
చికాగో : నాపర్‌విల్లేలోని రాయల్ ప్యాలెస్ హాలులో చికాగో ఆంధ్ర అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా 'విమెన్స్ గాలా' నిర్వహించారు. సీఏఏ అధ్యక్షురాలు డా.ఉమ కటికి, బోర్డు సభ్యులు దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయని దీపనాగ్ ఆలపించిన వినాయక ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 300మందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారతీయ జాతీయ సమైక్యతా సూచిగా 10మంది సీనియర్ మహిళలు వివిధ రాష్ట్రాల సాంప్రదాయక వస్త్రధారణతో ప్రదర్శించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపనాగ్ తన గాత్రంతో కార్యక్రమాన్ని ఉరకలెత్తించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన డా. విజ్జీ, శ్రీశక్తి, డార్లెన్ సెంగెర్, సంతోష్ కుమార్, రీస్ యవర్, గౌరీ శ్రీ, వాసవిలు తమ ప్రసంగాలతో మంచి సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆటాపాటలతోపాటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సీఏఏవారు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.













Comments
Please login to add a commentAdd a comment