Tiruchirappalli
-
కొత్త టెర్మినల్ ని ప్రారంభించిన మోదీ
-
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
తిరువనంతపురం: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, విమానాన్ని ముందు జాగ్రత్తగా కేరళలో తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. 154 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సోమవారం ఉదయం 10.45 గంటలకు తిరుచిరాపల్లి నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకుంది. కొద్దిసేపటికే ఇంజిన్‌లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితి ప్రకటించి, మధ్యాహ్నం 12.01 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తిరువనంతపురం–బహ్రెయిన్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో నిలిచిపోయిందని ఎయిరిండియా పేర్కొంది. -
ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో.. నాలుక్కరుచుకోవడం ఖాయం!
బాలా దర్శకత్వం వహించిన తమిళ సినిమా అవన్ ఇవన్ (తెలుగులో వాడు వీడు)లో యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఆఫ్‌బీట్ సాంగ్ ‘హే...డియో డియో డోలే’ పాట వినిస్తే పాదాలు ‘కమాన్ డ్యాన్స్’ అంటాయి. తిరుచిరాపల్లి(తమిళనాడు) కేంబ్రిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో కెల్లా హైలెట్‌గా నిలిచింది ముగ్గురు పిల్లల డ్యాన్స్. జడలో మల్లెలు తురుముకొని, సంప్రదాయ చీరెలు ధరించి ‘హే...డియో డియో డోలే’ పాటకు ముగ్గురు పిల్లలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో’ అని ఆ వీడియోను చూసి ప్రశంసించిన వారు నాలుక కరుచు కోవడానికి అట్టే టైమ్ పట్టలేదు. నిజానికి వారు బాలికలు కాదు బాలురు! View this post on Instagram A post shared by M.P. Dhasvanth (@m.p.dhasvanth) View this post on Instagram A post shared by Tamil Animals Life (Animals Lovely Page) (@tamilanimalsloop) -
Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి Vs ఎంపీ!
తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్ స్టేషన్లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్ నేతగా కేఎన్ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్ మహేశ్ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిరసనతో మొదలై.. తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్‌లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు. ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేశారు. தேர்தலுக்கு முன்னாடியே போலீஸ் ஸ்டேசனுக்கு லஞ்சம் குடுத்த @KN_NEHRU வை அமைச்சரா ஆக்குனா ஸ்டேசன்ல இதான் நடக்கும். pic.twitter.com/XezvEN06DW — Savukku Shankar (@Veera284) March 15, 2023 నెల్లైలోనూ వివాదం.. తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్ వకాబ్ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్ వకాబ్ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్ శరవణన్‌కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్‌ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్లో లొంగి పోయారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. -
మైనర్‌తో టీచరమ్మ ప్రేమ పాఠాలు.. ఇద్దరు కలిసి ఫ్రెండ్ ఇంట్లో..
సాక్షి, చెన్నై: ఆమె ఓ టీచర్.. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టింది. మైనర్‌కు ప్రేమ పాఠాలు చెప్పి.. మాయ మాటలతో అతడిని తన వెంట తిప్పుకుని ఓ గుడిలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. చివరకు పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరుచురాపల్లి జిల్లా తురాయుర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి(17).. 11వ తరగతి చదువుతున్నాడు. అతడు రోజులాగే మార్చి 5వ తేదీన బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతడి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి కంగుతున్నారు. విచారణలో భాగంగా.. విద్యార్థి చదివే స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళ కూడా అదే రోజు నుంచి మిస్స్ అయినట్టు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆరా తీశారు. ఈ క్రమంలో షర్మిల తల్లి.. తన కూతురు ఫోన్లో ఓ విద్యార్థితో మాట్లాడుతుండేదని పోలీసులకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు.. తంజావూర్, వెళాంకిణి, తిరువారూర్, తిరుచిరాపల్లిలో ఫోన్ సిగ్నల్స్ గుర్తించారు. మార్చి 25వ తేదీన సిగ్నల్ ఆధారంగా ఆమె పుత్తూర్‌లో ఉన్నట్లు కనిపెట్టారు. దీంతో అక్కడికి వెళ్లాగా.. వారిద్దరూ అప్పటికే తాంజావూర్‌లోని ఓ గుడిలో పెళ్లి చేసుకొని.. షర్మిల ఫ్రెండ్ ఇంట్లో కాపురం పెట్టినట్టు గుర్తించారు. కాగా, మైనర్‌ను అపహరించి, పెళ్లి కూడా చేసుకున్నందుకు షర్మిలపై పోలీసులు పోక్సో చట్లం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం మైనర్‌కు అతడి పేరెంట్స్‌కు అప్పగించారు. -
‘నాకు సిగ్గేస్తుంది.. ఫోటోలు తీయొద్దని చెప్పు’
చెన్నై: మనుషులు ప్రైవసీకే విలువ ఇవ్వం.. ఇక జంతువుల ప్రైవసీని పట్టించుకుంటామా.. లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడంటే అప్పుడు విపరీతంగా ఫోటోలు తీయడం సోషల్ మీడియాలో షేర్ చేయడం. ఇదే పని చాలామందికి. ఇక జంతువులను ఫోటోలు, వీడియోలు తీయడం కొందరికి చాలా సరదా. వాటికి ఇబ్బంది కలగనంతవరకు ఓకే. కానీ చిరాకు అనిపించింది అనుకోండి.. అప్పుడు మన ఫోటో గొడెక్కుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఫోటోలంటే సిగ్గుపడే ఆ ఏనుగు తనను ఫోటోలు తీయొద్దని చెప్పమంటూ మావటి దగ్గరకి వెళ్లి ఎంతో ముద్దుగా చెప్తుంది. ఆ వ్యక్తి ఏనుగును కన్విన్స్ చేసి.. ఫోటోలు దిగడానికి ఒప్పిస్తాడు. ప్రసుత్తం వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (చదవండి: గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు దాడి) ఆ వివరాలు.. ఈ వీడియో తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయంలో తీశారు. ఇక దీనిలో కనిపించేది ఆండాల్ అనే ఆడ ఏనుగు. ఇక వీడియోలో ఓ గుమ్మంలో మావటి కూర్చుని ఉంటాడు. ఏనుగు అతడి దగ్గరకు వెళ్లి తన భాషలో మావటితో ‘ఫోటోలు తీయొద్దని చెప్పు.. నాకు సిగ్గేస్తుంది’ అని చెప్తుంది. అతడు ఏనుగు తొండాన్ని కౌగిలించుకుని.. ‘పర్లేదు.. వాళ్లు నీతో ఫోటో దిగాలని ఆశపడుతున్నారు. వెళ్లి దిగు’ అంటూ నచ్చజెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక మావటి అడిగిన ప్రశ్నలకు ఏనుగు తల ఊపుతూ సమాధానాలు ఇవ్వడం వీడియోలో హైలెట్. ఏనుగు-మావటిల మధ్య జరిగిన సంభాషణ తీరు చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఎంత ముద్దుగా మాట్లాడుతుందో.. భాష తెలియకపోతనేం.. భావం అర్థం అవుతుంది కదా’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
వైద్యుడిపై ఉమ్మివేసిన కరోనా బాధితుడు
చెన్నై : తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపై కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి ఉమ్మి వేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఓ పేషెంట్ శనివారం రోజున చేరాడు. అయితే అతడు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులకు సహకరించకుండా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన మాస్క్‌ను తీసివేసి దానిని డాక్టర్‌పై విసిరేశాడు. అంతటితో అగకుండా వైద్యునిపై ఉమ్మి వేశాడు. అలాగే ఆస్పత్రి సిబ్బందిని, ఇతర కరోనా బాధితులను రెచ్చగొట్టేలా వ్యహరించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను చేసింది చాలా తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన కరోనా బాధితుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మన కోసం మరో షిరిడీ
షిరిడీలో కొలువై ఉన్న సాయిబాబాను భక్తులు ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటారు. దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు మహారాష్ట్రలోని షిరిడీ వెళ్లి బాబాను దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల భక్తుల కోసం భారీ స్థాయిలో మరో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించినట్లు నామక్కల్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ అధినేత, ‘దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ’ బోర్డు చైర్మన్ కే చంద్రమోహన్ తెలిపారు. ఈనెల 8న వెయ్యిశంఖాలతో మండలపూజ నిర్వహించనున్న సందర్భంగా ఆలయ నిర్మాణానికి దారితీసిన అనుభవాలు, అనుభూతులను మీడియాకు వివరించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘అందరు దేవుళ్లను సాధారణంగా కొలవడమేగానీ షిరిడీ బాబా పట్ల ప్రత్యేకమైన భక్తిప్రపత్తులు ఉన్నవాడిని కాదు. ఒకరోజు స్నేహితునితో కలిసి 2008లో షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాను. కొద్ది రోజుల్లోనే నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక పాప నన్ను ఉద్దేశించి బాబా ఆలయాన్ని నిర్మించాలని కోరింది. ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం మీ ఊరికి సమీపంలోనే ఉందంటూ ఒక వేపచెట్టు, పక్కనే బండరాయి, సమీపంలో తాటిమాను ఉన్న ప్రాంతాన్ని చూపింది. ఉలిక్కిపాటుతో మేల్కొన్న నేను కలలో చూసిన ప్రాంతం కోసం ఎంతగానో అన్వేషించగా తిరుచ్చిరాపల్లి జిల్లా అక్కరపట్టి, సమయపురం, టోల్గేట్ సమీపంలో సరిగ్గా అదేస్థలం కనపడింది. ఆ స్థల యజమానైన ఒక రైతు ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా ఆదేశాల ప్రకారం అక్కడే నిర్మించడం ఎలాగని ఆలోచనలో పడగా సరిగ్గా వారం రోజుల తరువాత అదే రైతు నన్ను వెతుక్కుంటూ వచ్చి అర ఎకరా స్థలాన్ని ఇవ్వడం విశేషం. వెంటనే 2009లో చిన్నపాటి షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాను. పెద్ద సంఖ్యలో భక్తుల రాక పెరగడంతో అన్నదాన కార్యక్రమాలను చేపట్టాను. షిరిడీ పద్ధతుల్లో రోజుకు మూడు సార్లు అదే భాషలో హారతులు ప్రవేశపెట్టి పెద్ద ఆలయాన్ని నిర్మించాలని 2016లో నిర్ణయించుకున్నాను. జర్మనీ నుంచి అత్యంత ఖరీదైన అలంకరణ రాళ్లను తెప్పించి రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ ఆలయ నిర్మాణం పూర్తికాగా జనవరిలో కుంభాభిõÙకం చేసి బాబాకు అంకింతం చేశాం. కుంభాభిõÙక మహోత్సవానికి తమిళనాడుతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 80 వేల మంది భక్తులు హాజరైనారు. ఆలయానికి అనుబంధంగా శాశ్వత ప్రాతిపదికన ఉచిత వైద్యం, వృద్ధాశ్రమం నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాన’ని ఆయన తెలిపారు. ఆలయంలో భక్తులు మహిమాన్వితుడైన బాబా ఆలయ నిర్మాణం తలపెట్టినప్పటి నుంచి బాబా ఆశీస్సులతోపాటు ఎన్నో మహిమలు చోటుచేసుకున్నాయని చంద్రమోహన్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల బాబా జన్మస్థలంపై వివాదం తలెత్తగా షిరిడీలోని బాబా ఆలయాన్ని మూడు రోజులపాటు మూసివేశారు. అనుకోకుండా అవే మూడు రోజుల్లో ఇక్కడి కొత్త ఆలయంలో బాబాకు కుంభాభిషేకం జరగడం అనూహ్యమైన పరిణామం. తిరుపతి నుంచి చెన్నైకి కారులో వస్తూ పూందమల్లికి 10 కి.మీ దూరంలో రోడ్డుపక్కన ఉన్న ఒక పెద్ద బోర్డును చూసి ఆలయ ప్రచారానికి ఎంత ఖరీదైనా చెల్లించి వాడుకోవాలని ఆశించగా వారు నిరాకరించారు. ప్రయాణం సాగుతుండగానే కొద్దిసేపట్లో వారే ఫోన్ చేసి ఉచితంగా ఇస్తామన్నారు. మరికొద్ది దూరంలో మరో బోర్డును దాని యజమాని కూడా ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 8న మండల పూజ కుంభాభిషేకం ముగిసిన సందర్భంగా ఈనెల 8వ తేదీన వెయ్యి శంఖాలతో మండల పూజను చేపడుతున్నట్లు దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ బోర్డు సభ్యులు, ఆలయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జ్ టి సురేష్ తెలిపారు. అనతికాలంలోనే ఆలయ విశిష్టత నలు చెరగులా ప్రచారం కావడంతో తమిళనాడు టూరిజం శాఖలో చేర్చారు. అంతేగాక భక్తుల సౌకర్యార్థం తిరుచ్చిరాపల్లి నగరం నుంచి ఆలయం వద్దకు టూరిజంశాఖ ఉచిత బస్సులను నడుపుతోంది. ఆలయ సందర్శనార్థం వచ్చే తెలుగువారు 9600005060 సెల్‌ఫోన్ నంబరులో సంప్రదిస్తే అవసరమైన సహాయ సహకారాలు అందజేయగలనని సురేష్ తెలిపారు. -
శృంగార క్యాషియర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడి వృత్తి బాధ్యతాయుతమైన బ్యాంకు ఉద్యోగం. ప్రవృత్తి మహిళలను లోబరుచుకుని ఉల్లాసంగా గడపడం. ఒకరు కాదు...ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా మహిళలతో భర్త సాగించిన రాసలీలను ఫొటోలు, వీడియోల ఆధారాలతో తాళి కట్టిన భార్యే బట్టబయలు చేసింది. అరెస్ట్ భయంతో భర్త సహా ఐదుగురి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే... తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. తంజావూరు జిల్లా వల్లం సమీపం రెడ్డిపాళయానికి చెందిన యువతి (32)తో గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన వివాహమైంది. పెళ్లయిన రోజు నుంచే జయకుమార్ తన ఇంటిలోని ప్రత్యేక గదిలో గంటల తరబడి పలువురు మహిళలతో అశ్లీలంగా మాట్లాడడం, తనతో సఖ్యతగా ఉండకపోవడాన్ని భార్య గమనించింది. భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో అతని గదిలోకి వెళ్లి పరిశీలించగా 15 సెల్ఫోన్లు, వాటిల్లో జయకుమార్ 40 మందికిపైగా మహిళలతో, బ్యాంకు ఖాతాదారులతో అర్ధనగ్నంగా, నగ్నంగా ఉన్న చిత్రాలు, బాత్రూములో వీడియోలు, ఎస్ఎంఎస్లు చూసింది. ఈ ఘోరాలను తన అత్తగారు, భర్త సోదరి, అత్తవారింటి ఇతర మహిళా బంధువులకు చెప్పుకుని విలపించింది. అయితే వారేమీ పట్టించుకోలేదు. అయితే తన అంతర్గత విషయాలను కుటుంబసభ్యులకు చెప్పిందని జయకుమార్ అగ్రహించి భార్యను తిట్టిపోశాడు. అంతేకాకుండా ‘నీవు స్నానం చేస్తున్నపుడు రహస్యంగా వీడియో తీసి జాగ్రత్తగా దాచిపెట్టాం, ఈ విషయాలు ఎవరికైనా చెబితే ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతాం’ అంటూ జయకుమార్, అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా బెదిరించారు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు జయకుమార్‌ను నిలదీశారు. అయితే తన రాసలీలలను బహిర్గతం చేసిందనే కక్షగట్టిన జయకుమార్...భార్యను హతమార్చేందుకు పథకం రచించాడు. ఆలయాల సందర్శన పేరుతో భార్యను బయటకు తీసుకెళ్లి రెండుసార్లు హత్యయత్నం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకుని తంజావూరు సర్కిల్ డీఐజీ లోకనాథన్కు ఫిర్యాదు చేసింది. డీజీపీ ఆదేశాల మేరకు బాధితురాలి భర్త జయకుమార్, అతని తల్లి విల్లీ హైడా, సోదరి కేథరిన్ నిర్మలామేరీ, బంధువు రీటాతో పాటుగా, జయకుమార్తో సంబంధం పెట్టుకుని అతడి దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగిని దేవీ బిలోమినాపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన జయకుమార్ మదురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తన భర్త రాసలీలలకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను మదురై కోర్టుకు అప్పగించి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరింది. బాధితురాలి పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు జామీనుపై విడుదలకు అవకాశం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జయకుమార్ సహా ఐదుగురిపై వల్లం మహిళా పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జయకుమార్... కుటుంబంతో కలిసి పరారీలో ఉన్నాడు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
లలితా జ్యువెలరీలో భారీ చోరీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని లలితా జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ. 50 కోట్ల విలువైన నగలను దుండగులు చోరీచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుచిరాపల్లి సత్రం బస్‌స్టేషన్ దగ్గర లలితా జ్యువెలరీ షోరూం ఉంది. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రదర్శన కోసం ఉంచిన నగలు బుధవారం ఉదయానికి మాయమయ్యాయి. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. షోరూం వెనుక గోడకు కన్నం వేసి ఉంది. దుండగులు తమ వేలిముద్రలు ఫోరెన్సిక్ నిపుణులకు దొరక్కుండా ఉండేందుకు కారప్పొడి చల్లి వెళ్లారు. ముఖాలకు జోకర్ బొమ్మల మాస్క్‌లు వేసుకుని షోరూంలో సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సుమారు రూ. 50 కోట్ల విలువైన వంద కిలోల బంగారం, వజ్రాలు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. రూ.13 కోట్ల విలువైన నగలు చోరీకి గురయ్యాయని తిరుచ్చిలో లలితా జ్యువెలరీ యజమాని కిరణ్ చెప్పడం గమనార్హం. -
టేకాఫ్ అవుతూ గోడను ఢీకొట్టింది
సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ విమానానికి భారీ ముప్పు తప్పింది. తిరుచ్చి నుంచి గురువారం అర్ధరాత్రి 1.30 గంటలప్పుడు దుబాయ్ వెళ్లేందుకు ఎయిరిండియాకు చెందిన ఐఎక్స్–611 విమానం బయలుదేరింది. టేకాఫ్ అవుతుండగా.. పైలట్లకు ల్యాండింగ్ సమయంలో సూచనలు ఇచ్చేందుకు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఓ పెద్ద పరికరాన్ని విమానం ఢీకొంది. ఆ తర్వాత విమానం ప్రహరీ గోడను కూడా స్వల్పంగా తాకింది. ఈ ఘటనలతో విమానం కుదుపులకులోనై ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటు విమానం చక్రం, ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 50 అడుగుల ఎత్తున్న ప్రహారీ గోడ, దానిపై ఉన్న కంచె కూడా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఎవ్వరికీ ఏమీ కాలేదు. విమానంలో కూడా అన్ని పరికరాలూ సవ్యంగానే పనిచేస్తున్నాయనీ, ఇబ్బందేమీ లేదని పైలట్లు చెప్పడంతో విమానం అలాగే దుబాయ్ వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని దుబాయ్ విమానాశ్రయానికి చేరవేయడంతో విమానం దెబ్బతిన్నందున తాము ల్యాండింగ్‌కు అనుమతించబోమని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విమానాన్ని తెల్లవారుజామున 5.45 ప్రాంతంలో ముంబైకి తరలించి, అక్కడ ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి 10.40 గంటలకు దుబాయ్‌కి పంపారు. ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యనా లేక పైలట్ల నిర్లక్ష్యమా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించిందనీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు పైలట్లను ఎయిరిండియా విధుల నుంచి తప్పించిందని తిరుచిరాపల్లి విమానాశ్రయ డైరెక్టర్ గుణశేఖరన్ చెప్పారు. -
అమ్మ సిమెంట్ బస్తా రూ.190 మాత్రమే!
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేరుతో తమిళనాడులో పరిచయమైన పథకాల జాబితాలో కొత్తగా అమ్మ సిమెంట్ చేరింది. 50 కిలోల సిమెంట్ బస్తా కేవలం 190 రూపాయలకే అందేలా పథకాన్ని రూపొందించారు. తిరుచిరాపల్లిలో సోమవారం ఐదు చోట్ల సిమెంటు బస్తాల విక్రయాన్ని ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా 470 కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తెచ్చుకున్నవారికి మాత్రమే అమ్మ సిమెంట్ విక్రయించేలా నిబంధన విధించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గత సెప్టెంబరు 26న ఈ పథకాన్ని ప్రకటించారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పేద, మధ్య తరగతి వర్గాల్ని ఆకర్షించే విధంగా పథకాల్ని ప్రవేశపెడుతూ వస్తోంది. పేదలకు ఉచిత బియ్యం, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు, ఉచిత పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, షూ, పాదరక్షల్ని అందిస్తున్నారు. పేద యువతుల వివాహానికి బంగారు తాళి పథకం, కుటుంబ కార్డుదారులకు మిక్సీ, గ్రైండర్లు, ఫ్యాన్ల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉచిత పథకాలు ఓ వైపు ఉంటే, మరో వైపు అమ్మ పేరిట క్యాంటీన్లు, వాటర్ బాటిళ్లు, అమ్మ సంత, కూరగాయల దుకాణాలు, ఉప్పు విక్రయాలు, మెడికల్ షాపులు ప్రజల ముంగిటకు చేరాయి. ఇప్పుడు అమ్మ పేరిట సిమెంట్ విక్రయాలకు కూడా శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని అనేక నగరాల్లో భవన నిర్మాణలు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో సిమెంట్ వినియోగం పెరగడంతో ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధరలు పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా మారాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో సిమెంట్ విక్రయాలను మొదలుపెట్టింది. -
ఉద్యోగాలు
నిట్, తిరుచిరాపల్లి తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు: ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యుమానిటీస్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: అక్టోబర్ 8 వెబ్సైట్: http://www.nitt.edu హిందూస్థాన్ షిప్‌యార్డ్ హిందూస్థాన్ షిప్‌యార్డ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేర్‌టేకర్ షిప్ బిల్డింగ్ సబ్‌మెరైన్ రిపేర్స్ సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్ హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ వర్క్స్ పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. చివరి తేది: సెప్టెంబరు 15 వెబ్సైట్:http://www.hsl.gov.i -
కార్పొరేషన్లుగా తంజై, దిండుగల్
రాష్ట్రంలో కొత్తగా మరో రెండు కార్పొరేషన్లు బుధవారం ఆవిర్భవించాయి. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా బాసిల్లుతున్న తంజావూరు, దిండుగల్ పట్టణాలు కార్పొరేషన్లు అయ్యాయి. తంజావూరు కార్పొరేషన్ తొలి మేయర్‌గా సావిత్రి గోపాల్ బాధ్యతలు చేపట్టనున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పది కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రధాన నగరాలుగా ఉన్న చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, సేలం, తిరునల్వేలి, తిరుప్పూర్, ఈరోడ్, తూత్తుకుడి, వేలూరు ఆ జాబితాలో ఉన్నాయి. అభివృద్ధి పథంలో ఈ కార్పొరేషన్లు దూసుకెళ్తోన్నాయి. విద్య, వైద్య, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలతో పాటుగా న గరాల సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కార్పొరేషన్లు అన్నీ అన్నాడీఎంకే గుప్పెట్లోకి చేరాయి. దీంతో నిధుల వరద కార్పొరేషన్ల అభివృద్ధికి పారుతున్నాయి. మరో రెండు: కార్పొరేషన్ల సంఖ్య 12కు చేర్చేందుకు ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన, అభివృద్ధి దృష్ట్యా మరో రెండు నగరాలను కార్పొరేషన్లుగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో తంజావూరు, దిండుగల్ను చేర్చా రు. జిల్లా కేంద్రాలుగా ఉన్న ఈ నగరాల్ని మరింత అభివృద్ధి పరచడం లక్ష్యంగా నగర పాలక సంస్థను కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందు కు ప్రభుత్వం నిర్ణయించింది. తంజావూరు జిల్లా అంటే, అందరికీ గుర్తుకొచ్చేది పల్లవ రాజులు, మదురై, తంజావూరు నాయక రాజు లు, పాండియ, విజయనగర రాజుల వైభవాన్ని చాటే కళా ఖండాలు, నిర్మాణాలే. తంజావూరు పెయిటింగ్స్, బొమ్మలు ప్రపంచ ప్రఖ్యా తి గాంచి ఉన్నాయి. యునెస్కో గుర్తింపును సైతం పొందిన తంజావూరు డెల్టా జిల్లాలో ప్రధాన కేంద్రంగా నిలుస్తూ వస్తున్నది. తంజావురుకు నిత్యం వస్తున్న పర్యాటకులను, అక్కడి జనాభాను పరిగణనలోకి తీసుకుని అందుకు తగ్గ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం తంజావూరు పురపాలక సంస్థను కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఇక దిండుగల్ అంటే, అందరికీ గుర్తుకు వచ్చేది పళని సుబ్రమణ్య స్వామితోపాటు ప్రకృతి అందాలను తనలో ఇముడ్చుకున్న కొడెకైనాల్. రైల్వే జంక్షన్‌గా, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న దిండుగల్ను సైతం కార్పొరేషన్ జాబితాలోకి చేర్చేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను అసెంబ్లీలో మంత్రి కేపి మునుస్వామి గత ఏడాది చివర్లో దాఖలు చేశారు. ఆవిర్భావం: పనులన్నీ చక చకా సాగుతుండడంతో తంజావూరు, దిండుగల్ కార్పొరేషన్లుగా బుధవారం ఆవిర్భవించాయి. మునిసిపాలిటీ కార్యాలయాలను కార్పొరేషన్లుగా తీర్చిదిద్దారు. అందుకు తగ్గ మౌళిక సదుపాయాలు, కౌన్సిల్ హాల్, కమిషనర్, మేయర్, ఇతర ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక గదులు రూపదిద్దుకున్నారుు. కార్పొరేషన్ పరిధిలోకి జనభా ప్రాతిపదికన అనేక గ్రామాల్ని చేర్చారు. సకాలంలో అన్ని పనులు ముగియడంతో ఆ రెండు మునిసిపాలిటీలు బుధవారం నుంచి కార్పొరేషన్లుగా మారినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి అన్నాడీఎంకే నాయకులు సంబరాలు చేసుకున్నారు. అధికారులకు స్వీట్లు పంచి పెట్టారు. తంజావూరు తొలి మేయర్‌గా సావిత్రి గోపాల్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మునిసిపాలిటీ చైర్మన్‌గా ఉన్న ఆమెకు మేయర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక దిండుగల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించినా, తొలి మేయర్ ఎవర్నది తేలాల్సి ఉంది. ఇది వరకు మునిసిపాలిటీగా ఉన్న దిండుగల్‌కు చైర్మన్‌గా వి మరుతరాజ్ వ్యవహరిస్తున్నారు. ఆయనకే తొలి మేయర్ చాన్స్ ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.