వైద్యుడిపై ఉమ్మివేసిన కరోనా బాధితుడు | Coronavirus Patient Spitting On Doctor In Tamil Nadu | Sakshi
Sakshi News home page

వైద్యుడిపై ఉమ్మివేసిన కరోనా బాధితుడు

Published Mon, Apr 13 2020 9:05 AM | Last Updated on Mon, Apr 13 2020 10:55 AM

Coronavirus Patient Spitting On Doctor In Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

చెన్నై : తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపై కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి ఉమ్మి వేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఓ పేషెంట్‌ శనివారం రోజున చేరాడు. అయితే అతడు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులకు సహకరించకుండా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన మాస్క్‌ను తీసివేసి దానిని డాక్టర్‌పై విసిరేశాడు. అంతటితో అగకుండా వైద్యునిపై ఉమ్మి వేశాడు.  అలాగే ఆస్పత్రి సిబ్బందిని, ఇతర కరోనా బాధితులను రెచ్చగొట్టేలా వ్యహరించాడు. 

దీంతో ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను చేసింది చాలా తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన కరోనా బాధితుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement