
కనుల పండువగా ఆవిర్భావ వేడుకలు
♦ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
♦ అవార్డులు ప్రదానం చేసిన మంత్రి హరీశ్‌రావు
♦ అమరుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీ
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గురువారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కనులపండువగా జరిగాయి. పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకలకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత పోలీసుల గౌరవవందనం స్వీకరించా రు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మంత్రి సన్మానించారు. అమరుల తల్లిదండ్రు లు కంటతడిపెట్టగా హరీశ్‌రావు వారిని ఓదార్చారు. అమరవీరుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్‌లు అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు.
ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు
వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు తెలంగాణ ఉద్యమ చరిత్రకు అద్దపట్టేలా నృత్యాన్ని ప్రదర్శించారు. సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్, ఎ ద్దుమైలారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం బతుకమ్మలు, బోనాలు, పోతరాజుల వేషధారణలతో నృత్యాలు చేశారు. సాంస్కృతి క శాఖకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. సాం స్కృతిక కర్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు మంత్రి హరీశ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ రాజ మణి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు జ్ఞాపికలు అందజేశారు. సీడీసీ చైర్మ న్ విజయేందర్‌రెడ్డి పోతిరెడ్డిపల్లి విద్యార్థులకు రూ.5వేల నగదు బహుమతి అందజేశారు.
ఉత్తమ అవార్డుల ప్రదానం...
వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వారికి మంత్రి అవార్డులను ప్రదానం చేశారు. లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ఉత్తమ క్రీడాకారుడు), సదాశివరెడ్డి(రైతు), షబ్బీర్(టీచర్), నవీన్ (అంగన్‌వాడీ), రాజారత్నం, ప్రతాప్ (ఉద్యోగి), లతీఫ్(ఎన్జీవో), విఠల్‌రెడ్డి, జ్యోతి(సామాజిక సేవకులు), హేమలత(డాక్టర్), టి.యాదవాచార్యులు(కవి), మహ్మద్ రుస్తుం(ఆర్టిస్టు), జోషి చంద్రశేఖర్(వేద పండితులు), సంగ్రాం మహారాజ్(అర్చకులు), మధుసూదన్‌రెడ్డి, విష్ణు, శ్రీధర్(విలేకరులు), వాసం వెంకటేశ్వర్లు(అధికారి), రాంరెడ్డి(న్యాయవాది), శివరాజ్ రాథోడ్(సర్పంచ్), అమృత జనార్దన్‌రెడ్డి(స్పెషల్ కేటగిరీ)లకు మంత్రి అవార్డులు అందజేశారు. ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికైనందుకు సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ బి.విజయలక్ష్మి అవార్డు అందుకున్నారు.
ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ...
అమరుల కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. వేడుకల్లో భాగంగా జిల్లాలో అమరుల కుటుంబాల్లోని 47 మందికి మంత్రి హరీశ్‌రావు ఉద్యోగనియామక పత్రాలు అందజేశారు. నియామకం పత్రాలు అందుకున్న వారిలో... నోముల దర్జీ కిరణ్(సంజీవరావుపేట), సుంకే శోభ(సంజీవరావుపేట), షేక్ జహంగీర్(ఆర్సీపురం), మేఘావత్ హరిప్రసాద్(మామిడిపల్లి), పన్యాల యాదమ్మ(మక్త అల్లూరు), శ్రీధర్(దుద్దెడ), మాచర్ల నర్సింలు(కొండపాక), ఆర్.కవిత(కొండపాక), ఎ.సందీప్(దుద్దెడ), జి.నర్సింలు(మగ్ధూంపూర్), బండి బాల్‌రాజ్(కొండరాజ్‌పల్లి), వర్ల లావణ్య(అందె), ఆర్.దేవలక్ష్మి(దన్నారం), టి.సాయిలు(రాజ్‌పేట), ప్రవళ్లిక(వాడి), జె.యశోద(బూర్గుపల్లి), చాకలి నర్సింలు(శమ్నాపూర్), బి.చంద్రకళ(కొల్చారం), ఎన్.పవన్(సీతారాం తండా), కేతావత్ నారాయణ(కుడ్లేరు తండా), సుంకలి లక్ష్మయ్య(శేర్‌కాన్‌పల్లి), ఎం.పరశురాములు (పద్మనాభునిపల్లి), సి.కృష్ణ (దుబ్బాక), ఆర్.వెంకటే ష్(దుబ్బాక), ఆర్.వసుంధర(చెల్లాపూర్), బి.నర్సింహాచారి(ధర్మాజిపేట), వై.శ్యాంసుందర్‌రెడ్డి(వేములఘాట్), కె.ప్రవీణ్(కాన్‌గల్), సి.అరుణ(అల్గోల్), ఎస్.శ్రీనివాస్(హోతి.బి), సీహెచ్ శంకర్(సుల్తాన్‌పూర్), ఎన్.సుధాకుమారి(చిట్కుల్), యు.పవన్(గొడుగుపల్లి), సీహెచ్ రాజు(రాయికోడ్), ఐ.కనకరాజు(ఎల్లుపల్లి), ఎన్.అశోక్(పొన్నాల), ఎం.రవీందర్‌గౌడ్(ఝాన్సీలింగాపూర్), ఓ.రాజమణి(రామాయంపేట), ఎన్.బాలకృష్ణ(మల్కాపూర్), బి.దుర్గ(నిజాంపూర్), కె.అనిల్‌కుమార్(జోగిపేట), కె.నాగలక్ష్మి(జోగిపేట), కవిత(కర్నాల్‌పల్లి), పి.నర్సింలు(శంకరంపేట), బి.సరిత(గుమ్మడిదల). బి.శ్రీకాంత్‌గౌడ్(మంబాపూర్), కె.మంజుల(ప్యారారం) ఉన్నారు.
సీఎం చేతులమీదుగా ‘గడా’ ఓఎస్డీకి అవార్డు
గజ్వేల్: రాష్ట్రస్థాయి ఉత్తమ అధికారిగా ఎంపికైన ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సీఎంతోపాటు గవర్నర్ నర్సింహ్మన్ ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా హన్మంతరావు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. గజ్వేల్‌ను రాష్ట్రలోనే నెంబర్‌వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.