See Latest Photo Of Ayodhya Ram Temple Sanctum Sanctorum Goes Viral - Sakshi
Sakshi News home page

అయోధ్య రామమందిర గర్భగుడి తొలి చిత్రం.. ఫొటో వైరల్‌

Published Fri, Mar 17 2023 7:52 PM | Last Updated on Fri, Mar 17 2023 7:58 PM

See Latest Photo Of Ayodhya Ram Temple Sanctum Sanctorum Viral - Sakshi

లక్నో: నిర్మాణ దశలో ఉన్న అయోధ్య రామమందిరం ఫొటోలు ఈ మధ్య తరచూ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఆలయ గర్భగుడి తాలుకా ఫోటోను రిలీజ్‌ చేశారు రామ మందిర ట్రస్ట్‌ కీలక సభ్యుడు ఒకరు. 

అయోధ్య గర్భగుడి ఇదేనంటూ ఫొటోను శుక్రవారం ట్వీట్‌ చేశారాయన. గర్భగుడి పైభాగ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ రాములోరి విగ్రహం ఇక్కడే కొలువుదీరబోతోందని పేర్కొంటూ జై శ్రీరామ్‌ అంటూ క్యాప్షన్‌ ఉంచారాయన. 

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రకు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌. ఆయనే నిర్మాణంలో ఉన్న గర్బగుడి ఫొటో ఉంచారు. ఇక గర్భగుడిలో కొలువు దీరబోయే ప్రధాన విగ్రహాలను చెక్కేందుకు నేపాల్‌ నుంచి పవిత్రమైన రాళ్లను తెప్పించిన సంగతి తెలిసే ఉంటుంది. 

ఇదీ చదవండి: సాలిగ్రామ శిలల పవిత్రత గురించి తెలుసా?

రామ మందిరం 2024 మొదట్లోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే.. ఆలయం కింది అంతస్తు పనులు సగం భాగం దాటాయి. ఆగస్టు నాటికి గర్భగుడి నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. గర్భగుడి కింది అంతస్తులో 170 స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement