టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ గురించి సలహా ఇస్తే ఎవరు కాదంటారు చెప్పండి. మాస్టర్ బ్లాస్టర్ ఎలాంటి సలహాలు ఇచ్చినా అవి అందికి ఉపయోగపడేలానే ఉంటాయి. క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పిన సచిన్ ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండియా లెజెండ్స్‌కు నాయకత్వం వహిస్తున్న సచిన్.. సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. స్టువర్ట్ బిన్నీ విధ్వంసంతో ఇండియా లెజెండ్స్ తమ తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విషయం పక్కనబెడితే.. సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో బ్యాట్ హాండిల్‌ను, గ్రిప్‌ను ఎలా శుభ్రపరుచుకోవాలో చూపించాడు. ''ఇలాంటి చిన్న విషయాలు ఎవరు చెప్పరు'' అంటూ వీడియోకు క్యాప్షన్ జత చేశాడు. ఈ ప్రక్రియ అంతా బాగానే ఉన్నప్పటికి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సచిన్‌ను ఒక విషయంలో తప్పుబట్టారు.
అదేంటంటే.. బ్యాట్‌ను క్లీన్ చేసే క్రమంలో నీటిని చాలా వరకు వృథా చేశాడు. అవసరం ఉన్నప్పుడు ట్యాప్ తిప్పితే సరిపోయేది.. కానీ సచిన్ అలా చేయకుండా వీడియోలో మాట్లాడుతున్నంత సేపు ముందు కుళాయిలో నీరు వృథాగా పోతూనే ఉంది. ఈ అంశంమే సచిన్‌ను చిక్కుల్లో పడేలా చేసింది. సచిన్ వీడియోనూ చూసిన చాలా మంది అభిమానులు.. దిగ్గజం నీరు వృథా చేయడంపైనే ఫోకస్ పెట్టారు.
ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబై సివిక్ బాడీ ''సేవ్ వాటర్'' క్యాంపెయిన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. క్రికెట్‌లో దిగ్గజంగా పేరు పొంది.. అందునా ''సేవ్ వాటర్'' క్యాంపెయిన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సచిన్ ఇలా చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ''సచిన్ సార్.. మీరు చెప్పాలనుకున్న విషయం మంచిదే కావొచ్చు.. కానీ ఇలా నీరును వృథా చేయడం బాగాలేదు''.. ''సార్.. నీటిని రక్షించాలన్న మీ మాటలు మరిచిపోయారా.. ముంబై సివిక్ బాడీ అయిన ''సేవ్ వాటర్'' క్యాంపెయిన్‌కు మీరు బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి గుర్తుంది కదా'' అంటూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment