న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్లపై బుధవారం అర్థరాత్రి విచారణ జరిపి, సత్వర ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. (అర్థరాత్రి విచారణ.. ఆ న్యాయమూర్తి బదిలీ)
అయితే జస్టిస్ ఎస్ మురళీధర్ ఆకస్మిక బదిలీపై ప్రతిపక్ష నేతలు కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. అంతే కాకుండా 2014లో సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు విచారణ సమయంలో గుండెపోటుతో మరణించిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయాను గుర్తు చేస్తూ ట్విట్ చేశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను.. అనంతరం నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Remembering the brave Judge Loya, who wasn’t transferred.
— Rahul Gandhi (@RahulGandhi) February 27, 2020
Comments
Please login to add a commentAdd a comment