
మోమిన్‌పేట: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కిం దికి దూసుకెళ్లిన ఘటనలో మహిళా కండక్టర్‌తోపా టు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వికారాబా ద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.తాండూరు డిపోకు చెందిన బస్సు (టీఎస్ 34ఏ 6125)ను తీసుకొని డ్రైవర్ ఉస్మాన్, కండక్టర్ లక్ష్మి మధ్యాహ్నం సమయంలో ప్రయాణికులతో తాండూరు నుంచి సంగారెడ్డికి బయలుదేరారు. మోమిన్‌పేట మండలం కేసారం దాటాక మొరంగపల్లి సమీపంలోని రైల్వే గేటు వద్ద ఉన్న మ లుపులో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దిగింది. అక్కడే ఉన్న రైల్వే గేటుకు సంబంధించిన ఇనుప స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కండక్టర్ లక్ష్మి చేతికి బలమైన గాయమైంది. బస్సులో ఉన్న మో త్కుపల్లికి చెందిన దంపతులు ఎల్లమ్మ, మొగుల య్య గాయపడ్డారు. మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని 108వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయం లో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment