save water programme
-
12 ఏళ్ల బాలిక.. అవార్డుల ‘గీతిక’
సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి జిల్లా): పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ 12 ఏళ్ల బాలిక చేపట్టిన కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ‘‘సేవ్ వాటర్.. సేవ్ అగ్రికల్చర్.. సేవ్ సాయిల్..’’ నినాదంతో సూళ్లూరుపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని గీతిక ఇప్పటివరకు లక్ష మొక్కలను నాటడం గమనార్హం. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సొంత ఖర్చులతో ఓపిగ్గా.. గీతిక తండ్రి వెంకటేషన్ రైల్వే ఉద్యోగి కాగా తల్లి భారతి సచివాలయంలో మహిళ పోలీసుగా పని చేస్తున్నారు. సూళ్లూరుపేటలోని సాయినగర్‌లో నివసించే గీతికకు చిన్నతనం నుంచే పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. గత నాలుగేళ్లుగా సొంత డబ్బులతో యాదముడి ఇంటిగ్రేటెడ్ రూరల్, అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో మొక్కలను నాటుతోంది. భూతాపం నుంచి భూమిని కాపాడి పర్యావరణాన్ని రక్షించేందుకు మొక్కలను నాటుదామంటూ పాఠశాలలు, గ్రామాల్లో విద్యార్థులు, రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఓపిగ్గా గంటల తరబడి ప్లకార్డులతో నిలుచుని తన లక్ష్యం దిశగా సాగుతోంది. పల్లెలే కాకుండా చెన్నై లాంటి మహా నగరంలోనూ గీతిక చేసిన ప్రయత్నాలను అభినందిస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రకటించారు. తమ కుటుంబానికి ఆర్థికంగా భారమే అయినప్పటికీ ఆ చిన్నారి ప్రయత్నాలకు తల్లిదండ్రులు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. చెన్నై ప్రాంతంలో ప్లకార్డులతో గంటల కొద్ది నిలబడి అవగాహన కల్పిస్తున్న బాలిక గీతిక సాధించిన అవార్డులు బెంగళూరు, బిహార్, హైదరాబాద్‌కు చెందిన ఎన్జీఓలు, సామాజిక సేవా సంస్థల నుంచి పలు అవార్డులు. 2020 చైల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు, యంగ్ క్లైమేట్ యాక్టివిస్ట్ అవార్డు 2021లో గ్లోబల్ కిడ్ అచీవర్ అవార్డు, ఇండియన్ ఐకాన్ అవార్డు, ఫేమ్ ఐకాన్ అవార్డు 2022లో సూళ్లూరుపేట ఎస్ఎస్ఎస్ సంస్థ ద్వారా ఏపీజే అబ్దుల్‌కలాం అవార్డు 2022లో ఇంటర్నేషనల్ ఎక్స్‌లెన్స్, ఎన్విరాన్మెంటల్ వారియర్ అవార్డులు. 2022లో ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఐకాన్ అవార్డు, విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ ద్వారా నేషనల్ అవార్డు, ప్రశంసా పత్రం. ఢిల్లీలో 2023 జనవరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అవార్డు. -
సచిన్.. ఇలా చేయడం తగునా?
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ గురించి సలహా ఇస్తే ఎవరు కాదంటారు చెప్పండి. మాస్టర్ బ్లాస్టర్ ఎలాంటి సలహాలు ఇచ్చినా అవి అందికి ఉపయోగపడేలానే ఉంటాయి. క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పిన సచిన్ ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండియా లెజెండ్స్‌కు నాయకత్వం వహిస్తున్న సచిన్.. సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. స్టువర్ట్ బిన్నీ విధ్వంసంతో ఇండియా లెజెండ్స్ తమ తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే.. సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో బ్యాట్ హాండిల్‌ను, గ్రిప్‌ను ఎలా శుభ్రపరుచుకోవాలో చూపించాడు. ''ఇలాంటి చిన్న విషయాలు ఎవరు చెప్పరు'' అంటూ వీడియోకు క్యాప్షన్ జత చేశాడు. ఈ ప్రక్రియ అంతా బాగానే ఉన్నప్పటికి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సచిన్‌ను ఒక విషయంలో తప్పుబట్టారు. అదేంటంటే.. బ్యాట్‌ను క్లీన్ చేసే క్రమంలో నీటిని చాలా వరకు వృథా చేశాడు. అవసరం ఉన్నప్పుడు ట్యాప్ తిప్పితే సరిపోయేది.. కానీ సచిన్ అలా చేయకుండా వీడియోలో మాట్లాడుతున్నంత సేపు ముందు కుళాయిలో నీరు వృథాగా పోతూనే ఉంది. ఈ అంశంమే సచిన్‌ను చిక్కుల్లో పడేలా చేసింది. సచిన్ వీడియోనూ చూసిన చాలా మంది అభిమానులు.. దిగ్గజం నీరు వృథా చేయడంపైనే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబై సివిక్ బాడీ ''సేవ్ వాటర్'' క్యాంపెయిన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. క్రికెట్లో దిగ్గజంగా పేరు పొంది.. అందునా ''సేవ్ వాటర్'' క్యాంపెయిన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సచిన్ ఇలా చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ''సచిన్ సార్.. మీరు చెప్పాలనుకున్న విషయం మంచిదే కావొచ్చు.. కానీ ఇలా నీరును వృథా చేయడం బాగాలేదు''.. ''సార్.. నీటిని రక్షించాలన్న మీ మాటలు మరిచిపోయారా.. ముంబై సివిక్ బాడీ అయిన ''సేవ్ వాటర్'' క్యాంపెయిన్‌కు మీరు బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి గుర్తుంది కదా'' అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Sachin Tendulkar (@sachintendulkar) చదవండి: ఫామ్‌లోనే లేడు.. పాఠ్య పుస్తకాల్లోకి మాత్రం ఎక్కాడు అదే జరిగితే గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! -
నాచారంలో సేవ్ వాటార్ మారథాన్
-
అందమైన ఆత్మలు.. గుణపాఠం చెబుతున్నాయి!
గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం... ఈ పంచభూతాలే మానవాళి మనుగడను నిర్దేశిస్తాయి. అయితే అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో పర్యావరణాన్ని కలుషితం చేయడానికి మనుషులు ఏమాత్రం వెనుకాడటం లేదు. పీల్చే గాలి మొదలు... తాగే నీటి వరకు అన్నింటినీ కాలుష్యానికి నెలవులుగా చేస్తూ భవిష్యత్ తరాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మరోవైపు తీవ్ర నీటి ఎద్దడి సమయంలోనూ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వృథా చేస్తున్నారు. జల సంరక్షణ అన్నదే పూర్తిగా మర్చిపోయారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే... మానవ జాతితో పాటు భూమి మీద నివసించే ప్రాణికోటి మొత్తం ఇబ్బందుల పాలుగాక తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా వారి మాటలను పట్టించుకోవడం లేదు. అయితే, మనుషులకు బుద్ధిలేకపోయినా తాము మాత్రం అలా కాదు అంటున్నాయి వానరాలు. ‘మా జీవితాన్ని ఆనందమయం చేసిన ప్రకృతికి ఎప్పుడూ రుణపడి ఉంటాం’ అన్నట్టుగా ఓ కోతి చేసిన పని ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. యూనిసెఫ్ కార్యకర్త నిహారికా సింగ్ పంజేతా సోషల్ ట్విటర్లో షేర్ చేసిన వీడియోలో... పైపులైన్ నుంచి లీక్ అవుతున్న నీటిని వృథా కానీయకుండా ఓ ఓతి చేసిన పనిపై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. పైపు నుంచి ఉబికి వస్తున్న నీటిని ఆపేందుకు ఆ కోతి ఎండు ఆకులను అడ్డం పెట్టడం ఆలోచింపచేసేదిగా ఉందని అంటున్నారు. ‘నీటిని వృథా చేయకూడదనే గొప్ప ఆలోచన. మనుషులుగా మనం తప్పు చేసినా అందమైన ఈ ఆత్మలు.. అడవి బిడ్డలు మనకు గుణపాఠం చెబుతున్నాయి. వాటికి ఉన్న బుద్ధి, సున్నితత్వం మనకు లేకుండా పోయింది. సిగ్గుపడాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. If other beings of the #wild can have such #grace, #intelligence and #sensitivity ...then I really don't know what went wrong with us #humans ..#whoaretherealanimals ?@AdityaPanda @ParveenKaswan pic.twitter.com/cSzFtZm4FY — Niharika Singh Panjeta (@Niharika_nsp) October 10, 2019 -
జల సంరక్షణలో మనమే టాప్
జలశక్తి అభియాన్అమలులో మన జిల్లాదేశంలోనే అగ్రగామిగా నిలిచింది.ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టిభూమిలో తేమ శాతాన్ని పెంచాలనికేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్నిప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా253 జిల్లాలలో పథకం అమలవుతోంది. కడప కార్పొరేషన్: మన రాష్ట్రంలో 9 జిల్లాలలోని 68 మండలాల్లో అమలు చేస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జలశక్తి అభియాన్ కింద జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకూ జలసంరక్షణ పనులు చేపట్టాలని కేంద్రం నిర్దేశించింది. తర్వాత ఆ గడువును సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. వేముల, వేంపల్లి, లింగాల, సింహాద్రిపురం, చిన్నమండెం, సంబేపల్లి, పోరుమామిళ్ల, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, కోడూరు, పెనగలూరు, కమలాపురం మండలాల్లో పథకం పనులు జరుగుతున్నాయి. వాననీటి సంరక్షణ నిర్మాణాలు, సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, రీచార్జ్ నిర్మాణాల ద్వారా బోరుబావులు పునరుద్ధరణ, వాటర్ షెడ్ అభివృద్ధి, విస్తృత అటవీకరణ కేటగిరీలలో ఇప్పటివరకూ 12,679 పనులు చేపట్టారు. అధికారులు ఈ పథకం అమలు విషయంలో శ్రద్ధ వహించారు. ఫలితంగా జలకళ ఉట్టిపడుతోంది. అధికారుల కృషికి ప్రతిఫలంగా జలశక్తి అభియాన్ పథకం అమలులో మన జిల్లా దేశంలోనే గుర్తింపు సాధించగలిగింది. కిసాన్ మేళాల నిర్వహణలో కూడా జిల్లాప్రథమ స్థానంలో ఉంది. నీటి వినియోగం, జలసంరక్షణపై రైతులకు, ప్రజలకుఅవగాహన కల్పించడానికి కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 53773మేళాలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ప్రత్యేక శ్రద్ధ జలశక్తి అభియాన్ అమలు విషయంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్, సెంట్రల్ నోడల్ ఆఫీసర్ ఎస్.సురేష్‌కుమార్, డ్వామా పీడీ యదుభూషణ్రెడ్డిలతోపాటు బ్లాక్ నోడల్ ఆఫీసర్లు రాజేందర్ కుమార్, శివ్ రతన్ అగర్వాల్, రూప్ కిషోర్, టెక్నికల్ ఆఫీసర్ కె. రమేష్‌లు చొరవ తీసుకున్నారు. ఆన్లైన్లో ప్రతి పది నిముషాలకోసారి జిల్లాల ర్యాంకులు, స్కోర్ మారిపోతూ ఉంటాయి. దీన్ని పదిలంగా ఉంచేందుకు తరచూ సమీక్షలు నిర్వహించడంతోపాటు ప్రతి మండలానికి ఒక ఇ¯న్చార్జి ఆఫీసర్‌ను నియమించారు. జిల్లా కేంద్రంలోఒక బృందం పనులను పర్యవేక్షించారు. క్లస్టర్ ఏపీడీలు, హెడ్ ఆఫీసు సిబ్బంది పట్టుదలతో పనిచేశారు. మరో నాలుగు రోజులు డ్వామా సిబ్బంది ప్రస్తుత కృషి కొనసాగిస్తే కష్టానికి ఫలితం లభించినట్లే. సమిష్టి కృషి వల్లే ఈ ఘనత సమిష్టి కృషి వల్లే అగ్రస్థానంలో జిల్లా నిలిచిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి. యదుభూషణ్‌రెడ్డి తెలిపారు. ఆగష్టు 2న తాను విధుల్లో చేరేనాటికి మన జిల్లా 222వ స్థానంలో ఉన్నదన్నారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్, సెంట్రల్ నోడల్ ఆఫీసర్ సురేష్‌కుమార్ సలహాలు, సూచనల మేరకు సిబ్బందిని సమాయత్త పరచడం ద్వారా పనులు వేగవంతం చేశామన్నారు. ఈనెల 15 నాటికి దేశంలో మూడో ర్యాంకుకు చేరవయ్యామన్నారు. సెలవులు కూడా తీసుకోకుండా సిబ్బంది కష్టపడ్డారని ప్రశంసించారు. డ్వామా సిబ్బందిని అభినందించిన పీడీ కడప కార్పొరేషన్: జలశక్తి అభియాన్ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి అభినందించారు. గురువారం ఆయన వారందరినీ సమావేశపరిచి మాట్లాడుతూ జల సంరక్షణ పనులు వేగవంతం చేయడంలో అందరూ అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, తద్వారా ఈనెల 30 తేదికి కూడా వైఎస్ఆర్ జిల్లా ప్రథమ స్థానంలో కొనసాగేందుకు కృషి చేయాలని కోరారు. -
జల కట్టడికి మిషన్-2
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరివాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను చెరువులకు మళ్లించి వాటికి జలకళను సంతరించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ కాకతీయ తొలి విడత ప్రయోగం విజయవంతం కావడంతో ప్రభుత్వం రెండో విడత ‘మిషన్’ను ప్రారంభించింది. ఈ దఫాలో ప్రాజెక్టుల కాల్వల నుంచి, ఇతర వాగులు, వంకల నుంచి పారే నీటిని వృథాగా పోనివ్వకుండా ఎక్కడికక్కడే కట్టడి చేసేలా చెక్‌డ్యామ్‌లు, కాల్వల నీళ్లు చెరువుల్లోకి మళ్లేలా తూముల నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్రక్రియను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నీటిపారుదల శాఖ ప్రారంభించనుంది. ఇప్పటికే సిద్ధం చేసిన చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణానికి ఆయా జిల్లాల్లోనే సాంకేతిక అనుమతులు మంజూరు చేసి, టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. దీనిపై ఇప్పటికే చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. 8,350 చెరువులు, 1,200 చెక్‌డ్యామ్‌లు తొలి విడత మిషన్ కాకతీయ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,531 చెరువుల్లో 27వేలకు పైగా చెరువులను పునరుద్ధరించారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, వాటికి అనుబంధంగా తూముల నిర్మాణం, వీలైనన్ని ఎక్కువ చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి పరివాహకంలో చిన్న నీటి వనరుల కింద కేటాయించిన 265 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడంతోపాటే రాష్ట్ర పరివా హకంలో కురిసే వర్షపు ప్రతి నీటిబొట్టు ఎక్కడికక్కడే నిల్వచేసి నీటి లభ్యత పెంచాలని సూచనలు చేశారు. దీని ద్వారా గరిష్ట ఆయకట్టు పారేలా చూడాలని సూచించారు. దీనికి అనుగుణంగా చెక్‌డ్యామ్, తూముల నిర్మాణానికి రూ.4,200 కోట్లు కేటాయిస్తూ పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా.. ముందుగా ప్రాజెక్టుల పరివాహకం పరిధిలోని 8,350 చెరువులను నింపాలని నిర్ణయించారు. ఈ గుర్తించిన చెరువుల్లోకి నీటిని మళ్లించేలా 3వేల తూముల నిర్మాణం చేయనున్నారు. ఈ తూముల నిర్మాణానికి రూ.410 కోట్లు మేర ఖర్చు చేయనున్నారు. ఇక కృష్ణా పరివాహకంలో 400, గోదావరి పరివాహకంలో 800 చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రాంతాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. వీటికి రూ.3,790 కోట్లు ఖర్చు చేయనున్నారు. చెక్‌డ్యాంలకు కనిష్టంగా రూ.3కోట్ల నంచి గరిష్టంగా రూ.8కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఈ చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణాలకు ఒక్కోదానికి ప్రభుత్వ పరంగా పరిపాలనా అనుమతులు ఇస్తే తీవ్ర జాప్యం జరిగే అవకాశాల దృష్ట్యా, నేరుగా ఆయా పరిధిలోని ఇంజనీర్లే సాంకేతిక అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం అనుమతించింది. దీని ప్రకారం జిల్లా ఇంజనీర్లే వీటి నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలను పరిశీలించి అనుమతులిస్తారు. ఆవెంటనే టెండర్లు పిలుస్తారు. వారం రోజుల్లోనే టెండర్లు ముగించి పనులు ఆరంభిస్తారు. తూముల నిర్మాణ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని నిబంధన పెట్టగా, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి 9 నెలల గడువు విధించారు. ఇప్పటికే అంచనాలు సిధ్దమైన చోట్ల జిల్లాల వారీగా సోమవారం నుంచి టెండర్ల ప్రక్రియ ఆరంభం కానుంది. టెండర్ల ప్రక్రియ ముగించి ఈ నెల 20 నుంచి అన్నిచోట్లా పనులు మొదలవ్వాలని ఇప్పటికే ఇంజనీర్లకు ఆదేశాలు వెళ్లాయి. కాళేశ్వరం నీళ్లతోనే 3,011 చెరువులు ఈ ఖరీఫ్‌లోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోయనున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే ప్రాజెక్టు కాల్వలను చెరువులకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కాళేశ్వరం కాల్వల పరిధిలో మొత్తంగా 3,011 చెరువులను గోదావరి నీటితో నింపేలా ప్రస్తుతానికి ప్రణాళిక వేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం కడెం కింద 62 చెరువులు, ఎస్సారెస్పీ సరస్వతి కెనాల్ కింద 38, సదర్మట్ బ్యారేజీ కింద 7, ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 396, స్టేజ్–2 కింద 182, దేవాదుల కింద 286, ఎస్సారెస్పీ కింద నేరుగా 1,200, ఎల్లంపల్లి కింద 124, మిడ్‌మానేరు పరిధిలో 12, వరద కాల్వల కింద 17, అప్పర్ మానేరు కింద 22, కాళేశ్వరం పరిధిలో ఇతర ప్యాకేజీల కింద 266, నిజాంసాగర్ కింద 399 చెరువులను నింపేలా ఇప్పటికే ప్రణాళిక సిధ్ధం చేశారు. ఈ చెరువుల్లో చేరే నీటి సామర్థ్యం సుమారుగా 37.37 టీఎంసీలుగా ఉంటుందని లెక్కగట్టారు. ఈ చెరువుల కింద మొత్తంగా 2,89,038 ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి వస్తుందని గుర్తించారు. ఈ చెరువులను నింపేలా ఎక్కడెక్కడ తూముల నిర్మాణం చేయాలన్నది ఇంకా గుర్తించే పనిలో ఉన్నారు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాల్వల పరిధిలో 278 చెరువులను నింపేందుకు కొత్తగా 201 తూముల నిర్మాణం చేసేందుకు నిర్ణయించారు. ఈ తూమల నిర్మాణానికి 7.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. -
నన్నెందుకు నిందిస్తారు!
మీ వరకేనా న్యూ ఇయర్ తీర్మానాలు? చెట్లను కాపాడతానని, చుక్క నీటిని వృథా చేయనని ఎందుకు ప్రతిజ్ఞ చెయ్యరు? డిసెంబరు 31, ఆ తరవాత జనవరి 1. నా కాల గతి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. చంద్రుడు రాత్రివేళల్లోనే తన చల్లని కిరణాలను ప్రసరిస్తున్నాడు. సృష్టి ప్రారంభం నుంచి మానవులందరికీ రెండు కళ్లు, రెండు చెవులు, రెండు చేతులు, రెండుకాళ్లు.. అన్నీ మామూలే. నవమాసాలు మోసి స్త్రీలే పిల్లల్ని కంటున్నారు. నా ప్రయాణంలో ఇవి అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రకృతిలో సహజంగా ఎటువంటి మార్పు లేదు. ఇంత నిక్కచ్చిగా నేను ప్రయాణిస్తుంటే, అందరూ నన్ను నిందిస్తారెందుకో! ఏ చిన్నపాటి ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఏ మాత్రం ఆలోచించకుండా, ‘కాలమహిమ కాకపోతే...’ అంటారు. కాలంలో ఏ మార్పు వచ్చిందని ఈ మాట అంటున్నారో నాకు అర్థం కాదు. కాలచక్రం ప్రారంభమైన నాటినుంచి నేటి వరకూ సృష్టి పంచభూతాత్మకంగానే ఉంది కదా. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం.. ఇవన్నీ ఎవరి తప్పిదాల వల్ల జరుగుతున్నాయి? గాలి తనంతట తాను కలుషితం కాదుగా? నీరు తనంత తాను కలుషితం కాదుగా? ఇటువంటి కాలుష్యాలకు నేనేదో కారణం అయినట్లు, ‘కాలం కాకపోతే’ అని నన్ను నిందించవలసిన అవసరం ఏంటి? ఇవన్నీ పక్కన పెడదాం. నా ప్రయాణం ఒక సంవత్సరంలో నుంచి మరో సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే సమయంలో.. ఈ రోజు నుంచి సిగరెట్, మందు వంటి దురలవాట్లు మానేయాలి అంటూ నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి తీసుకోవడానికి నా కాలగమనానికి సంబంధం ఏంటి? ఇవన్నీ వ్యక్తిగత నిర్ణయాలు. అసలు వీరంతా సమాజం గురించి ఆలోచించరా? ‘‘నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగకూడదు. సమాజానికి మేలు జరగాలి. నేను వృక్షాలను పరిరక్షిస్తాను, నేటి నుంచి ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయను, హామీలను నెరవేర్చని నాయకుడిని పదవీచ్యుతుడిని చేస్తాను’’ అని ఎందుకు ప్రతిజ్ఞ చేయరు? ఇన్ని మంచి మార్పులు జరిగితేనే కదా నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను. నాకు అనారోగ్యం చేస్తే మానవ మనుగడకు ఎంత ప్రమాదమో ఒక్కరూ ఆలోచించరే. ఒక్కో చెట్టు కొట్టేస్తుంటే నా గుండెలు ఎలా పగులుతాయో ఒక్కరైనా ఆలోచించారా? మానవ తప్పిదాల వల్ల భూమాత శరీరం ఎంత వేడెక్కిపోతోందో ఆలోచించారా? ఇప్పటికైనా ‘సొంత లాభం కొంతమానుకు, పొరుగువారికి తోడుపడవోయ్’ అనే గురజాడ మాటలను ఆచరిస్తామని సంకల్పించండి. మానవ అభివృద్ధి కోసం ప్రతినబూనండి. అప్పుడు ‘కాల మహిమ’ అనండి. నా మహిమలను కాపాడండి. స్వగతం : వైజయంతి -
'ఇంకుడుగుంతలు లేకుంటే నల్లా కలెక్షన్ ఇవ్వం
హైదరాబాద్: ఇంకుడుగుంతలు లేకుంటే ఇంటికి అనుమతి, నల్లా కనెక్షన్ ఇవ్వమని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. శనివారం నగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఇంకుడుగుంతను తవ్వి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. రెండు కొత్త జలాశయాలు పూర్తయితే నగరంలో మంచినీటి సమస్య తీరినట్టేనని అన్నారు. ఇంటి నెంబర్ల కోసం డిజిటల్ నెంబరింగ్ విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు.