
జిల్లా కాకపోతే రాజీనామా చేస్తా
వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు
వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ 19 మండలాలతో కూడిన జిల్లా కాకపోతే మొదట రాజీనామా చేసేది నేనేనని వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయ న అమెరికా నుంచి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్‌ను జిల్లా చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ను 19 మండలాలతో కూడిన జిల్లాగా ఏర్పాటు చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.
ఒకసారి మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ వెనక్కు తీసుకోరన్నారు. ముసాయిదాలో పెట్టిన 19 మండలాలతో కూడిన జిల్లా గెజిట్ 28వ తేదీ లోపు వస్తుందని అందులో ఎవరూ ఎలాంటి అపోహలు చెందవద్దన్నారు. ఎవరెన్ని కృత్రిమ ఉద్యమాలు చేయించినా వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యి తీరుతుందన్నారు.