భూమి పూజ కార్యక్రమంలో నేతల మధ్య వాగ్వాదం
హైదరాబాద్: భూమి పూజ కార్యక్రమం విషయంలో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం హైదరాబాద్‌లోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలతో మంద మల్లమ్మ చౌరస్తాలో ఆర్‌సీఐ రోడ్డు వెడల్పుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజ రయ్యారు.
అయితే భూమి పూజ విషయంలో ఆర్‌సీఐ అధికారులు తమను సంప్రదించలేదని మహేందర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఇరు పార్టీల కార్యకర్తలు సముదాయించి నాయకులిద్దరిని కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
పట్నం వర్సెస్ తీగల
Published Fri, Aug 8 2014 1:53 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement