
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షల విధానంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఇంటర్నల్ మార్కులు 20, వార్షిక పరీక్షల మార్కులు 80గా ఉండగా.. ఇకపై 100 మార్కులకు (ఒక్కో పేపర్‌కు) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇకపై ఇంటర్నల్ మార్కులను తీసివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం 2024-25 విద్యాసంవత్సరం నుంచి అమలు కానున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
ఇప్పటి వరకు అమలు చేస్తున్న ఇంటర్నల్ మార్కులను ఎత్తేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై విద్యార్థులకు 24 పేజీల బుక్ లెట్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment