seven members
-
షాకింగ్ వీడియో: ఒకే బైక్‌పై ఏడుగురు ప్రయాణం
ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్లేందుకే అనుమతి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ముగ్గురు వెళ్తారు. బైక్ ముగ్గురు కూర్చుంటేనే కష్టంగా ఉంటుంది.. ఏకంగా ఏడుగురు ప్రయాణిస్తే..! ఆలోచిస్తే.. అసాధ్యం అనుంకుటున్నారు కదా? అయితే ఒకే బైక్‌పై ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు(నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి) వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాటల్లేవ్.. అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన బైక్‌పై ముందు ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకోగా.. వెనకాల ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారి ఒడిలో ఇద్దరు పిల్లలను పట్టుకున్నారు. కుటుంబం మొత్తాన్ని ఒకే బైక్‌పై తీసుకెళ్లి ఔరా అనిపించాడు ఆ వ్యక్తి. అయితే, బైక్‌పై ఉన్న ఏ ఒక్కరికీ హెల్మెట్ లేకపోవటం గమనార్హం. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.2 మిలయన్ల మంది చూశారు. ఈ విధంగా ప్రయాణించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు సరైన రవాణా సౌకర్యం లేకపోవటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందేమోనని మద్దతు తెలుపుతున్నారు. ఏడుగురిని ఒకే బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. Speechless 😶 pic.twitter.com/O86UZTn4at — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022 ఇదీ చదవండి: Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు.. -
అదుపు తప్పిన బస్సు
మోమిన్‌పేట: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కిం దికి దూసుకెళ్లిన ఘటనలో మహిళా కండక్టర్‌తోపా టు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వికారాబా ద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.తాండూరు డిపోకు చెందిన బస్సు (టీఎస్ 34ఏ 6125)ను తీసుకొని డ్రైవర్ ఉస్మాన్, కండక్టర్ లక్ష్మి మధ్యాహ్నం సమయంలో ప్రయాణికులతో తాండూరు నుంచి సంగారెడ్డికి బయలుదేరారు. మోమిన్‌పేట మండలం కేసారం దాటాక మొరంగపల్లి సమీపంలోని రైల్వే గేటు వద్ద ఉన్న మ లుపులో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దిగింది. అక్కడే ఉన్న రైల్వే గేటుకు సంబంధించిన ఇనుప స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కండక్టర్ లక్ష్మి చేతికి బలమైన గాయమైంది. బస్సులో ఉన్న మో త్కుపల్లికి చెందిన దంపతులు ఎల్లమ్మ, మొగుల య్య గాయపడ్డారు. మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని 108వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయం లో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. -
కేసీఆర్ సారూ ఆదుకోండి
జగిత్యాల క్రైం: ‘నమస్తే కేసీఆర్ సారూ.. కేటీఆర్ సారూ..! మేము సౌదీలో చిత్రహింసలకు గురవుతున్నాం. మా కంపెనీ యజమాని రోజూ రాత్రి వచ్చి కొడుతుండు. చంపుతానని బెదిరిస్తుండు. ఈ చిత్రహింసలు భరించలేకపోతున్నం. ఈరోజు రాత్రే ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటున్నం. మీరే మాయందు దయతలచి ఇండియాకు వచ్చేలా చూడుండ్రి సారూ..’అంటూ జగిత్యాల జిల్లాకు చెందిన ఏడుగురు యువకులు సోషల్ మీడియాలో ఆదివారం ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. రెండేళ్ల క్రితం వీరు సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లారు. అంబారీపేటకు చెందిన గోనెల వెంకట్‌రెడ్డి, ఆదె మహేశ్, ఆనగండ నడిపి అంజన్న, అంతర్గాంకు చెందిన భూపెల్లి రంజిత్, లక్ష్మీపూర్‌కు చెందిన నక్క వేణు, జిల్లాకు చెందిన మరో ఇద్దరు యువకులు అక్కడ చిక్కుకున్నారు. కంపెనీ యజమాని చేతిలో చిత్రహింసలు పడుతున్నామని రోదిస్తూ తెలిపారు. తమను ఎలాగైనా ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కోరారు. కొద్దికాలంగా కంపెనీ యజమాని మధ్యాహ్నం వేళ పనిచేయించుకొని, రాత్రి వచ్చి కొడుతున్నాడని తెలిపారు. పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడని, అనారోగ్యానికి గురైనా ఆస్పత్రులకు వెళ్లనీయడం లేదని పేర్కొన్నారు. ఇక చిత్రహింసలు భరించలేకపోతున్నామని.. కంపెనీ నుంచి బయటకు పారిపోతున్నామని తెలిపారు. తమను సొంతూర్లకు చేర్చేలా చూడాలని విన్నవించారు. -
జార్ఖండ్‌లో దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురు..
-
ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు బలవన్మరణం చెందారు. రాంచీలోని కంకే పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే సచ్చిదానంద ఝా(65), గాయత్రీ దేవీ(60) దంపతులకు దీపక్ (40), రూపేశ్ (30)కుమారులు కాగా దీపక్‌కు భార్య సోని, ఆరేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపక్ రాంచీలో ఫర్నిచర్ స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం దీపక్ కుమార్తెను స్కూల్‌కు తీసుకెళ్లేందుకు వచ్చిన బస్సు క్లీనర్ ఆ ఇంటి తలుపులు వేసి ఉండడం గమనించి పొరుగు వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా సచ్చిదానందతోపాటు, దీపక్ పిల్లలిద్దరి శరీరాలపై కత్తిగాట్లున్నాయి. గాయత్రీదేవి, దీపక్, సోని, రూపేశ్ ఉరి వేసుకుని కనిపించారు. అప్పటికే అందరూ చనిపోయినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము చనిపోతున్నట్లు సచ్చిదానంద తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. -
కేబుల్‌కార్ కూలి ఏడుగురి దుర్మరణం
శ్రీనగర్: బారాముల్లా జిల్లాలో గుల్మార్గ్లో ఓ కేబుల్‌కార్ ఆదివారం కుప్పకూలడంతో ఏడు గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు ముగ్గురు గైడ్లు ఉన్నారు. బలమైన గాలులకు ఓ చెట్టు మీద పడడంతో రోప్‌వే తెగిపోయి ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలి పారు. మృతుల్ని ఢిల్లీకి చెందిన జయంత్ అంద్రస్కర్, ఆయన భార్య మనీశా అం ద్రస్కర్, కుమార్తెలు అన్ఘా, జహ్నవిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ముక్తార్ అహ్మద్, జహంగీర్ అహ్మద్, ఫరూక్ అహ్మద్ అనే ముగ్గురు స్థానిక టూరిస్టు గైడ్లు దుర్మరణం చెందారు. గాయపడ్డ మరో ఇద్దరిని అధికారులు శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. -
చోరీలకు పాల్పడుతున్న ఏడుగురి అరెస్ట్
రూ.3.84 లక్షల విలువైన 128 గ్రాముల బంగారు నగలు స్వాధీనం రాజమహేంద్రవరం క్రైం : వ్యసనాలకు బానిసలైన యువకులు మహిళల మెడలో బంగారు నగలు చోరీ చేస్తూ పట్టుబడ్డారు. బుధవారం రాజమహేంద్రవరం త్రీటౌ¯ŒS పోలీస్ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.శ్రీరామకోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఏడుగురు యువకులు ముఠాగా ఏర్పడి మహిళల మేడలో నగలు చోరీలు చేస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తు విలాసంగా గడుపుతున్నారన్నారు. మంగళవారం సాయంత్రం 4.30 సమయంలో కోరుకొండ రోడ్డులోని ముత్తుట్ ఫైనా¯Œ్స కంపెనీ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుల సమాచారం రావడంతో త్రీటౌ¯ŒS ఎస్సై ఎం.వెంకటేశ్వరావు, హెడ్ కానిస్టేబుల్ డీవీ భాస్కరరావు, కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లి యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పిఠాపురానికి చెందిన అనుపోజు శంకర్ శాంతి స్వరూప్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పీ అండ్ టీ కాలనీకి చెందిన కాకర్ల శ్రీనివాసరెడ్డి, మరో ఐదుగురు ముఠాగా ఏర్పడి మహిళల మెడల నుంచి బంగారు పుస్తెలతాళ్లు, మంగళ సూత్రాలు చోరీలు చేసి పరారవుతున్నారని తెలిపారు. నిందితుల నుంచి 6 బంగారు మంగళ సూత్రాల తాడులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి బరువు 128 గ్రాములు ఉంటుందని తెలిపారు. విలువ రూ 3.84 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం తరలించారు. -
హైదరాబాద్‌లో స్కూల్ బస్సు బీభత్సం
-
మూడు రోజుల్లో ఏడుగురి ఆత్మహత్యాయత్నం
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): గత మూడు రోజుల్లో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఏడుగురిని లేక్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవాడిగూడకు చెందిన సాయికుమార్ (24) టీ స్టాల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి అలవాటు పడిన ఇతను ఈ నెల 2వ తేదీ రాత్రి భార్యతో గొడవకు దిగాడు. దీన్ని గమనించిన అతని తండ్రి మందలించాడు. దీంతో సాయికుమార్ మద్యం మత్తులో ట్యాంక్‌బండ్‌కు వచ్చి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. బైబిల్‌హౌజ్ ప్రాంతానికి చెందిన రేణుక (23) ఈ నెల 3వ తేదీ రాత్రి తన కుమార్తె సాయిప్రియతో కలిసి ట్యాంక్‌బండ్‌కు వచ్చి సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా పోలీసులు రక్షించారు. సుల్తాన్‌షాహికి చెందిన స్వప్న (27), దేవీనగర్‌కాలనీ కవాడీగూడకు చెందిన బి.శృతిలయ(24) 3వ తేదీన తన ఆరు నెలల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. గస్తీ నిర్వహిస్తున్న లేక్ పోలీసులు వారిని రక్షించారు. అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడకు చెందిన కవిత(38), రాజు భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని 3వ తేదీన గొడవ పడి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యచేసుకునేందుకు రాగా లేక్ పోలీసులు రక్షించారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆ బాలిక వల్ల ఏడుగురికి కొత్త జీవితం
పంజగుట్ట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన 14 ఏళ్ల బాలిక అవయవాలతో మరో ఏడుగురికి కొత్త జీవితం. దీనికి సంబంధించి నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనురాధ తెలిపిన వివరాల ప్రకారం... బీదర్‌కు చెందిన ఐనాపూర్ మహేష్ తన భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె శివాని(14)తో కలిసి తిరుపతికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా గత నెల 30న బీదర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహేష్ కుటుంబ సభ్యులందరికీ గాయాలు కాగా, వారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. మహేష్ కుమార్తె శివాని (14) తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్ తన కుమార్తె అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడంతో శివానికి శస్త్రచికిత్స నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్, రెండు హార్ట్ వాల్వులు, రెండు కండ్లు తొలగించి వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవసరమైన వారికి అమర్చారు. -
పాముతో బెదిరించి యువతి పై గ్యాంగ్ రేప్