రాకేశ్
ధారూరు(వికారాబాద్): నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లికి నిరాకరించారన్న కోపంతో ఓ యువకుడు తల్లీ, కూతుళ్లపై పెట్రోల్ పోసి హతమార్చేందుకు యత్నించాడు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వికారాబాద్ జి ల్లా ధారూరు మండలం గడ్డమీది గంగారం గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన గొల్ల రాకేశ్ (27) హైదరాబాద్‌లో ఆటో మొబైల్ రంగంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో రాకేశ్‌కు ఏడాది క్రితం (ఇల్లరికం) నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత రాకేశ్ యువ తిపై అనుమానం పెంచుకుని వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని యు వతి తల్లి భారతమ్మ గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టి వారి సమక్షంలో పెళ్లి రద్దు చేసుకున్నారు. గ్రామంలోని మేనత్త ఇంట్లో వారంరోజులుగా మకాం వేసి ఆ యువతిని తనకిచ్చి పెళ్లి చేయాలని రాకేశ్ వేధించడం మొదలు పెట్టాడు.
అందుకు యువతి తల్లి అడ్డుచెబుతుండటంతో కోపంతో రగిలిపోయిన రాకేశ్ ఆ తల్లీకూతుళ్లను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అందులోభాగంగా పథకం ప్ర కారం ఆదివారం యువతి ఇంటికి వెళ్లి తల్లీ, కూతుళ్లపై వెంట తెచ్చుకున్న పెట్రో ల్ పోశాడు. తల్లీకూతుళ్లు భయంతో కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని అగ్గిపుల్ల వెలిగిస్తున్న రాకేశ్‌ను పట్టుకుని బంధించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment