చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో జరిగిన నాట్యాంజలి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారులు ఏటా నటరాజ స్వామి ముందు తమ నాట్యంతో అంజలి ఘటించటం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. నాట్యం అభ్యసించిన ప్రతి కళాకారుడు నటరాజ స్వామికి తమ నాట్యాన్ని అంకితం చేస్తుంటారు.