nataraja swamy
-
ఆ నటరాజ ప్రతిమ... మన ప్రతిభకు తార్కాణం: మోదీ
న్యూఢిల్లీ: జీ 20 సదస్సుకు వేదిక అయిన భారత్ మండపం వద్ద ఏర్పాటు చేసిన భారీ నటరాజ ప్రతిమ ప్రాచీన కాలం నుంచీ వస్తున్న భారతీయ కళా నైపుణ్యానికి, ప్రతిభకు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో ఆయన కామెంట్ చేశారు. అనంత విశ్వ శక్తికి సంకేతమైన నటరాజ విగ్రహం జీ 20 సదస్సు వేదిక వద్ద ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్నారు. అష్ట ధాతుమయమైన 27 అడుగుల ఎత్తు, 18 వేల కిలోల ఎత్తుతో నటరాజ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత శిల్పి రాధాకృష్ణన్ బృందం రికార్డు స్థాయిలో కేవలం 7 నెలల్లో రూపొందించింది. ఆయన కుటుంబీకులు చోళుల హయాం నుంచీ, అంటే ఏకంగా 34 తరాలుగా శిల్పులుగా ఉంటూ వస్తున్నారు. -
రాజరాజ చోళుడి కంటే ముందే ‘సెంగోల్’!
ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన కర్ణాటకలోని పట్టదకల్ దేవాలయ సమీపంలోని విరూపాక్ష ఆలయం మీద ఉన్న నటరాజస్వామి శిల్పం. నంది ధ్వజం రూపంలో రాజదండం చెక్కి ఉండటాన్ని ఈ శిల్పం పక్కన చూడొచ్చు. అధికార మార్పిడికి గుర్తుగా క్రీ.శ.745లో దేవాలయాన్ని నిర్మించారని, రాజదండాన్ని (సెంగోల్) ఉపయోగించారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: సెంగోల్.. ధర్మదండం.. రాజదండం..కొన్ని రోజులుగా రాజకీయాలను కుదిపేస్తున్న పదాలివి. అంతకుముందు వాటి ప్రత్యేకతలపై సామాన్యుల్లో ఉన్న అవగాహన అంతంతమాత్రమే. ఇప్పుడు ఎక్కడ చూసినవా వాటి గురించిన చర్చే. కొత్త పార్లమెంటు భవనంలో స్పీకర్ చాంబర్ వద్ద కేంద్ర ప్రభుత్వం స్వర్ణతాపడం చేసిన వెండి ధర్మదండాన్ని ఉంచబోతున్న సంగతి తెలిసిందే. రాజరాజ చోళుడి కాలంలో అధికార మార్పిడికి చిహ్నంగా వినియోగించినట్టుగా భావిస్తున్న దండాన్ని, ఆంగ్లేయుల నుంచి భారతదేశానికి అధికార మార్పిడి జరిగే వేళ తిరిగి వినియోగించారు. ఇంతకాలం మ్యూజియంలో ఓ బంగారు చేతికర్ర లాగా ఉండిపోయింది. ప్రస్తుతం నరేంద్రమోదీ ప్రభుత్వం దానికి సముచిత గౌరవాన్ని కల్పించే పేరిట కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్టించనుంది. రాజరాజ చోళుడి కంటే ముందే.. తాజా పరిణామాల నేపథ్యంలో చరిత్ర పరిశోధకుల దృష్టి పడింది. రాజరాజ చోళుడి కంటే కొన్ని వందల ఏళ్ల ముందే నంది చిహ్నంతో కూడిన రాజదండాన్ని అధికారమార్పిడికి వినియోగించారని వారు పేర్కొంటున్నారు. కర్ణాటకలోకి విశ్వవిఖ్యాత పట్టదకల్ దేవాలయ సమూహంలోని విరూపాక్ష దేవాలయంపై నటరాజస్వామి శిల్పంలో నంది ధ్వజం రూపంలో ఈ రాజదండం చెక్కి ఉందని పురావస్తు పరిశోధకులు సీహెచ్ బాబ్జీరావు, ఈమని శివనాగిరెడ్డిలు పేర్కొంటున్నారు. ఈ దేవాలయాన్ని బాదామీ చాళుక్య చక్రవర్తి రెండో విక్రమాదిత్యుడి భార్య లోకమహాదేవి నిర్మించారు. అప్పట్లో రెండో విక్రమాదిత్యుడు పల్లవ నరసింహవర్మను ఓడించి ఆయన ఆధీనంలోని ప్రాంతాన్ని తన పాలనలోకి తీసుకున్న సందర్భంగా జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా రాణి ఈ ఆలయాన్ని నిర్మించి నటరాజస్వామి పక్కనే సెంగోల్‌ను ప్రముఖంగా ప్రదర్శించారు. ఇంతకూ నంది ఎందుకు? శివాలయాలకు నందీశ్వరుడు అధికారం వహిస్తాడని ఆగమశాస్త్రాల్లో ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే మూలమూర్తిని దర్శించేముందు నంది అనుమతి పొందాలన్న భావన ఉండేదని, అధికారానికి గుర్తుగా నంది రూపాన్ని వాడేవారని, అధికార మార్పిడికి చిహ్నంగా అందించే అధికార దండంపై నంది రూపాన్ని రూపొందించారని చెబుతున్నారు. ఈ సంప్రదాయం చోళుల కాలం కంటే ముందు నుంచే కొనసాగిందని వారు పేర్కొన్నారు. -
రికార్డు సృష్టించిన నాట్యాంజలి
సాక్షి,చెన్నై : చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో జరిగిన నాట్యాంజలి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారులు ఏటా నటరాజ స్వామి ముందు తమ నాట్యంతో అంజలి ఘటించటం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. నాట్యం అభ్యసించిన ప్రతి కళాకారుడు నటరాజ స్వామికి తమ నాట్యాన్ని అంకితం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నటరాజ స్వామి ఆలయంలో నాట్యాంజలి పేరుతో నాట్యోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగానే 2017లో 4525 మంది నాట్య కళాకారులు ఒకే వేదికపై చేసిన నాట్యాంజలి రికార్డు సృష్టించింది. అయితే ఈ ఏడాది కూడా నాట్యంజలిలో గిన్నిస్ రికార్డు సృష్టించాలని నిర్ణయించారు. దీక్షితుల నిర్వహణలో కొనసాగుతున్న ఈ ఆలయంలో ఈ ఏడాది నాట్యాంజలిని రికార్డు చేసేందుకు గిన్నిస్ బుక్ వారిని ఆహ్వానించారు. దీంతో ప్రఖ్యాత నాట్య కళాకారిణి గురు పద్మభూషణ్ పద్మసుబ్రమణ్యం నేతృత్వంలో 19 వేల నాట్య కళాకారులతో నాట్యంజలి నిర్వహించారు. ఇందులో తమిళనాడు నలుమూలల నుంచి 7195 మంది నాట్య కళాకారులు ఒకే వేదికపై నటరాజస్వామికి తమ నాట్యంతో అంజలి ఘటించారు. తద్వారా గతంలో ఉన్న 4 వేల మంది నాట్యాంజలి రికార్డు తిరగరాశారు. గిన్నిస్ ప్రతినిధి రిషినాధ్ ఆలయ దీక్షితులకు రికార్డు పత్రాన్ని అందచేశారు. ఒకే వేదికపై 7 వేల మంది నాట్యకళాకారులు తమ అభినయంతో నటరాజ స్వామికి నాట్యాంజలి అందించటం చిదంబరం ఆలయంలో వేడుకను తలపించింది. -
రికార్డు సృష్టించిన నాట్యాంజలి
-
‘చిదంబర’ రహస్యం
►నటరాజస్వామి స్వయంగా రాసిన తాళపత్రాలపై చర్చ ►పుదుచ్చేరి మఠం నుంచి స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి పట్టు ►విచారణ జరిపిస్తామని దేవాదాయ మంత్రి సేవూరు రాజేంద్రన్ వెల్లడి చెన్నై: దేవుడు ఉన్నాడు అంటారు ఎందరో, లేడు అంటారు మరికొందరు. ఉంటే బాగుండేదని బాధపడుతుంటారు కొంతమంది. అయితే ప్రస్తుత చర్చనీయాంశంగా మారిన విషయం వీటన్నింటి కంటే ఒక అడుగు మించింది. చిదంబరం నటరాజస్వామి స్వయంగా రాసినట్లుగా భావిస్తున్న తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయి, పుదుచ్చేరి పీఠంలో ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజమేనా, స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా అనే అంశాలు చిదంబర రహస్యంగా మారాయి. చిదంబరం నటరాజస్వామి ఆలయానికి మనిషి రూపంలో దేవదేవుడే వచ్చి తాళపత్రాలలో తిరువాచక గీతాలను రాసి ఆలయానికి అప్పగించారని భక్తుల విశ్వాసం. ఈ తాళపత్రాలు ప్రస్తుతం పుదుచ్చేరిలోని అంబలత్తాడి మఠంలో ఉన్నట్లు సమాచారం. ఆ తాళపత్రాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో కొత్త చర్చ బయలుదేరింది. ఈ చర్చను లేవనెత్తింది వేరెవరో కాదు తమిళనాడు ప్రభుత్వ దేవదాయ, ధర్మాదాయశాఖ మాజీ మంత్రి వీవీ స్వామినాథన్. నటరాజ పెరుమాళ్ స్వయంగా రాసిన ఆ తాళపత్రాలు చిదంబరం ఆలయ సొత్తు కావడంతో దానిని స్వాధీనం చేసుకోవాలంటూ ఆలయ నిర్వాహకులకు, కడలూరు జిల్లా కలెక్టర్, దేవదాయశాఖ, విగ్రహాల అక్రమరవాణా నిరోధక శాఖ, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు స్వామినాథన్ ఇటీవల లేఖ రాశారు. ఈ ఉత్తరంపై విచారణ జరపాల్సిందిగా గవర్నర్ కిరణ్‌బేడీ పోలీస్‌శాఖను ఆదేశించారు. పురాణం ఏమీ చెబుతోందంటే.. శివ క్షేత్రాలను దర్శించుకుంటూ చిదంబరం నటరాజస్వామి ఆలయానికి వచ్చిన మాణిక్యవాచకర్ అనే మహాభక్తుడు అక్కడి శివుడిని దర్శించుకున్న తరువాత అదే ఊరిలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ నివాసానికి ఒక వృద్ధుడు వచ్చి శివపెరుమాళ్ ఆజ్ఞతో తాను ఇక్కడికి చేరుకున్నానని పరిచయం చేసుకుని మాణిక్యవాసగర్ భక్తిని మెచ్చుకున్నాడు. వృద్ధుని కోర్కె మేరకు శివపెరుమాళ్ గురించి మాణిక్యవాసగర్ భక్తి పాటలు ఆలపించాడు. ఆయన ఆలపించిన 400 గీతాలను వృద్ధుడు తాటాకు పత్రాలపై రాసి తనతోపాటు తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఆలయాన్ని తెరిచిన అర్చకుడు అక్కడి మెట్లపై ఉన్న తాళపత్రాలను చూసి ఊరిపెద్దలకు సమాచారం ఇచ్చాడు. ఆ తాళపత్రాల్లో తిరువాసగ శ్లోకాలు, తిరుక్కోవయార్ రచించిన 400 శ్లోకాలు కూడా చోటుచేసుకున్నాయి. ఊరిపెద్దలంతా కలిసి తిరువాచగర్ను ఆలయానికి పిలిపించగా తాళపత్రాల్లోని పాటలను ఆలపించాడు. నా గీతాల్లోని భావాలకు మూలకర్త నట రాజస్వామినే అని చెబుతూ స్వామి వారిలో మాణిక్యవాచగర్ ఐక్యమైపోయాడు. నటరాజర్ స్వయంగా రాసినట్లు భావిస్తున్న సదరు తాళపత్రాలు ప్రస్తుతం పుదుచ్చేరి అంబలతావడి మఠం స్వాధీనంలో ఉన్నట్లు సమాచారం. మాణిక్యవాచగర్ పాడుతుండగా సాక్షాత్తు నటరాజస్వామినే తాళపత్రాల్లో రాశాడని మాజీ మంత్రి స్వామినాథన్ అంటున్నారు. చిదంబరంలోని ఆరుముగనావలర్ స్కూల్లో ఈ తాళపత్రాలను ప్రదర్శనగా ఉంచినపుడు తాను చూసి ఉన్నానని చెప్పారు. ఈ తాళపత్రాలను తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్వాధీ నం చేసుకుని తగిన భద్రతతో భక్తుల సందర్శనకు ఉంచాలని ఆయన కో రారు. అంబలత్తాడి మఠంలో నట రాజ స్వామి పాదాలకు సమీపంలో సుమారు ఒకటిన్నర అడుగు వెడల్పు, ఒక అడుగు ఎత్తు ఉన్న వెండి పీట ఉంది. ఈ పీటలోనే తాళపత్రాలు ఉన్నట్లుగా అంబలత్తాడి మఠం 33వ మఠాధిపతి కనకసభాపతి స్వామి చెబుతున్నారు. పూర్తిగా సీల్ వేసినట్లుగా ఉన్న పీటను ఏ కారణం చేత కూడా విప్పిచూడడం, పరిశోధన చేయడమో కూడదని తమ పూర్వీకులు సూచించినట్లు స్వామి తెలి పారు. మాస శివరాత్రి రోజుల్లో రాత్రి 11 గంటల సమయంలో వెండి పీటను కేవలం ఒక గంటపాటు భక్తుల సందర్శనార్థం ఉంచుతున్నామని స్వామి చెప్పారు. 350 ఏళ్ల కిత్రం జరిగిన కర్ణాటక యుద్ధం సమయంలో చిదంబరం మఠంలోని నటరాజస్వామి విగ్రహం, తాళపత్రాలు వస్తువులను పుదుచ్చేరి మఠంలో భద్రపరిచినట్లు స్థలపురాణంలో పేర్కొన్నారు. పుదుచ్చేరి మఠంలోని తాళపత్రాలు మాణిక్యవాసగర్ కాలం నాటివేనని అక్కడి అర్చకులు అంగీకరిస్తున్నారు. ఈ తాళపత్రాల నకళ్లు మయిలాడుదురై, చిదంబరం ఆలయాల్లో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. తాళపత్రాల వ్యవహారంపై చిదంబరం ఆలయ దీక్షితులు ఉమానా«థ్ మాట్లాడుతూ నటరాజస్వామి స్వయంగా రాసినట్టు చెపుతున్న తాళపత్రాలు తమ ఆలయానికి చెంది నవి అని నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవు, అందుకే ఆలయ నిర్వాహకులు వాటిని స్వాధీనం చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదని అన్నారు. విచారణ జరిపిస్తాం తాళపత్రాల విషయం ఇటీవల తన దృష్టికి వచ్చిందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖా మంత్రి సేవూరు రామచంద్రన్ ఇటీవల మీడియాతో అన్నారు. తాళపత్రాలు నటరాజస్వామి ఆలయానికి చెందినవి అనే వాదనపై అధికారుల పూర్తిస్తాయి విచారణ జరిపిస్తానని అన్నారు. విచారణపై నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు....సేవూరు రామచంద్రన్