ఉసురు తీసిన కుటుంబ కలహాలు | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన కుటుంబ కలహాలు

Published Wed, Jul 3 2024 12:54 PM | Last Updated on Wed, Jul 3 2024 1:27 PM

-

కుల్కచర్ల: కుటుంబ కలహాలతో కలత చెందిన తండ్రి ఆత్మహత్యకు సిద్ధపడగా.. కాపాడబోయిన కూతురుతో పాటు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుల్చచర్ల మండల పరిధి చౌడాపూర్‌ల మండలం మందిపల్‌ గ్రామానికి చెందిన శివానంద్‌(51) భార్య లావణ్యలకు కుమారుడు సాయి, కూతురు చందన ఉన్నారు. 

25 సంవత్సరాలుగా ఈ కుటుంబం మహబూబ్‌నగర్‌ జిల్లా శివరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో భూమి విషయంలో ఇంట్లో గొడవ జరగగా.. మనస్థాపం చెందిన శివానంద్‌.. రైలు పట్టాలపై నిల్చున్నాడు. ఇది గమనించిన కూతురు, కుమారుడు తండ్రిని కాపాండేదుకు యత్నించగా.. వేగంగా వచ్చిన రైలు.. తండ్రి శివానంద్‌, తనయ చందనను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలకు కుటుంబ సభ్యులు మందిపల్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement