
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది ఫిజికల్ సైన్స్, బయాలజీ రెండు సబ్జెక్టులకు వేరు వేరుగా పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు సబ్జెక్ట్‌లకు ఉదయం 9.30 నుంచి ఉదయం 11.30 వరకు మాత్రమే పరీక్ష నిర్వహించననున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 8 వేల 385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతరత్రా పేపర్లకు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్ధుల హాల్ టికెట్స్ పాఠశాలలకు చేరుకున్నాయి. bse.Telangana.gov.in లో కూడా హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
చదవండి: రేవంత్ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్