
వైఎస్సార్ సీపీ ఏపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలజాచరణ్‌రెడ్డి
గజ్వేల్ : ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుందని వైఎస్సార్ సీపీ ఏపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలజాచరణ్‌రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్‌కు వచ్చిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నాయకత్వానికి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. సోషల్ మీడియాలో నిర్వహించిన అనేక సర్వేల్లో జగన్‌కు అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు వచ్చిందన్నారు. ఇటీవల నిర్వహించిన మహా నాడులో చంద్రబాబుతో పాటు ఆయన టీమ్ కు జగన్ భయం పట్టుకుందనే విషయం బ యటపడిందన్నారు. వారి వింత చేష్టలే ఇం దుకు నిదర్శనమన్నారు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్న చంద్రబాబు వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజల మద్దతుతో చంద్రబాబు విధానాలను ఎక్కడికక్కడా ఎండగడతామన్నారు