sanjeeva rao
-
వైఎస్సార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
జోగిపేట(అందోల్): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తెలంగాణలోని 31 జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టి , వైఎస్సార్ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావు అన్నారు. బస్సుయాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందోలు గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్, మే నెలలో బస్సుయాత్రను నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ యాత్రను చేపడుతున్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈయాత్ర జరుగనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, వాటిని కూడా ప్రజల ముందు ఉంచుతామన్నారు. విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో నిర్లక్ష్యం చేసిందన్నారు. దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమిని అందించడం లేదన్న విషయాన్ని తెలంగాణ వ్యాప్తంగా తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అందోలు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, పరిపూర్ణ, రాజు, ప్రవీణ్‌కుమార్, వినోద్, టీ.నరేష్, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రాకేష్ పాల్గొన్నారు. -
జిల్లా కాకపోతే రాజీనామా చేస్తా
వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ 19 మండలాలతో కూడిన జిల్లా కాకపోతే మొదట రాజీనామా చేసేది నేనేనని వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయ న అమెరికా నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్‌ను జిల్లా చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ను 19 మండలాలతో కూడిన జిల్లాగా ఏర్పాటు చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఒకసారి మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ వెనక్కు తీసుకోరన్నారు. ముసాయిదాలో పెట్టిన 19 మండలాలతో కూడిన జిల్లా గెజిట్ 28వ తేదీ లోపు వస్తుందని అందులో ఎవరూ ఎలాంటి అపోహలు చెందవద్దన్నారు. ఎవరెన్ని కృత్రిమ ఉద్యమాలు చేయించినా వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యి తీరుతుందన్నారు. -
కూకట్పల్లి ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్: కూకట్ పల్లి ఏసీపీ సంజీవరావు ఇంట్లో శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిచారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. సంజీవరావుకు సంబంధించిన వివిధ ప్రాంతాలలోని ఆరు చోట్ల ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కూకట్ పల్లి కార్యాలయం సహా అల్వాల్ లోని ఇళ్లు, వరంగల్, కరీంనగర్‌లలో దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో 75 తులాల బంగారం, షాపింగ్ కాంప్లెక్స్, ఐటీ కాలనీలో రెండు ఇళ్లు, షామీర్ పేటలో ఓ ఫాం హౌజ్, తూప్రాన్‌లో 30 ఎకరాలు, మూలుగులో 10 ఎకరాలు, రామన్నపేటలో 10 ఎకరాల స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాక కంటోన్మెంట్ వాసవీ కాలనీలో బినామీ పేర్ల మీద సంజీవరావు ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీపీ డీఎస్పీ సునీత వెల్లడించారు. సంజీవరావుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. సోమవారం బ్యాంకు లాకర్లను తెరవనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటివరకు రెండుకోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. -
కూకట్పల్లి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
హైదరాబాద్ : కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజామున అకస్మిక దాడి చేశారు. ఆల్వాల్‌లోని ఆయన నివాసం, కార్యాలయంతోపాటు మరో ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ. 2 కోట్ల మేర ఆస్తులు కనుగొన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. సంజీవరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టీ టీడీపీలోని రాష్ట్రస్థాయి నేతకు ఏసీపీ సంజీవరావు సమీప బంధువుని సమాచారం. -
ఒక్క డైలాగుతో ఉద్యోగం వచ్చేసింది
పదేళ్ల క్రితం వరకు రేడియో నాటకాల్లో ఓ గంభీరమైన గాత్రం శ్రోతలందర్నీ ఎంతగానో అలరించింది. గుక్క తిప్పుకోకుండా ఎంత పెద్ద డైలాగునైనా అనర్గళంగా చెప్పగల సత్తా ఆ స్వరానికే సొంతం. రేడియోలోనే కాక రంగస్థల నాటకాల్లో, సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించిన ఆ కళాకారుడే కోకా సంజీవరావు. నాటకాల్లో చెంఘిజ్‌ఖాన్, ఖడ్గ తిక్కన, రాముడు, భీష్ముడు, దుర్యోధనుడు అలా ఎన్నో పాత్రల్లో ఇమిడిపోయారాయన. నటనే కాకుండా నాటికలూ రచించారు. ఈ వారం ‘రేడియో అంతరంగాలు’ కోసం సంజీవరావును ఇంటర్వ్యూ చేశారు ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్. ఆయన ప్రస్థానంలోని విశేషాలు ఆయన మాటల్లోనే... జనం మెచ్చిన ‘జనరంజని’ విజయవాడలో పని చేస్తుండగా కోకా సంజీవరావు... శోభన్‌బాబు, సూపర్ స్టార్ కృష్ణ, బాలయ్య, కాంచన వంటి ఎంతో మంది నటీనటులతో ‘జనరంజని’ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత 1994లో పదవీ విరమణ చేశారు. సర్వీసులో చివరి అయిదు ఏళ్లు ఎన్నో నాటకాలు ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఆకాశవాణి తరఫున ఆయన ఢిల్లీలో చేసిన ‘మరో మొహెంజొదారో’, ‘సుడిగాలి’ నాటకాలకు అవార్డులు, అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ‘బళ్లారి రాఘవ’ పురస్కారం అందుకున్నారు. నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో. 1949లో నేను మా స్కూల్లో ఓ నాటకం వేశాను. అదీ సంస్కృతంలో. భాష రాకపోయినా స్క్రిప్ట్‌ను బట్టీకొట్టి చేశాను. తర్వాత్తర్వాత రంగస్థల నాటకాలు వేయడం ప్రారంభించాను. అలా మొదలైంది నా నాటక జీవితం. నా సర్వీసులో ఓ రిక్షావాడి నుంచి జమీందారు వరకు అన్ని రకాల పాత్రలూ పోషించాను. శోభన్‌బాబుతో సావాసం గుంటూరులోని ఏసీ కాలేజీలో నేను బీఏలో చేరాను. ఓ ఏడాది కళాశాల యాజమాన్యం నాటకాలు నిర్వహించడానికి ఆసక్తిగల వారిని ఆహ్వానించింది. అప్పుడు నేను, సినీనటుడు ‘శోభన్‌బాబు’ ఆ సెలక్షన్స్‌కు వెళ్లాం. ‘పునర్జన్మ’ నాటకంలో శోభన్‌బాబు హీరోగా, నేను విలన్‌గా నటించాం. తర్వాత స్నేహితులమయ్యాం. రేడియోలోకి... 1957లో నేను ఏసీ కాలేజీలో ఉన్నప్పుడే విజయవాడ స్టేషన్లో ‘ఖైదీ’ అనే లైవ్ నాటకం వేశాను. ఆకాశవాణిలో అడుగుపెట్టక ముందే ఎన్నో రంగస్థల నాటకాల్లో అద్భుతమైన పాత్రలు పోషించాను. కానీ ఉద్యోగం లేకుండా ఇంకెన్నాళ్లు తిరగాలి అనుకొని అప్పుడే హైదరాబాద్ స్టేషన్లో ప్రకటన పడితే అనౌన్సర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూ ప్యానల్లో బాలగురుమూర్తి, స్థానం నరసింహారావు లాంటి దిగ్గజాలున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలతో పాటు నేను ముందు వేసిన నాటకంలోంచి ఓ డైలాగును చెప్పేసరికి నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది. వివిధ స్టేషన్లలో.. ఓ నాలుగేళ్లు హైదరాబాద్‌లో పనిచేసి 1968లో వైజాగ్‌కు వచ్చేశా. అక్కడ చేస్తూనే ఎన్నో వీధి నాటకాలు వేశాను. అప్పట్లో మాకూ సినిమా తారలకున్నంత క్రేజ్ ఉండేది. 1971లో నేను విజయవాడ స్టేషన్‌కు బదిలీ అయ్యాక అక్కడ ఎన్నో రేడియో నాటకాలు చేశాను. పాత్రాభినయం విజయవాడలో ఎన్నో నాటకాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తూనే, చాలా వాటిని ప్రొడ్యూస్ చేశాను. రాముడు మొదలుకొని భీముడు, భీష్ముడు, అర్జునుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణికాలతో పాటు అల్లావుద్దీన్, ఖడ్గతిక్కన, శ్రీ కృష్ణదేవరాయలు పాత్రలు చేశాను. ఎస్.బి.శ్రీరామమూర్తి స్వయంగా ప్రొడ్యూస్ చేసిన ‘చెంఘిజ్‌ఖాన్’ నాటకంలో ముఖ్యపాత్రను నన్ను పోషించమన్నారు. అది నేను రిటైర్ అయ్యాక చేశాను. అలా మరచిపోలేని ఎన్నో నాటకాలు చేశాను. దీనికంతటికీ కారణం తల్లిలాంటి ఆకాశవాణే. ఆదరణ పొందిన సీరియళ్లు రేడియోలో సీరియళ్లను అప్పట్లో శ్రోతలు ఎంతో అభిమానించేవారు. నేను చేసిన ‘మీర్జాన్ పుల్లయ్య’ సీరియల్ దాదాపు 28 ఎపిసోడ్లు నడిచింది. అలాగే ‘సమస్యల మజిలీలు’, ‘ఎవరు బాధ్యులు’ లాంటి సీరియళ్లను శ్రోతలు బాగా ఆదరించారు. నేను చేసిన నాటకాల్లో సన్నివేశాన్ని శ్రోతల కళ్లకు కట్టినట్టు ఉండాలనే జిజ్ఞాసతో విభిన్న ప్రయోగాలు చేశాను. ఉదాహరణకు నాటకంలో భీష్ముడిపాత్రను పోషించిన లింగరాజుశర్మగారిని అంపశయ్య మీద పడుకున్నట్టు తెలియజెప్పడానికి ఆయనను నేల మీద పడుకోబెట్టి డైలాగులు చెప్పించాను. సినిమాల్లోనూ... సినీ నిర్మాత డి.రామానాయుడు, నేనూ ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఆయన చాలా సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. శోభన్‌బాబు నటించిన ‘సోగ్గాడు’తో మొదలు పెట్టి, ‘శుక్రవారం మహాలక్ష్మి’, ‘ఈ చదువులు మాకొద్దు’, ‘విప్లవ శంఖం’, ‘అంగడి బొమ్మ’, హిందీలో జితేందర్‌తో కలిసి ‘దిల్దార్’ సినిమాల్లో నటించాను. ప్రస్తుతం నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నాను. - నిఖితా నెల్లుట్ల, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
నిన్నటి నుంచి సెల్‌టవర్ పైనే ఉన్న సంజీవరావు!
గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో శనివారం పెదకాకానిలోని ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కిన వ్యక్తి ఈ సాయంత్రం వరకు కిందకు దిగలేదు. గుంటూరు సీతానగరంకు చెందిన మామిళ్లపల్లి సంజీవరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని శనివారం ఉదయం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. పోలీసులు అతడిని కిందకు దించేందుకు నిన్న రాత్రితోపాటు ఈ రోజు ఉదయం నుంచి ప్రయత్నించినా ఫలితంలేదు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో మంచినీళ్లతో ఓ నలుగుర్ని పైకి పంపించారు. ఆ నలుగురు పది అడుగుల ఎత్తుకి ఎక్కగానే, అంతకంటే పైకి వస్తే తాను దూకేస్తానని సంజీవరావు బెదిరించాడు. దాంతో పోలీసుల సూచన మేరకు మంచినీళ్లను అతడికి సమీపంలో ఉంచి ఆ నలుగురు కిందకు దిగిపోయారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా సంజీవరావు తన పట్టును వీడలేదు. ఒకవేళ కిందకు దూకితే అతడ్ని కాపాడేందుకు వలలతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ నన్నపునేని రాజకుమారి ఈరోజు సంజీవరావుతో ఫోన్లో మాట్లాడారు. ఎవరు ఏమి చెప్పినా అతను వినడంలేదు. అతను పట్టినపట్టు వీడటంలేదు. అర్బన్ ఎస్పీ త్రిపాఠి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే సంజీవరావు
-
వికారాబాద్‌కు మంజీరా
వికారాబాద్ పట్టణ ప్రజల దాహర్తిని తీర్చేందు కు తక్షణమే మంజీరా జలాలను విడుదల చేయాలని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బిల్లులు చెల్లించలేదని నీటి సరఫరాను నిలిపివేయడం సబబుకాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సర్కారు రక్షిత మంచినీటికి ప్రాధాన్యతనిస్తున్నందున.. పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్లో వికారాబాద్ శాటిటైట్ టౌన్షిప్ పనుల పురోగతిని ప్రజారోగ్య, వాటర్‌బోర్డు, మున్సిపల్ అధికారులతో మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్షించారు. వికారాబాద్‌కు వెంటనే మంజీరా జలాల సరఫరాను ప్రారంభిస్తామని, ఏప్రిల్‌లోపు డిమాండ్‌కు అనుగుణంగా 5.4 ఎంజీడీల నీటిని పంపిణీ చే స్తామని వాటర్‌బోర్డు మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ స్పష్టం చేశారు. పైపులైన్ గుంతలు పూడ్చండి డ్రైనేజీ పనులను వేగిరంచేయాలని, పైపులైన్ల కోసం తవ్విన గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చివేయడమేకాకుండా సీసీ రోడ్డు, అంతర్గత పనులను పూర్తిచేయాలని పురపాలక, ప్రజారోగ్య శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని, అసంపూర్తిగా ఉన్న పనులకు తుదిరూపు ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి నిధుల కొరత లేదని, నిధుల ఇబ్బంది ఉంటే తన దృష్టికి తేవాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు. స్థానిక శాసనసభ్యుడు సంజీవరావు మాట్లాడుతూ శాటిలైట్ టౌన్షిప్ పనులు నత్తనడకన సాగుతుండడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం రెండో దశ నిధుల విడుదలకు కేంద్రం ముం దుకురావడంలేదని పేర్కొన్నారు. నిర్ణీత వ్యవధిలో తొలివిడత పనులు పూర్తి చేసినట్లయితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదికాదన్నారు.మెట్రో వాటర్‌బోర్డు ఎండీ జగదీశ్వర్, జనరల్ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, పురపాలకశాఖ అడిషనల్ డెరైక్టర్ అనురాధ, ప్రజారోగ్య విభాగం చీఫ్ ఇంజినీర్ ఇంతియాజ్ అలీ, ఎస్ఈ యాదగిరి, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జైతారాం, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి పరమేశ్వర్రావు ఉన్నారు. -
పశువుల కాపరిని... పసిపాపల వైద్యుడ్ని అయ్యా....
సర్కారు దవాఖానాల ప్రక్షాళన నరకకూపాలుగా ఉన్న సర్కారు దవాఖానాలను సమూలంగా ప్రక్షాళన చేస్తానని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా మోమిన్ పేట మండల పరిధిలోని మేకవనంపల్లిలో నిర్మించిన మేథడిస్టు చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ అభివృద్ధి చర్యల్లో భాగంగా జిల్లా ఆస్పత్రికి రూ.25 కోట్ల చొప్పున, ఇతర ఆస్పత్రులు ఒక్కోదానికి రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలోని ఆస్పత్రులలో నిద్రిస్తేనే సమస్యలు తెలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి దళిత, గిరిజన పక్షపాతి అన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లతో దళితులు, రూ.25వేల కోట్లతో బీసీలు, రూ.15వేల కోట్లతో గిరిజనులు, రూ.15వేల కోట్లతో మైనార్టీల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేయనున్న పలు పథకాల గురించి వివరించారు. పశువుల కాపరిని... పసిపాపల వైద్యుడ్ని అయ్యా.... పశువుల కాపరియైన తాను పసిపాపల వైద్యుడ్ని అయ్యానని ఆయన చిన్నప్పటి స్మృతులను రాజయ్య గుర్తుచేసుకున్నారు. పట్టుదల, అత్మవిశ్వాసం, క్రమశిక్షణలతో ఎదైనా సాధించవచ్చన్నారు. పొరుగు వారిని నిండు మనసుతో ప్రేమించాలని ఆయన కోరారు. మోమిన్‌పేటలో 30పడకల ఆస్పత్రికి హామీ మోమిన్‌పేట మండల కేంద్రంలో ఉన్న ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నందున రోగులకు వైద్యం పూర్తి స్థాయి లో అందడం లేదని స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపీపీ నిఖితారెడ్డిలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన 30పడకల ఆస్పత్రి మంజూరుకు హామీ ఇచ్చారు. అందుకు రూ.1.20కోట్లు ఆవసరమవుతాయని, వెంటనే మంజూరు చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు చర్చిలో మినీ క్రిస్ట్మస్ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మార్కెటు కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ సభ్యులు భాస్కర్, రాములమ్మ, చర్చి నిర్మాణ కర్త సంజీవరావు,పాస్టరు పద్మాకర్, నాయకులు సంగారెడ్డి, లక్ష్మయ్య, నరేందర్‌రెడ్డి, మహంత్‌స్వామి, లక్ష్మారెడ్డి, చంద్రయ్య, ఆనందం, ప్రతాప్‌రెడ్డి, చెన్న తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మాజీ మంత్రి సంజీవరావు మృతి
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తండ్రి, కేంద్ర మాజీ మంత్రి శ్రీరామ సంజీవరావు బుధవారం మరణించారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో ఆయన కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. కాకినాడ నియోజకవర్గం నుంచి మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎం పళ్లంరాజు కూడా కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం విదితమే. పళ్లంరాజు కూడా కాకినాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. -
మళ్లీ వస్తా.. పనులు చూస్తా..
మోమిన్‌పేట: ఇంటింటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలి.. దీనికోసం ఎంత డబ్బు అవసరమవుతుందో చెప్పండి.. నిధులు విడుదల చేస్తాం.. కానీ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) ఏఈని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రశ్నించారు. నెలరోజుల్లో పూర్తి చేస్తామని ఏఈ సమాధానమివ్వడంతో.. మళ్లీ వస్తానని.. పనులను చూస్తానని కలెక్టర్ అన్నారు. సోమవారం మండలంలోని వెల్చాల్ గ్రామంలో నిర్వహించిన ‘మన ఊరు- మన గ్రామం’ గ్రామసభలో అధికారులతో శాఖలవారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటి కీ కుళాయి ద్వారా తాగునీటిని అందించేందుకు అదనంగా రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. చెత్తను సేకరించి గ్రామం బయట వేసేందుకు డంపింగ్‌యార్డును గుర్తించాలని తహసీల్దార్ రవీందర్‌ను ఆయన ఆదేశించారు. ప్రతీ కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రభుత్వం అందుకు తగిన నిధులు ఇస్తుందన్నారు. ఉన్నత పాఠశాలకు ఐదు అదనపు తరగతి గదుల కోసం స్థలం, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రాధానోపాధ్యాయుడు ప్రభు కోరగా... మౌలిక వసతులు కల్పిస్తాం.. కానీ 10వ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. నిరుద్యోగ యువకులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణనిప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐకేపీ ఏపీఎం రాజును కలెక్టర్ ఆదేశించారు. మహిళా సంఘాలు బ్యాంకులో తీసుకొంటున్న రుణాలతో యూనిట్లు పెట్టుకొవాలని ఆయన సూచించారు. గ్రామంలోని గర్భిణులు ఆస్పత్రుల్లోనే కాన్పులు చేసుకునేలా ఏఎన్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపీపీ నిఖిత, వైస్ ఎంపీపీ అమరేందర్‌రెడ్డి, సబ్ కలెక్టరు ఆమ్రపాలి, మండల ప్రత్యేకాధికారి రమణారెడ్డి, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు బిపాషా, ఎంపీడీఓ కె.సువిధ, వ్యసాయాధికారి నీరజ, డిప్యూటీ తహసీల్దార్ దీపక్, ఏపీఓ అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లయ్య, మాజీ సర్పంచులు విఠల్, ఇబ్రహీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పోలవరం బిల్లు’ అనైతికం
వికారాబాద్‌రూరల్: భద్రాచలం ప్రాంతంలోని ఏడు మండలాల్లో ఉన్న గిరిజనుల ఖనిజ సంపదను దోచుకునేందుకు ఆంధ్ర సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కలిసి కుట్ర పన్నుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు అన్నారు. పోలవరం బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ శనివారం టీజేఏసీ పిలుపు మేరకు వికారాబాద్‌లో బంద్ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా టీజేఏసీ, టీఆర్ఎస్ నాయకులు, సీపీఎం నాయకులు ర్యాలీ నిర్వహించారు. దుకాణాలను మూయించివేశారు. బీజేఆర్ చౌరస్తాలో టైర్లను తగులబెట్టారు. అనంతరం అతిథి గృహంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెండు లక్షల మంది గిరిజనులకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలా ఆర్డినెన్స తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఒక రాష్ట్రం లోని కొన్ని గ్రామాలను మరో రాష్ట్రలో కలపడం ఎంతవరకు సమంజసమని, ఇది దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. కేంద్రం ఈ విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాంచంద్రారెడ్డి, శుభప్రద్‌పటేల్, కృష్ణయ్య, ఎల్లారెడ్డి, టీజేఏసీ నాయకులు శ్రీనివాస్, కల్కోడ నర్సింలు, సీపీఎం నాయకులు మల్లేశం, మహిపాల్, అమరేశ్వర్, నాయకులు విజయ్‌కుమార్, ఎర్రవల్లి అబ్దుల్ సత్తార్, కొత్తగడి అశోక్‌రెడ్డి, యాదగిరియాదవ్, సురేష్, శంకర్, శ్రీకాంత్, చంద్రకాంత్‌రెడ్డి, పాండుముదిరాజ్, కిష్టారెడ్డి, గోపాల్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. బిల్లును వెనక్కి తీసుకోవాలి పరిగి: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రం తెచ్చిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి అన్నారు. బిల్లును నిరసిస్తూ శనివారం పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ సర్కార్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంద ని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు మోడీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వార్ల రవీంద్ర, ఆనంద్‌గౌడ్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఆంజనేయులు, షాహెద్, నయీమొద్దీన్, సమద్, గాంగ్యా తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంటిపై ఏసీబీ దాడులు
* రూ.2 కోట్ల విలువైన అరకిలో బంగారం, * 52 ప్లాట్ల డాక్యుమెంట్లు స్వాధీనం నిజామాబాద్; న్యూస్‌లైన్: నిజామాబాద్ ట్రాన్స్‌కో ఈఆర్వో ఆఫీసులో జూనియర్ అకౌంటెంట్ పడాల సత్తయ్య ఇంటిపై 15మంది ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేసి రెండు కోట్ల ఆస్తులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు కథనం ప్రకారం.. ద్వారకానగర్‌కాలనీవాసి సత్తయ్య పై అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటలకే సత్తయ్య ఇంటికి చేరుకున్న అధికారులు సాయంత్రం 5 గంటల వరకు సోదాలు జరిపారు. 52 ప్లాట్ల డాక్యుమెంట్లు, రూ.25 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, అరకిలో బంగారం, రూ.87 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సత్తయ్యకు రూ. 5 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 12 బ్యాంకు అకౌంట్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు బైకులున్నాయి. పలు రియల్ఎస్టేట్ వెంచర్లలో భాగస్వామికూడా. సత్తయ్యను అరెస్టు చేశామని, నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుస్తామని డీస్పీ తెలిపారు. -
మద్యం విక్రయిస్తున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరెస్టు
చింతపల్లి, న్యూస్‌లైన్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థితో పా టు నల్లబెల్లం వ్యాపారిని పోలీసులు గురువా రం అరెస్టు చేశారు. వారి నుంచి మద్యం బాటిళ్లు, సారా తయారీకి వినియోగించే బెల్లా న్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ ప్రసాద్ తెలిపారు. చింతపల్లి మండలం తాజంగికి చెందిన రుబ్బా సంజీవరావు కొద్దిరోజులుగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో సంజీవరావు ఇంటిని సోదా చేయగా సుమారు రూ.20వేల విలువైన 158 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. సంజీవరావు తాజంగి ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. లోతుగెడ్డ జంక్షన్‌కు చెందిన షేక్ అక్బరుద్దీన్ కిరాణా దుకాణంలో తనిఖీలు చేయగా రూ.5,800 విలువైన 250 కిలోల బెల్లం దొరికిందని, వారిద్దరిని అరెస్టు చేశామని సీఐ చెప్పారు. -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో జేఎల్ఎం
సిద్దిపేట/అర్బన్/మున్సిపాలిటీ,న్యూస్‌లైన్ : అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు కట్టినప్పటికీ లంచం ఇవ్వనిదే పనికాదని భీష్మించిన ఓ ట్రాన్స్‌కో జేఎల్ఎం (జూనియర్ లైన్‌మన్) గురువారం నంగునూరులోని ఓ హోటల్లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మెదక్, నిజామాబాద్ జిల్లాల ఏసీబీ డీఎస్పీ సంజీవరావు సిద్దిపేటలోని ఏపీసీపీడీసీఎల్ డీఈ ఆఫీసులో విలేకరులకు వెల్లడించారు. నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన యువరైతు కోల్పుల ఆంజనేయులు ప్రస్తుతం ఓ మోటారుతో పంటలను సాగు చేస్తున్నాడు. అయితే మరో బోరుకు మోటారు కావాల్సి ఉండడంతో 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని స్థానిక ఇన్చార్జ్ జేఎల్ఎం (జూనియర్ లైన్‌మన్) రెడ్డిమల్ల శంకర్ ను కలిసి విన్నవించాడు. అందుకు డిపార్టుమెంటుకు రూ.5,450 చొప్పున మూడు డీడీలను అప్పగించారు. అయితే ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని శంకర్ డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బతిమాలగా.. రూ.13 వేలకు శంకర్ బేరం కుదుర్చుకున్నాడు. దీంతో ఉన్న రెండు పాడి గేదెలను రూ.14,500లకు విక్రయించి డబ్బును సిద్ధం చేసుకున్నాడు. అయితే సహచరుల సలహా మేరకు రైతు ఆంజనేయులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఏసీబీ డీఎస్పీ సంజీవరావు బృందం నంగునూరులోని ఓ హోటల్లో కస్టమర్లుగా మాటేసింది. అక్కడికి వచ్చిన జేఎల్ఎం శంకర్.. రైతు ఆంజనేయులు నుంచి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత సిద్దిపేటలోని డీఈ ఆఫీసుకు తీసుకువచ్చి ఇక్కడ కూడా తనిఖీలు చేశారు. నిందితుడిని హైదరాబాద్ ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరుస్తామని డీఎస్పీ సంజీవరావును తెలియజేశారు. ఏసీబీ డీఎస్పీ వెంట సీఐలు, శ్రీనివాస్‌రెడ్డి, రఘునాథ్‌లున్నారు. -
కేసీఆర్‌ను ఫోన్లో బెదిరించిన విద్యార్థి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావును హతమారుస్తామంటూ ఈ నెల 6న ఫోన్ ద్వారా హెచ్చరించిన యువకుడ్ని ఇక్కడి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెంగళూరులో తన పెద్దమ్మ వద్ద ఉంటూ ఇంటర్ చదువుతున్న యువకుని(మైనర్) స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి పట్టణం. ఈ నెల 6న తన మొబైల్ నుంచి కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవరావుకు ఫోన్‌చేసి కేసీఆర్‌ను హత్య చేస్తామని బెదిరించాడు. కేసీఆర్‌ను చంపుతామంటూ ఈ నెల 12న లేఖ కూడా రాశాడు. దీనిపై విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు ఫోన్‌నంబర్ ఆధారంగా యువకుడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఆవేశంలోనే కేసీఆర్‌కు లేఖ రాశాడు కావలి, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యత కోసం ఆవేశపడే తమ కుమారుడు కేసీఆర్‌కు బెదిరింపు లేఖ పంపాడని, దీంతో కష్టాలు ఎదుర్కోవలసి వస్తోందని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడైన తమ కుమారుడు అలా ప్రవర్తించడం.. పోలీసులు అరెస్టు చేయడంతో వారు కుంగిపోతున్నారు. ఉద్యమంలో పోరాడుతున్న వారు బాసటగా నిలిచి తమ కుమారుడిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయపడాలని కోరుతున్నారు.