అందోలులో మాట్లాడుతున్న సంజీవరావు
జోగిపేట(అందోల్): వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తెలంగాణలోని 31 జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టి , వైఎస్సార్ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావు అన్నారు. బస్సుయాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందోలు గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్, మే నెలలో బస్సుయాత్రను నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ యాత్రను చేపడుతున్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈయాత్ర జరుగనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, వాటిని కూడా ప్రజల ముందు ఉంచుతామన్నారు. విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలలో నిర్లక్ష్యం చేసిందన్నారు.
దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమిని అందించడం లేదన్న విషయాన్ని తెలంగాణ వ్యాప్తంగా తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అందోలు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, పరిపూర్ణ, రాజు, ప్రవీణ్‌కుమార్, వినోద్, టీ.నరేష్, పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రాకేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment