
ఢిల్లీలో రాష్ట్ర అవతరణ సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శనివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రఖ్యాత కూచిపూడి నృత్యకళాకారులు రాజా రెడ్డి, రాధా రెడ్డి, శిష్యబృందం ప్రదర్శించిన నృత్యాలు సభికులను అలరించాయి. ఎంపీ వి. హనుమంతరావు, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, హోంశాఖ సంయుక్త కార్యదర్శి గోపాలరెడ్డి, అమెరికా, ఫ్రాన్స్, ఫిన్‌లాండ్, నేపాల్, బోస్నియా దేశాల రాయబారులు, రెసిడెంట్ కమిషనర్ శశాంక గోయల్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేడు చిత్రలేఖనం పోటీలు: అవతరణ దినోత్సవాల ముగింపు సందర్భంగా ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘బతుకమ్మ’పై చిత్రలేఖనం పోటీలను నిర్వహించనున్నట్టు ఫౌండేషన్ చైర్‌పర్సన్ లీలావతి తెలిపారు.