్వెటర్లు ధరించకుండా ఎందుకు ఉన్నారో అనేది ప్రధానం, దాని గురించే ఆలోచించండి." అని చెప్పారు రాహుల్. కాగా జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగింది. జనవరి 30 కల్లా జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. इस टी-शर्ट से बस इतना इज़हार कर रहा हूं, थोड़ा दर्द आपसे उधार ले रहा हूं। pic.twitter.com/soVmiyvjqA — Rahul Gandhi (@RahulGandhi) January 9, 2023 (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ని పలువురు ఈ శీతకాలంలో మీరు ఎందుకు కేవలం టీ షర్ట్ ధరించి నడుస్తున్నారు, మీకు చలిగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా రాహుల్ రైతు, కార్మికుడు, పేద పిల్లలను ఎప్పుడైనా ఇలా అడిగారా అని ఎదురు ప్రశ్న వేశారు. నులు వెచ్చని బట్టలు ప్రాథమిక వస్తువులు, వాటిని కొనుగోలు చేయని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగారు. నేను సుమారు 2,800 కిలోమీటలర్లు నడిచాను కానీ అది ఏమంతా పెద్ద విషయం కాదు. నిజానికి వ్యవసాయం చేసే రైతులు, కార్మికులు, రోజు చాలా దూరం నడుస్తారు, కష్టపడతారు అని చెప్పారు. ఈ యాత్రలో అన్నిరకాల ప్రజలను కలిశాను. తాను ఇప్పుడూ ఎవరి చేయినైనా పట్టుకుని వారు ఏం పని చేశారో చెప్పగలను అన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ జోడో యాత్ర కాశ్మీర్లో ముగియనుంది. "నాకు సాధారణ ప్రజలలో ద్వేషం కనిపించలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. కానీ నాకు యాత్ర ప్రారంభించినప్పుడూ ప్రజల్లో ద్వేషం ఉంటుందేమోనని చాలా భయపడ్డాను." అని అన్నారు. రాహుల్ చేపట్టిన ఈ జోడోయాత్రలో ప్రముఖులు, స్టార్లు, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే తోపాటు తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రాతో సహా అగ్ర నేతలందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు. (చదవండి: జోడో యాత్రలో పాల్గొంటే పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందన్నారు’) -
కేవలం హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంగ్ల విద్యను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు పాఠశాలలో ఆంగ్ల విద్యను బోధించొద్దని గొడవ చేస్తున్నారు. కానీ వాళ్ల పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లోనే చదివిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుని మంచి పొజిషన్లో ఉండాలని కలలు కంటారని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన రాజస్తాన్‌లో అల్వార్‌లో భారత్ జోడోయాత్రలో భాగంగా పర్యటిస్తున్నప్పుడూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేవలం హిందీ మాత్రమే నేర్చుకుంటే..ప్రపంచంలో ఇతరులతో మాట్లాడటం సాధ్యం కాదని, కేవలం ఆంగ్ల విద్యతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు. కాబట్టి మాకు రైతులు, కూలీల పిల్లలు అమెరికన్లతో పోటీపడి ఇంగ్లీష్‌ని నేర్చుకుని తాము అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాని చెప్పారు. రైతులు పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదవకూడదని కూడదని బీజేపీ కోరుకుంటోందంటూ రాహుల్ ఆరోపణలు చేశారు. అంతేగాదు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ..హిందీ, తమిళం వంటి ఇతర భాషలను చదవకూడదని చెప్పడం లేదు. ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే ఇంగ్లీష్ తెలుసుకోవాలని అన్నారు. రాజస్తాన్‌లో తాము దాదాపు 1700 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికన్ పిల్లలకు సవాలు విసురుతూ... విద్యార్థులు ధీటుగా ఇంగ్లీష్ చదవాలని కోరుకుంటున్నాను అని రాహుల్ గాంధీ చెప్పారు. (చదవండి: విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు) -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యల వివాదం... తగ్గేదేలే! అంటున్న శివసేన
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ హిందూత్వ సిద్ధాంతాలను విశ్వసించే తాము సావర్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపక్షేంచమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో శివసేన నాయకుల ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు విషయంలో శివసేన రాజీపడేదే లేదని కరాకండీగా చెప్పేసింది. సావర్కర్ పదేళ్లకు పైగా అండమాన్ జైలులో ఉన్నారని అందువల్ల జైలు జీవితం అనుభవించిన వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుందని రౌత్ అన్నారు. ఇది కేవలం సావర్కర్ అనే కాదు అది నెహ్రు అయినా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా...ఎవరైనా సరే చరిత్రను వక్రీకరించడం సరికాదని తేల్చి చెప్పారు. రాహుల్‌గాంధీతో ఈ విషయం గురించి ఏమి చర్చించం, అలాగని ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించం అని అన్నారు. ఇకపై తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు అనేది రాజీపై నడుస్తుందని, పొత్తు ఎప్పటికీ రాజీయేనని తేల్చి చెప్పారు. ఐతే పొత్తు కోసం కాగ్రెస్‌తో కొనసాగుతాం, రాహుల్ గాంధీ, సోనియాలో మాట్లాడుతుంటాం. కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్‌తో తాము ఏకాభిప్రాయంతో ఉండమన్నారు. అలాగే హిందూత్వ విషయాల్లో రాజీపడం అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ తనని ఫోన్లో ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారని సంజయ్ రౌత్ ప్రశంసించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ తనను ఒక తప్పుడూ కేసులో ఇరికించి 110 రోజుల పాటు జైలులో చింత్రహింసలకు గురిచేశారని చెప్పారు. కాగా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జైలులో ఉన్న సావర్కర్ బ్రిటీష్ వారి దయ కోసం ఎదురు చూశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి తెర తీశాయ. దీంతో లెజెండరీ నాయకులు జవహార్ లాల్ నెహ్రో, మహాత్మగాంధీ, సర్దార్ పటేల్ వంటి నాయకులు కూడా బ్రిటీష్పాలనా కాలంలో జైలు పాలయ్యారని, వారిని కూడా రాహుల్ అవమానించినట్లేనని సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. ఏదీఏమైనా రాహుల్ చేసిన వ్యాఖ్యాలు ఇరు పార్టీ వర్గాల సభ్యలను కాస్త కలవరపాటు గురి చేశాయి. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
ఒట్టేసి చెబుతున్నాం.. పార్టీ మారబోం
పనాజి: గోవా రాజకీయాలంటేనే ఫిరాయింపులకు పెట్టింది పేరు. 40 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి కండువాలు మార్చేస్తూ ఉంటారు. దాంతో ప్రభుత్వాలు ఎప్పుడు పడిపోతాయో చెప్పలేం. ఈ దెబ్బకు సీఎంగా ఎవరున్నా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఈ ఫిరాయింపుల సంస్కృతికి ఇక స్వస్తి చెప్పాలంటూ కాంగ్రెస్ నినదిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో కొత్త సంప్రదాయానికి తెర తీశారు. పార్టీకి విధేయులుగా ఉంటామంటూ కాంగ్రెస్ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)కి చెందిన ముగ్గురు శుక్రవారం రాహుల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సమక్షంలో ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. గెలిచాక పార్టీ ఫిరాయించబోమని ముక్తకంఠంతో చెప్పారు. పార్టీ మారబోమని వీరంతా ఇప్పటికే ఆలయం, చర్చి, మసీదుల్లో ఒట్టు వేశారు. ఇప్పుడు రాహుల్ ముందూ ప్రతిజ్ఞ చేసి ఆ మేరకు ఆయనకు విధేయతా పత్రం సమర్పించారు. ఈసారి కాంగ్రెస్, జీఎఫ్‌పీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అందుకు అన్నివిధాలా సహకరిస్తామని అందులో పేర్కొన్నారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచినా ఏకంగా 15 మంది బీజేపీలోకి ఫిరాయించారు. దీంతో ఈసారి రాహుల్ ఇలా అభ్యర్థులతో ముందే ప్రమాణం చేయించుకున్నారు. -
రాహుల్ గాంధీ ఎవరు? ఆయన నాకు తెలియదు: ఒవైసీ
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. అజెండా ఆజ్‌తక్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత సుధాంశు త్రివేది పాటు పాల్గొన్నారు. వీరిద్దరూ ‘తమకు వ్యతిరేకంగా పోరాటం’ పేరుతో జరిగిన చర్చలో ఎవరు బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సెకండ్ గేమ్ ఆడుతున్నారన్న అంశంపై మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనరర్జీ తృణమూళ్ కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని ఆమె చూస్తోందని తెలిపారు. దానివల్ల మరో రెండు మూడు ఏళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లేకుండా పోతుందని అన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఎవరు? ఆయన తనకు తెలియదని ఒవైసీ ఎద్దేవా చేశారు. మీకు తెలిస్తే తనకు తెలియజేయాలని వ్యాఖ్యాతను ఎదురు ప్రశ్నిస్తారు. తాము ప్రతీ పార్టీకి బీ-టీమ్ పార్టీని ఆరోపించబడ్డామని అన్నారు. అయితే రాహుల్ గాంధీని ఇక్కడికి పిలిచినా ఆయన కూడా బీజేపీ వాళ్ల మాటే మాట్లాడుతాడని అన్నారు. ప్రస్తుతం టీఎంసీ పార్టీ బీ-టీం పార్టీగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమను బీజేపీ బీ-టీం పార్టీ అంటుందని, గోవాలో కాంగ్రెస్ ఎలా గెలుస్తోందో చూడాలని ఆసక్తిగా ఉందని తెలిపారు. ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేత సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎంఐఎం వంటి పార్టీ, ఒవైసీ వంటి నేత ఎదగడానికి కాంగ్రెస్ సాయం చేసిందని కౌంటర్ ఇచ్చాడు. -
Kanhaiya Kumar: కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య కుమార్
సాక్షి, ఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, కాంగ్రెస్ రాజకీయ పార్టీనే కాదు.. అంతకంటే గొప్పదైన సిద్ధాంతం అని పేర్కొన్నారు. దేశంలో గొప్ప ప్రజాస్వామిక పార్టీ అని, కాంగ్రెస్ లేకుండా దేశంలో పరిపాలన సరైన రీతిలో సాగదని అన్నారు. చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు కాంగ్రెస్ పార్టీ చాలా మంది ఆశయాలను నిలబెడుతూ ఉందని తెలిపారు. మహాత్మాగాంధీలోని ఏకత్వం, భగత్సింగ్లోని ధైర్యం, బీఆర్ అంబేద్కర్‌లోని సమానత్వం అన్నింటిని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని పేర్కొన్నారు. అందుకోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెప్ పార్టీతోనే భారతదేశం రక్షించబడుతుందని కోట్లాది మంది యూవత భావిస్తున్నారని అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కన్హయ్య కుమార్ సీపీఐ పార్టీ తరఫున బిహార్‌లోని బెగూసరయ్ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ రోజు కాంగ్రెస్ చేరాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల చేరలేదు. తాను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చేరలేదని జిగ్నేష్ మేవాని తెలిపారు. తాను స్వతంత్ర ఎమ్మెల్యేనని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముతానని తెలిపారు. గుజరాత్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్
గుజరాత్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గురువారం సూరత్ కోర్టుకు చేరుకున్నారు. పరువు నష్టం కేసు విషయంలో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు. 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తి చేసిన సూరత్ బీజేపీ ఎమ్మెల్యే ఆయనపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసు విచారణ నిమిత్తం 2019 అక్టొబర్‌లోనే మొదటి సారి రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలో ఎటువంటి తప్పులేదని కోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. చదవండి: పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా -
పార్లమెంటులో బడ్జెట్(2021-2022) సమావేశాలు
-
రాహుల్ సమక్షంలోనే సీట్ల సర్దుబాటు..
సాక్షి, చెన్నై: కాంగ్రెస్–డీఎంకేల మధ్య కూటమి దోస్తీ కొనసాగడం ఖాయమైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే కూటమి భాగస్వామైన కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై బుధవారం తొలి అడుగువేసింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దినేష్ గుండూరావు, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌తో చర్చ లు జరిపారు. కాంగ్రెస్ కోరినన్ని సీట్ల కేటాయింపు డీఎంకేకు సంకటంగా, సవాలుగా మారనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నా హాలపై అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. తమిళనాడు ఏ ఎన్నికలు వచ్చినా అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ అనాధిగా కొనసాగుతోంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఖరారైంది. డీఎంకే పదేళ్లుగా ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. రాబోయే ఎన్నికలను డీఎంకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డీఎంకే కూటమిలో అనేక పార్టీలుండగా వీటిల్లో కాంగ్రెస్ ప్రధానమైనది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండురోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడు కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగాలని, అపుడే గెలుపు సాధ్యమని కాంగ్రెస్ నేతలంతా రాహుల్‌ను కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దినేష్ గుండూరావు బుధవారం చెన్నైకి చేరుకున్నారు. రాహుల్ ఆదేశాలకు అనుగుణంగా డీఎంకేతో కూటమిని ఖరారు చేసేందుకు, సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ అళగిరి తోపాటు స్టాలిన్‌ను కలిశారు. డీఎంకే కూటమిలో ఉంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 8 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ కారణంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డీఎంకే అధికసీట్లు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ 45 సీట్లు కోరుతుండగా డీఎంకే 25– 30 స్థానాలను మాత్రమే కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. కమల్‌హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యంను డీఎంకే కూటమిలో కలుపుకుంటే మెజార్టీ స్థానాల్లో గెలుపొందవచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. రాహుల్‌గాంధీ చెన్నైకి రానున్నారు: గుండూరావు ఎన్నికల వ్యూహం, పోటీచేయదలచుకున్న స్థానాల అంశాలపై చర్చలు జరిపేందుకు త్వరలో రాహుల్‌గాంధీ చెన్నైకి రానున్నారని దినేష్ గుండూరావు తెలిపారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంలో బుధవారం రాత్రి స్టాలిన్‌ను ఆయన కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీచేయాలనే అంశంపై రాహుల్‌గాంధీ సమక్షంలోనే డీఎంకేతో చర్చలు జరుగుతాయని చెప్పారు. డీఎంకే కూటమి బలోపేతం చేయడం ఎలా అనే అంశంపై మాత్రమే స్టాలిన్‌తో మాట్లాడాం. సీట్ల సర్దుబాటు అంశం ఈరోజు అజెండా కాదని వ్యాఖ్యానించారు. -
మోదీకి చెప్పలేకపోవడమే అసలు సమస్య
న్యూఢిల్లీ: గాలిమరలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మోదీ అర్థం చేసుకోలేకపోవడం భారత్‌కు ఉన్న ప్రధాన సమస్య కాదు. కానీ ప్రధాని చుట్టూ ఉన్నవారెవరూ ఆయనకు చెప్పే సాహసం చేయలేకపోవడమే అసలు సమస్య’అంటూ మోదీ మాట్లాడుతున్న వీడియోను జత చేస్తూ ట్వీట్ చేశారు. ఆ వీడియోలో మోదీ గాలి మరలకు సంబంధించిన ఓ ప్రముఖ కంపెనీ సీఈఓతో మాట్లాడుతున్నారు. గాలి మరల నుంచి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆక్సీజన్, శక్తిని పొందవచ్చని మోదీ ఆ కంపెనీ సీఈఓకి సూచిస్తూ ఉండటం ఆ వీడియోలో కనిపించింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ చుట్టు ఉన్న వారెవరూ ఆయనకు అర్థం కావడం లేదని చెప్పడానికి సాహసించడం లేదు. ఓ పెద్ద కంపెనీ సీఈఓనే మోదీ ఆలోచనలను ఆలకిస్తుంటే, రాహుల్ మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు’అని ట్వీట్ చేశారు. దాంతో పాటు గాలి నుంచి నీటిని తయారు చేయవచ్చని చెప్పే ఓ న్యూస్ రిపోర్టును జత చేశారు. రాహుల్ గాంధీ సైన్స్ పరిశోధనా పత్రాలు చదవాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా ట్వీట్ చేశారు. మోదీ వ్యాఖ్యలపై ట్విట్టర్లో భారీగా ట్వీట్లు నమోదయ్యాయి. అందులో కొందరు మోదీకి మద్దతుగా ట్వీట్లు చేయగా మరికొందరు ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. -
‘చైనా సరిహద్దు వివాదంపై చర్చకు సిద్ధం’
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాహుల్ గాంధీ తీరుపై మండిపడ్డారు. ఓ మీడియ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. భారత సరిహద్దు వివాదం ఉద్రిక్తతలపై 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పార్లమెంట్లో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారంలేని(అనవసరపు)రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. (‘వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’) భారత్- చైనా సరిహద్దు వివాదంలో ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ చేసిన హ్యాష్ ట్యాగ్ ‘సరెండర్ మోదీ’ ఆరోపణల వెనుక పాకిస్తాన్, చైనాల హస్తం ఉందని అమిత్ షా తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వంపై పనిగట్టుకొని చేస్తున్న వ్యతిరేక ఆరోపణలపై చర్చించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఒక వైపు కరోనా వైరస్ వ్యాప్తి, మరోవైపు చైనా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనా దురాక్రమణకు అప్పగించారంటూ రాహుల్ గాంధీ ఇటీవల ట్విటర్లో ఆరోపించిన విషయం తెలిసిందే. -
మురళీధర్ బదిలీపై రాహుల్ స్పందన
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్లపై బుధవారం అర్థరాత్రి విచారణ జరిపి, సత్వర ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. (అర్థరాత్రి విచారణ.. ఆ న్యాయమూర్తి బదిలీ) అయితే జస్టిస్ ఎస్ మురళీధర్ ఆకస్మిక బదిలీపై ప్రతిపక్ష నేతలు కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. అంతే కాకుండా 2014లో సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసు విచారణ సమయంలో గుండెపోటుతో మరణించిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయాను గుర్తు చేస్తూ ట్విట్ చేశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను.. అనంతరం నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. Remembering the brave Judge Loya, who wasn’t transferred. — Rahul Gandhi (@RahulGandhi) February 27, 2020 -
కౌన్ బనేగా పిఎం?
-
వైఎస్ఆర్ ఘనతను బాబుకు తాకట్టు పెట్టిన కాంగ్రెస్
-
ఈ బంధం వరమా, శాపమా?
స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా, అరవై ఆరు సంవత్సరాల కిందట ప్రప్రథమంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్య వ్యవస్థ క్రమంగా బలపడవలసింది. కానీ కృశించిపోతున్నది. రాజ్యాంగస్ఫూర్తి అడు గంటుతోంది. సంప్రదాయాలూ, మర్యాదలూ మంటగలుస్తున్నాయి. ఎన్నికలు ఒక ప్రహసనంగా, ధనబలం, కులబలం, కండబలం ప్రదర్శించే అమానవీయ సందర్భంగా తయారైనాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం తగ్గిపోతోంది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారం చెలాయిస్తున్న పార్టీలే రాజ్యాంగాన్ని ఖాతరు చేయడం లేదు. అత్యున్నత న్యాయస్థానం తీర్పులను తుంగలో తొక్కుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా అధికార పార్టీలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. శబరిమలై ఉదంతం ఇందుకు తాజా ఉదా హరణ. నైతికవర్తనం, విలువలు పాటించడం చేతగానితనంగా పరిగణిస్తు న్నారు. అడ్డదారులు తొక్కేవారూ, విలువలకు పాతరేసేవారూ, అక్రమంగా నిధులు స్వాహా చేసేవారూ మహానాయకులుగా చలామణి అవుతున్నారు. వారికి రాజకీయం గులామై వంగి వంగి సలాం చేస్తున్నది. రాజకీయం అంటే ఎన్నికలలో డబ్బు విపరీతంగా ఖర్చు చేసి గెలుపొందడం, అధికారం హస్తగతం చేసుకున్న అనంతరం అంతకు కొన్ని రెట్లు డబ్బు సంపాదించడం అన్నది సరి కొత్త సిద్ధాంతమై కూర్చున్నది. అందుకే ఎన్నికలలో పోటే చేసేందుకు విపరీ తమైన వెంపర్లాట. టిక్కెట్ల కోసం పోరాడుతున్నది ఎవరు? టిక్కెట్లు ఇస్తున్నది ఎవరికి? అభ్యర్థులలో మహిళలు ఎందరు? సేవాభావం త్రికరణశుద్ధిగా కలిగిన వారెందరు? మచ్చలేనివారెందరు? మేధావులెందరు? టిక్కెట్ల కోసం పాట్లు హైదరాబాద్‌లో, ఢిల్లీలో కాంగ్రెస్, టీడీపీ నాయకులూ, కార్యకర్తలూ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోసం, టిక్కెట్ల కోసం ధర్నాలు చేస్తున్నారు. తమ పేరు అభ్యర్థుల జాబితాలో లేనందుకు నిరసన ప్రకటిస్తున్నారు. ‘ఫలానావారికి టిక్కెట్టు ఇస్తే ఓడించి తీరుతాం’ అంటూ హెచ్చరిస్తున్నారు. నకిరేకెల్లో పోటీ చేయడానికి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్‌కి టిక్కెట్టు ఇస్తే ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తామని కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకులే బాహాటంగానే చెబుతున్నారు. ఆ నియోజకవర్గంలో తమ మిత్రుడు చిరుమర్తి లింగయ్యకు టిక్కెట్టు దక్కకపోతే తానూ, తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి ఎన్నికలలో పోటీ చేయబోమంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢంకాబజాయించి ప్రకటించారు. నకిరేకల్, ఖానాపూర్, ఉప్పల్ నియోజక వర్గాలలో పోటీ చేసే అవకాశం కోరుతున్న ఆశావహుల నినాదాలతో తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయమైన గాంధీభవన్ శనివారం దద్దరిల్లిపోయింది. ఒకానొక అనుచరుడు ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు చెబుతున్నారు. టిక్కెట్లు పంపిణీ చేసే తరుణంలో ఆవేశకావేశాలు పోటెత్తడం కొత్త కాదు. కోమటిరెడ్డి సోదరులు వీరంగం వేయడం వింత కాదు. టీడీపీ అభ్యర్ధిత్వం ఆశిస్తున్న నాయకుడే స్వయంగా ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో నిరసనదీక్ష చేపట్టారు. ఇంతవరకూ లేని కొత్త ధోరణి తెలంగాణలో కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి శాసనసభ ఎన్నికలలో 35 ఏళ్ళుగా జరగని ఒకానొక పరిణామం జరుగుతోంది. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఆవిర్భవించిన టీడీపీ అదే పార్టీతో భుజం కలిపి తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో యోధులను మోహరించింది. టీడీపీతో కలిస్తే తప్పేమిటంటూ జానారెడ్డి వంటి నాయకులు ప్రశ్నించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయనకు రాజకీయంగా గుర్తింపు ప్రసాదించిన పార్టీ టీడీపీ. ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో అత్యధిక శాఖలను నిర్వహించిన మంత్రిగా జానారెడ్డి సాధించిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరుమీదే ఉన్నది. కాంగ్రెస్‌లోనే పుట్టి ఆ పార్టీలోనే కట్టుగా కొనసాగుతున్నవారికీ, టీడీపీతోనే రాజకీయ అరంగేట్రం చేసి అదే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికీ కాంగ్రెస్–టీడీపీ మైత్రి జీర్ణం కాదు. పచ్చి అవకాశవాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల రంగ ప్రవేశం చేసే వరకూ కాంగ్రెస్, తెలంగాణ జన సమితి (టీజేఎస్), సీపీఐల కూటమికి విజయావకాశాలు కొద్దోగొప్పో పెరుగుతున్నట్టు కనిపించాయి. ముందస్తు ఎన్నికలకు సాహసిం చడం, 105 మంది అభ్యర్థులను ఏకబిగిన ప్రకటించడం, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఎంఎల్ఏలు ఎవరో తెలిసి కూడా వారికే టిక్కెట్టు ఇవ్వాలని నిర్ణయించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించారని భావించినవారు లేకపోలేదు. చంద్రబాబు రాహుల్‌గాంధీతో కరచాలనం చేసిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని తెలం గాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి భయపడవలసిన అవసరం లేదని సంకేతాలు అందాయి. టీఆర్ఎస్ చేతికి ఆయుధం మొన్నటిlవరకూ ఎన్నికల ప్రచారంలో ఎవరిపైన దాడి చేయాలన్న విషయంలో స్పష్టత లేని టీఆర్ఎస్ నాయకత్వానికి చంద్రబాబు ప్రవేశం మంచి అవకాశం ప్రసాదించింది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ను ఎంత విమర్శించినా ప్రజలకు ఆవేశం రాదు. తెలంగాణ కల సాకారం కావడంలో కాంగ్రెస్ పాత్ర నిశ్చయంగా ఉన్నదనే విషయం ప్రజలకు తెలుసు. ప్రొఫెసర్ కోదండరామ్‌పైన ఆరోపణలు చేయడానికి ఆయన ఎన్నడూ అధికారంలో ఉన్న వ్యక్తి కాదు. అధికార రాజకీయాలు నెరపిన అనుభవం ఉన్న మనిషి కాదు. అక్రమంగా ఆర్జించాడని కానీ, బంధుప్రీతి ప్రదర్శించాడని కానీ ఆయనపైన ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2009 తర్వాత కోదండరామ్ పోషించిన పాత్ర విస్మరించదగినది కాదు. కాంగ్రెస్ కూటమిలో చేరినందుకు ఆయనను విమర్శించినా ప్రజలు పెద్దగా స్వీకరించరు. కాంగ్రెస్‌ను అంటరాని పార్టీగా ప్రజలు భావించడం లేదు. గడ్డం పెంచిన ప్రతివాడూ గబ్బర్‌సింగ్ కాలేడంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డిని ఎద్దేవా చేసినా ప్రజలు అంతగా ఆమోదించలేదు. ప్రత్య ర్థులపై శరసంధానం చేయడం సర్వసాధారణం. కానీ వాగ్యుద్ధంలో గెలు పొందాలంటే మాటల ఈటెలు లక్ష్యాన్ని ఛేదించాలి. విమర్శ సమంజసంగా, హేతుబద్ధంగా ఉండాలి. చంద్రబాబు రాకతో టీఆర్ఎస్కు కొత్త ఆయుధం లభించింది. టీడీపీ టిక్కెట్టుపైన కానీ టీజేఎస్ టిక్కెట్టుపైన కానీ పోటీ చేసి గెలిచేవారు ఆ పార్టీలలోనే కొనసాగుతారన్న భరోసా లేదు. నేషనల్ డెమొ క్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)కి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి పార్టీ ఫిరా యింపుల విషయంలో పట్టింపులేదు. ఇందుకు అభ్యంతరం చెబుతూ మాట్లాడిన ఒకే ఒక అగ్రనాయకుడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజ్యసభ అధ్యక్షుడుగా జేడీ(యు) తిరుగుబాటు దారులపైన వేటు వేశారు. అంతే కానీ చంద్రబాబు 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను కొనుగోలు చేయడాన్నీ, వారిలో నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇచ్చి గౌరవించడాన్నీ ఆక్షేపించలేదు. ఫిరాయింపులను ప్రోత్స హించిన అనైతిక రాజకీయ నాయకుడంటూ చంద్రబాబును కేసీఆర్ సైతం దుయ్యపట్టలేరు. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు తగులుతున్నారంటూ ఆరో పించవచ్చు. చంద్రబాబు అంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించింది లేదు. రాష్ట్రాన్నీ, రాష్ట్ర ప్రజల సమస్యలనూ పట్టించుకోకుండా నాలుగున్నర సంవత్స రాల పాటు అమరావతిని ప్రపంచంలోని అయిదు మహానగరాలలో ఒకటిగా నిర్మించాలన్న ఆకాంక్షతో డిజైన్ల పేరుతో సింగపూర్, జపాన్, బ్రిటన్ తదితర దేశాల చుట్టూ తిరిగారు. ఇంతవరకూ డిజైన్లు ఖరారు కాలేదు. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. ఇంతవరకూ నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణం తాత్కాలికమేనని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరువు జిల్లాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చంద్రంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అంచనాలు పెంచడం, నామినేషన్‌పైన కాంట్రాక్టులు ఇవ్వడం నిరాఘాటంగా సాగిపోతోంది. ఒక వేళ టెండర్ పిలిచినా తాము పనులు అప్పగించదల్చుకున్న వారికి సరిపోయే అర్హతలను టెండర్ నోటీసులో పేర్కొనడం పరిపాటిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో పౌరసమాజం ప్రశ్నించకపోవడంతో టీడీపీ ఇష్టా రాజ్యం సాగుతోంది. ఆరోగ్యం, విద్య ప్రైవేటు శక్తుల కబంధ హస్తాలలో విలవిల లాడుతున్నాయి. పుణ్యభూమి కమిటీల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ లావాదేవీలు మామూలైపోయినాయి. పని కంటే ప్రచారానికి ప్రాధాన్యం అధికం. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పమని అడగడంతో ఎన్డీఏతో తెగతెం పులు చేసుకున్నారు. ఇంట గెలవకుండా రచ్చకు... ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించే ప్రయత్నంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను కూడగట్టే బాధ్యత తనంతట తానే నెత్తికెత్తుకున్నారు. ఇంట గెలవకుండా రచ్చ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పేరుకుపోతున్న సమస్యలను పట్టించుకోకుండా దేశాన్ని ఉద్ధరిస్తానంటూ ప్రత్యేక విమానంలో బెంగళూరు, చెన్నై నగరాలను సందర్శించడం, కాంగ్రెస్ కూటమిలో ఎప్పటి నుంచో ఉన్నవారిని తాను అదే కూటమిలోకి కొత్తగా ఆహ్వానించడం విశేషం. స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె 2004 నుంచీ యూపీఏలో భాగస్వామి. పద్నా లుగు సంవత్సరాలుగా కలసి పని చేస్తున్న పార్టీల మధ్య సయోధ్య కుదుర్చుతు న్నట్టు కనిపించడం జాతీయ స్థాయిలో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు ప్రజలను నమ్మించడానికే. ఇదే పరిణామ క్రమంలో రాహుల్ ప్రత్యేక దూతగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అమ రావతిలో చంద్రబాబును కలుసుకున్నారు. వారిద్దరూ ఏమి చర్చించుకున్నారో ఊహించుకోవచ్చు. టీడీపీ అధినేత దగ్గర నిధులు దండిగా ఉన్నాయనీ, రాహుల్ దగ్గర నిండుకున్నాయనీ రాజకీయవర్గాలలో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అధి కారంలో ఉన్న రాష్ట్రాలే రెండున్నర. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమ రేంద్రసింగ్ ముక్కుసూటి మనిషి. నిధుల విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. కర్ణాటకలో మిశ్రమ ప్రభుత్వం. మిజోరం బుల్లి రాష్ట్రం. ఏఐసీసీ కార్యాలయం నిర్వహణ కూడా భారంగా మారిన పరిస్థితి. నేటి రాజకీయంలో నిధులు ఉన్నవారే నాధులు కనుక టీడీపీ అధినేతది పైచేయి అవుతున్నది. అందుకే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికలలో చంద్రబాబు దిశానిర్దేశం పాటిం చాలని రాహుల్‌గాంధీ అనుకున్నట్టున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం కంటే, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పుంజు కోవడం కంటే జాతీయ స్థాయిలో యూపీఏను నిలబెట్టడానికి రాహుల్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రబాబు సూచనల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయిస్తే నష్టం జరుగుతుందని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పినా రాహుల్ పెడచెవిన పెట్టినట్టు సమాచారం. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రాహుల్‌ని కలవటం, గెహ్లాట్ అమరావతి వచ్చి చంద్రబాబుతో భేటీ కావడం, రాహుల్ కూడా త్వరలోనే అమరావతి సందర్శించాలని నిర్ణయించుకోవడం తెలంగాణలో టీఆర్ఎస్కు కలసి వచ్చే అంశాలు. తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తున్న టీడీపీతో కాంగ్రెస్ అంటకాగుతున్నదని ప్రభావవంతంగా ప్రచారం చేయగలిగితే ఎన్నికల సంగ్రామంలో టీఆర్ఎస్ గెలుపు సులువు. ఎన్నికల ప్రచా రంలో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ కావాలో లేక చంద్రబాబు చెప్పుచేతలలో ఉండే కాంగ్రెస్ నాయకుడు కావాలో తేల్చుకోవాలని ప్రజలను టీఆర్ఎస్ నాయ కులు అడుగుతున్నారు. ఢిల్లీ గులాములూ, అమరావతి అనుచరులూ పాలకు లైతే పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఏమి అవుతాయో ఊహించుకోమని చెబుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు చంద్రబాబు అడ్డుతగులుతున్నారంటూ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రాసిన పందొమ్మిది అంశాల లేఖకు జవాబు చెప్పడం కష్టం. కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు పోరాటంగా తెలంగాణ ఎన్నికలను అభివర్ణించి ప్రజలను ఒప్పించగలిగితే టీఆర్ఎస్ విజయం తథ్యం. టీడీపీతో పొత్తు కాంగ్రె స్కు ఎంత లాభిస్తుందో చెప్పడం కష్టం. టీఆర్ఎస్కు మాత్రం దండిగా లాభిస్తుం దనేది స్పష్టం. కె. రామచంద్రమూర్తి -
పాపం...రాహుల్
ముంబై, మహారాష్ట్ర : రాజకీయాల పరంగా ఎన్ని విబేధాలున్నప్పటికి ప్రధానమంత్రి మోదీతో సహా పలువురు రాజకీయ నాయకులు ‘బర్త్‌డే బాయ్’ రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ మాత్రం ఈ రోజు కూడా రాహుల్‌ను విడిచిపెట్టడం లేదు. పూణెకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ రెబల్ రాహుల్‌కు వెరైటీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. మహారాష్ట్ర పూణెకు చెందిన షెహ్జాద్ తన ట్విటర్లో ‘ఇప్పటికే అర్థ శతాబ్దాన్ని పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మీరు బలవంతంగా చేస్తున్న ఈ ఉద్యోగాన్ని(కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి) వదిలి, కనీసం 2019 నాటికైనా మీ మనసుకు నచ్చిన ఉద్యోగాన్ని పొందాలని ఆశిస్తున్నాను’ అంటు ట్వీట్ చేసాడు. షెహ్జాద్ చేసిన మెసేజ్... Happy Birthday Rahul Gandhi ji! As you near half a century, I pray for your long life, and hope in 2019 you can pursue a profession which your heart really intends to pursue, rather than a job you have been forced to take up.. గతంలోను... షెహ్జాద్ రాహుల్‌ను విమర్శించడం ఇదే ప్రథమం కాదు. గతంలో రాహుల్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు కూడా షెహ్జాద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. ‘రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా లేరు. వారసత్వం ప్రకార పట్టాభీషక్తుడయ్యే మొఘల్ సామ్రజ్యపు రాజులా ఉన్నారని విమర్శించాడు. రాహుల్ ఎన్నిక ప్రక్రియ మొఘల్ తరహా వారసత్వ పట్టాభీషేక ప్రక్రియాలా ఉంద’ని ఎద్దేవా చేశాడు. -
బస్సు యాత్రలో రాహుల్‌కు చేదు అనుభవం
-
ఏంటి పరిస్థితి: సీఎంకు రాహుల్ ఫోన్
న్యూఢిల్లీ: గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో బస చేస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా బుధవారం ఉదయం ఆదాయపన్నుశాఖ (ఐటీ) రంగంలోకి దిగింది. కర్ణాటక మంత్రి శివకుమార్, ఎంపీ డీకే సురేశ్ సహా గుజరాత్ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్పైనా ఊహించనిరీతిలో దాడులు చేసింది. మొత్తం 38 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంలో కర్ణాటకలో సంచలనం రేపింది. ఈ అనూహ్య పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇది బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్న హస్తం నేతలు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఐటీ దాడుల నేపథ్యంలో అధైర్యపడొద్దని ఆయన పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువచ్చింది. బెంగళూరులో ఐటీ దాడుల అంశం రాజ్యసభను కుదిపేసింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఐటీ దాడులను తప్పుబడుతూ.. సభలో ఆందోళనకు దిగారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 44మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఈగల్ టన్ గోల్ఫ్ రిసార్ట్‌లో బస చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికల జరగనున్నాయి. అప్పటివరకు ఎమ్మెల్యేలు జారిపోకుండా.. బీజేపీ వల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తగా కర్ణాటకకు తరలించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ తమ ఎమ్మెల్యేలపై బీజేపీ ప్రలోభాలకు గురిచేయలేదని భావించింది. ఈ నేపథ్యంలో రిసార్ట్‌లో గుజరాత్ ఎమ్మెల్యేల బాగోగులు చూసుకుంటున్న కర్ణాటక మంత్రి శివకుమార్‌పై ఐటీ దాడులు జరగడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది.