
ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న దర్యాప్తు బృందం
సాక్షి, బంట్వారం: శిక్షణ విమానం కూలిన ఘటనపై అధికారులు విచారణ జరిపారు. సోమవారం ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ దర్యాప్తు బృందం అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సుల్తాన్‌పూర్ శివారులో ఆదివారం శిక్షణ విమానం కూలిపోవడంతో పైలెట్ ప్రకాష్‌విశాల్, కోపైలెట్ అమన్‌ప్రీతికౌర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ దర్యాప్తు బృందం అధికారులు సోమవారం ఢిల్లీ నుంచి వచ్చారు. స్థానిక అడిషనల్ ఎస్పీ భాస్కర్‌రావు, ధారూరు సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ వెంటకటేశ్వర్లుతో కలిసి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాద స్థలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని అణువణువు గాలించారు. విమాన శకలాలతో పాటు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 4 గంటల పాటు దర్యాప్తు చేసి సమగ్ర నివేదికతో తిరిగి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment