ఇంకుడుగుంతలు లేకుంటే ఇంటికి అనుమతి, నల్లా కనెక్షన్ ఇవ్వమని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు.
హైదరాబాద్: ఇంకుడుగుంతలు లేకుంటే ఇంటికి అనుమతి, నల్లా కనెక్షన్ ఇవ్వమని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. శనివారం నగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఇంకుడుగుంతను తవ్వి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. రెండు కొత్త జలాశయాలు పూర్తయితే నగరంలో మంచినీటి సమస్య తీరినట్టేనని అన్నారు. ఇంటి నెంబర్ల కోసం డిజిటల్ నెంబరింగ్ విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు.