వారి లోటును భర్తీ చేయలేను.. కానీ మాటిస్తున్నా: మంచు మనోజ్ ఎమోషనల్ | Manchu Manoj Shares Emotional Post On Their Wedding Anniversery | Sakshi
Sakshi News home page

Manchu Manoj: మీరు వచ్చాకే నా జీవితం అసాధారణం: మంచు మనోజ్

Published Sun, Mar 3 2024 7:50 PM | Last Updated on Mon, Mar 4 2024 9:34 AM

Manchu Manoj Shares Emotional Post On Their Wedding Anniversery - Sakshi

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్‌బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. తాజాగా తమ మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మనోజ్‌ తన భార్యకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

మనోజ్ తన ట్వీట్‌లో రాస్తూ..'నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రోజు ప్రేమ, ఆనందంతో నిండిన అద్భుతమైన ప్రయాణమిది. ధైరవ్, మనకు పుట్టబోయే బిడ్డ కోసం ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ ఉనికి నా జీవితాన్ని ప్రేమ, సాంగత్యంతో అసాధారణంగా మార్చేసింది. మీ తల్లిదండ్రుల లోటును ఎన్నటికీ భర్తీ చేయలేనప్పటికీ.. వారి జీవితంలో అత్యంత విలువైన వారిని సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్నా. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని కాపాడతానని మాటిస్తున్నా. ఇక్కడ మాకు, మా కుటుంబానికి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నా భార్యమణికి పెళ్లి రోజు శుభకాంక్షలు. మీరు నా హృదయం, ఆత్మలో అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమించే మను' అంటూ లవ్‌ సింబల్‌ను పోస్ట్ చేశారు.

కాగా.. ఇటీవలే మౌనిక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు మనోజ్‌ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఏడాదిలోనే మనోజ్- మౌనిక తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మౌనిక సైతం పెళ్లి రోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement