ఇసుక ట్రాక్టర్ బోల్తా కొట్టిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శేకర్‌గౌడ్
బషీరాబాద్: ఇసుక మాఫియా బరితెగించింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకోబోయిన పోలీస్ కానిస్టేబుల్‌పై ట్రాక్టర్ ఎక్కించడంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలతో తాండూరు డీఎస్పీ శేకర్‌గౌడ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి.శంకర్, హోంగార్డు శివరాం రాత్రి బ్లూ కోట్ విధుల్లో భాగంగా ఇందర్‌చెడ్ గ్రామంలో ఉన్నారు. ఈ సమయంలో ఇసుక లోడుతో వచ్చిన ట్రాక్టర్‌ను గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా బైక్ పైకి తీసువెళ్లాడు. ట్రాక్టర్ కింద పడిన కానిస్టేబుల్ శంకర్‌పై నుంచి ఇసుక ట్రాక్టర్ చక్రాలు వెళ్లాయి.
దీంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. అనంతరం తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్‌ను వేగంగా తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఇసుక మాఫియా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ట్రాక్టర్‌తో ఢీ కొట్టిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం సేడం తాలుకా అయ్యాళం గ్రామానికి చెందిన భీమారాయగా గుర్తించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టా రు. ప్రత్యేక పోలీసు బృందం కర్ణాటక సరిహద్దు గ్రామాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టిందని డీఎస్పీ తెలిపారు. కాగా తీవ్ర గాయాలపాలైన శంకర్‌కు తాండూరులో ప్రథమ చికిత్స చేయించి, మె రుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. విరిగిన కాళ్లకు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆగని ఇసుక మాఫియా..
బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫియా ఆగడా లు పెచ్చుమీరాయి. ఐదేళ్లుగా క్యాద్గిరా, నవాంద్గి, గంగ్వార్, ఇందర్‌చెడ్ గ్రామాల వద్ద కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో ఈ వ్యవహారం కొనసాగుతోందన్న ఆ రోపణలున్నాయి. ఈ విషయంపై ‘సాక్షి’పలు మా ర్లు కథనాలు సైతం ప్రచురించింది. పోలీసు, రెవె న్యూ, భూగర్భశాఖ అధికారులు నిర్లక్ష్యంతోనే ఇసు క మాఫియా రెచ్చిపోతోందనే వాదనలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment