జలశక్తి అభియాన్‌అమలులో మన జిల్లాదేశంలోనే అగ్రగామిగా నిలిచింది.ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టిభూమిలో తేమ శాతాన్ని పెంచాలనికేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్నిప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా253 జిల్లాలలో పథకం అమలవుతోంది.
కడప కార్పొరేషన్: మన రాష్ట్రంలో 9 జిల్లాలలోని 68 మండలాల్లో అమలు చేస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జలశక్తి అభియాన్ కింద జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకూ జలసంరక్షణ పనులు చేపట్టాలని కేంద్రం నిర్దేశించింది. తర్వాత ఆ గడువును సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. వేముల, వేంపల్లి, లింగాల, సింహాద్రిపురం, చిన్నమండెం, సంబేపల్లి, పోరుమామిళ్ల, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, కోడూరు, పెనగలూరు, కమలాపురం మండలాల్లో పథకం పనులు జరుగుతున్నాయి. వాననీటి సంరక్షణ నిర్మాణాలు, సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, రీచార్జ్ నిర్మాణాల ద్వారా బోరుబావులు పునరుద్ధరణ, వాటర్ షెడ్ అభివృద్ధి, విస్తృత అటవీకరణ కేటగిరీలలో ఇప్పటివరకూ 12,679 పనులు చేపట్టారు. అధికారులు ఈ పథకం అమలు విషయంలో శ్రద్ధ వహించారు. ఫలితంగా జలకళ ఉట్టిపడుతోంది. అధికారుల కృషికి ప్రతిఫలంగా జలశక్తి అభియాన్ పథకం అమలులో మన జిల్లా దేశంలోనే గుర్తింపు సాధించగలిగింది. కిసాన్ మేళాల నిర్వహణలో కూడా జిల్లాప్రథమ స్థానంలో ఉంది. నీటి వినియోగం, జలసంరక్షణపై రైతులకు, ప్రజలకుఅవగాహన కల్పించడానికి కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 53773మేళాలు నిర్వహించారు.
ఉన్నతాధికారుల ప్రత్యేక శ్రద్ధ
జలశక్తి అభియాన్ అమలు విషయంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్, సెంట్రల్ నోడల్ ఆఫీసర్ ఎస్.సురేష్‌కుమార్, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డిలతోపాటు బ్లాక్ నోడల్ ఆఫీసర్లు రాజేందర్ కుమార్, శివ్ రతన్ అగర్వాల్, రూప్ కిషోర్, టెక్నికల్ ఆఫీసర్ కె. రమేష్‌లు చొరవ తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో ప్రతి పది నిముషాలకోసారి జిల్లాల ర్యాంకులు, స్కోర్ మారిపోతూ ఉంటాయి. దీన్ని పదిలంగా ఉంచేందుకు తరచూ సమీక్షలు నిర్వహించడంతోపాటు ప్రతి మండలానికి ఒక ఇ¯న్‌చార్జి ఆఫీసర్‌ను నియమించారు. జిల్లా కేంద్రంలోఒక బృందం పనులను పర్యవేక్షించారు. క్లస్టర్ ఏపీడీలు, హెడ్ ఆఫీసు సిబ్బంది పట్టుదలతో పనిచేశారు. మరో నాలుగు రోజులు డ్వామా సిబ్బంది ప్రస్తుత కృషి కొనసాగిస్తే కష్టానికి ఫలితం లభించినట్లే.
సమిష్టి కృషి వల్లే ఈ ఘనత
సమిష్టి కృషి వల్లే అగ్రస్థానంలో జిల్లా నిలిచిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి. యదుభూషణ్‌రెడ్డి తెలిపారు. ఆగష్టు 2న తాను విధుల్లో చేరేనాటికి మన జిల్లా 222వ స్థానంలో ఉన్నదన్నారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్, సెంట్రల్ నోడల్ ఆఫీసర్ సురేష్‌కుమార్ సలహాలు, సూచనల మేరకు సిబ్బందిని సమాయత్త పరచడం ద్వారా పనులు వేగవంతం చేశామన్నారు. ఈనెల 15 నాటికి దేశంలో మూడో ర్యాంకుకు చేరవయ్యామన్నారు. సెలవులు కూడా తీసుకోకుండా సిబ్బంది కష్టపడ్డారని ప్రశంసించారు.
డ్వామా సిబ్బందిని అభినందించిన పీడీ
కడప కార్పొరేషన్: జలశక్తి అభియాన్ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి అభినందించారు. గురువారం ఆయన వారందరినీ సమావేశపరిచి మాట్లాడుతూ జల సంరక్షణ పనులు వేగవంతం చేయడంలో అందరూ అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, తద్వారా ఈనెల 30 తేదికి కూడా వైఎస్‌ఆర్ జిల్లా ప్రథమ స్థానంలో కొనసాగేందుకు కృషి చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment