
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 35 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. గురువారం ఉదయం కాంగ్రాలోని లంజ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూలు బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో కొందరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరంతా గురువారం ధర్మశాలలో జరుగుతున్న నరేంద్ర మోదీ ర్యాలీ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment