
బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రులు
గోదావరిఖని(కరీంనగర్): కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్‌డిపోలో నూతన బస్సు సర్వీసులను మంత్రులు ప్రారంభించారు. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో డిపోనకు కొత్తగా మంజూరైన 10 జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులతోపాటు తిరుపతికి ఏసీ బస్సును మంత్రులు ఈటల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు.