Newly Wedding Couple Manchu Manoj And Mounika Started to Kurnool From Hyderabad - Sakshi
Sakshi News home page

Manchu Manoj-Mounika: భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్‌.. వీడియో, ఫొటోలు వైరల్‌

Mar 5 2023 10:30 AM | Updated on Mar 5 2023 11:03 AM

Newly Wed Couple Manchu Manoj And Mounika Started to Kurnool From Hyderabad - Sakshi

ఎట్టకేలకు టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనికలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం వీరి వివాహం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. పెళ్లి అనంతరం నేడు ఈ కొత్త జంట ముందుగా కర్నూల్‌కు వెళ్లనుంది. తాజాగా మనోజ్‌ భార్యతో కలిసి అత్తారింటికి బయలు దేరిన ఫొటోలు బయటకు వచ్చాయి. 

చదవండి: నమ్మిన వ్యక్తే దారుణంగా మోసం చేశాడు: ‘మిర్చి’ నటి ఆవేదన

తన సోదరి మంచు లక్ష్మి ఇంటి నుంచి నేరుగా మనోజ్‌, మౌనికలు కర్నూలుకు పయనమయ్యారు. భారీ బందోబస్తు మధ్య రోడ్డు మొత్తం కార్లు, కాన్వాయ్‌లతో వీరి ప్రయాణం సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మొదట పొద్దుటూరు వెళ్లి అనంతరం ఆళ్లగడ్డ ప్రాంతంలోని మౌనిక తల్లిదండ్రుల సమాధులను ఈ కొత్త జంట దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనుందని సమాచారం. కాగా కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న మనోజ్‌, మౌనికలు మార్చి 3న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement