ssc exam
-
తండ్రి మరణాన్ని దిగమింగుకుని..
ఖమ్మం: అనారోగ్యంతో తండ్రి మరణించగా, అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే.. ఆ బాధను దిగమింగుకుని ఎస్సెస్సీ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని అవని వెంచర్లో నివాసముంటున్న వై.ముత్యాలరావు అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందగా ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ముత్యాలరావు ఏకై క కుమారుడు, ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎస్సెస్సీ చదువుతున్న మౌళిరాజ్ తలకొరివి పెట్టాడు. అయితే, సోమవారం నుంచి పదో తరగతి వార్షిక ప్రారంభం కావడంతో బంధువులు, కుటుంబీకుల సూచన మేరకు ఆయన దుఃఃఖాన్ని భరిస్తూనే సత్తుపల్లిలోని ఎన్టీఆర్నగర్లోని పరీక్షా కేంద్రానికి హాజరై తెలుగు పరీక్ష రాశాడు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, స్నేహితులు సైతం ఆయనకు మనోధైర్యాన్నిచ్చారు. ఇవి చదవండి: 13 ఏళ్లుగా '108 అంబులెన్స్' రూపంలో.. వెంటాడిన మృత్యువు! -
ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 30వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు సబ్జెక్ట్‌లకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరపనున్నారు. రేపు ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, 19న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 22న లెక్కలు, 23న ఫిజికల్ సైన్స్, 26 న బయాలజీ, 27న సోషల్ స్టడీస్.. 28,30 తేదీలో వొకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. సమస్యాత్మకమైన 130 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టెన్త్ పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్ధులు 6,23,092.. గత ఏడాది ఫెయిలై రీ ఎన్రోల్ అయిన విద్యార్ధులు 1,02,528. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8.45 గంటల నుంచి పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్ధులకు అనుమతి ఉంటుంది. టెక్నాలజీ సాయంతో లీకేజ్‌కి చెక్ పెట్టేవిధంగా.. ప్రతీ ప్రశ్నా పత్రానికి ప్రత్యేకంగా యూనిక్ కోడ్ నంబర్ కేటాయించారు. యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. హాల్ టిక్కెట్లు చూపితే పదవ తరగతి విద్యార్ధులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. రాష్ట్ర స్ధాయిలో 0866-2974540 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాలో కలెక్టర్లు, డిఇఓల పర్యవేక్షణలో జిల్లా స్ధాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షల పర్యవేక్షణకు ప్రతీ జిల్లాకి ఒక పరిశీలకుడిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 682 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకి 3473 చీఫ్ సూపరింటెండెంట్లు, 3473 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 35119 మంది ఇన్విజలేటర్లను నియమించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో పతీక్షా కేంద్రాల వద్ద తాగు నీరు, టెంట్లు ఏర్పాట్లు చేశారు. 31 నుంచి టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ జరపనున్నారు. -
తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది ఫిజికల్ సైన్స్, బయాలజీ రెండు సబ్జెక్టులకు వేరు వేరుగా పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు సబ్జెక్ట్‌లకు ఉదయం 9.30 నుంచి ఉదయం 11.30 వరకు మాత్రమే పరీక్ష నిర్వహించననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 8 వేల 385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతరత్రా పేపర్లకు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్ధుల హాల్ టికెట్స్ పాఠశాలలకు చేరుకున్నాయి. bse.Telangana.gov.in లో కూడా హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: రేవంత్ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్ -
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు ఫిబ్రవరి 5
సాక్షి, హైదరాబాద్: మార్చిలో నిర్వహించే పదోతర గతి (ఎస్ఎస్సీ) పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపునకు తత్కాల్ స్కీంలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువు విధించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును రూ.1,000 ఆలస్య రుసుముతో చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత గడువు పొడిగించేది లేదని పేర్కొ న్నారు. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజర య్యేవారే ఆ తరువాత జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. కావున ఒకసారి ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఫీజు మొత్తాన్ని ఫిబ్రవరి 6లోగా ట్రెజరీలో జమచేయాలని, అదేరోజు నామినల్ రోల్స్‌ను కూడా డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు. -
AP: గుడ్‌న్యూస్.. టెన్త్ పరీక్షల సిబ్బందికి రెమ్యునరేషన్ ఎంత పెరిగిందంటే?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం ఉత్తర్వులు (జీవో 37) విడుదల చేశారు. పరీక్షల నిర్వహణతో పాటు స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం)లో పాల్గొనే వారందరి రెమ్యునరేషన్‌ను ప్రభుత్వం పెంచింది. ఎమ్మెల్సీ, వరీక్షల డైరెక్టర్ హర్షం ఉత్తర్వులు ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ టి.కల్పలత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ డైరెక్టరేట్ తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు. 2016 తరువాత రెమ్యునరేషన్ ఇప్పుడే పెరిగిందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వైఎస్సార్‌టీఎఫ్ నేత జాలిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో.. -
హనుమకొండ: డిబార్ అయిన టెన్త్ విద్యార్ధి పరీక్షకు హాజరు
-
టెన్త్ పేపర్ లీకేజ్ కేసు: మాజీ మంత్రి నారాయణకు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో టీడీపీ నేత నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈకేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సెషన్స్ కోర్టులో కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ రద్దుపై సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. నారాయణకు అరెస్టు నుంచి వారం పాటు తాత్కాలిక రక్షణ కల్పించింది. నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదించారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేశానని కోర్టుకు వెల్లడించారు. ర్యాంకుల కోసం పేపర్ లీకేజీ చేస్తున్నారని నారాయణ విద్యాసంస్థలపై ఆరోపణలున్నాయి. తమకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చాయని పబ్లిసిటీ చేస్తూ విద్యా వ్యాపారం చేస్తున్నాయి. మొదటి నుంచి వివాదాలు కాగా, నారాయణ విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట. ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై గత ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి. -
పెండింగ్ ఫీజులు.. కడితేనే పరీక్షకు..
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ట్యూషన్, రవాణా, ఇతర ఫీజులు చెల్లిస్తే తప్ప పరీక్ష ఫీజు కట్టించుకోమని తేల్చిచెబుతున్నాయి. ఈ నెల 15కల్లా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. కొన్ని పాఠశాలలు కోవిడ్ కాలంలో పెండింగ్‌లో ఉన్న ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ట్యూషన్ ఫీజు సగం చెల్లించిన వారికీ తిప్పలు తప్పడం లేదు. టెన్త్ పరీక్షల తర్వాత విద్యార్థులు పాఠశాలను విడిచి వెళ్తారని, అప్పుడు వసూలు చేయడం కష్టమని యాజమాన్యాలు భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఫలానా తేదీకల్లా మొత్తం ఫీజు చెల్లిస్తామని స్థానిక పెద్దల సమక్షంలో కొన్ని స్కూళ్లు హామీ పత్రాలు రాయించుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ వెసులుబాటు ఇచ్చేందుకు బడులు సుముఖంగా లేవు. వచ్చే మార్చిలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య 5 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో 3 లక్షల మంది ప్రైవేటు బడుల విద్యార్థులు ఉన్నారు. సర్కారీ బడుల్లోనూ... ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించడం కూడా కష్టంగా ఉంటోంది. వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాల్లో ప్రభుత్వమే ఈ ఫీజు చెల్లిస్తుంది. కానీ కొన్ని మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలు పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం విద్యార్థులు చెల్లించాల్సి వస్తోంది. అయితే, వాస్తవ ఫీజుకు అదనంగా రూ.75 అధికంగా వసూలు చేస్తున్నారని కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫిర్యాదులొచ్చాయి. పరీక్షలకు సంబంధించి జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో అదనంగా వసూలు చేయాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిర్ణీత ఫీజు కన్నా ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇటీవల జిల్లా అధికారులను హెచ్చరించారు. నిబంధనలు గాలికి.. వాస్తవానికి టెన్త్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125. దీన్ని బ్యాంకు చలాన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. అయితే, ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఫీజు తమకే చెల్లించాలని పట్టుబడుతున్నాయి. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన ఫీజు కాకుండా రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. తాము బోర్డుకు చెల్లించే సమయంలో అనేక ఖర్చులుంటాయని యాజమాన్యాలు కుంటిసాకులు చెబుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపునకు అయ్యే ఖర్చు కూడా ఇందులోనే ఉంటుందని బుకాయిస్తున్నారు. పరీక్ష ఫీజుకు మాత్రం ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ క్రమంలో పెండింగ్ ఫీజుల విషయంలోనూ యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల నుంచి డొనేషన్లు, ట్యూషన్ ఫీజుల రూపంలో స్కూల్‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. పాఠశాల ప్రారంభంలో సగం ఫీజు వసూలు చేసిన యాజమాన్యాలు ఇప్పుడు మిగతా సగం కోసం ఒత్తిడి చేస్తున్నాయి. -
‘టెన్త్’ కొత్త కేంద్రాలపై మెసేజ్‌లు
సాక్షి, హైదరాబాద్ : కరోనా జాగ్రత్తల్లో భాగంగా పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కొత్త పరీక్ష కేంద్రాల సమాచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభా గం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు. సెల్ఫోన్లు లేని, ఫోన్ల ద్వారా సమాచారం అందని వారి కోసం పాత పరీక్ష కేంద్రాల వద్ద సహాయకులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, విద్యార్థుల కోసం చేపడుతున్న చర్యలపై సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన వెల్లడించిన వివిధ అంశాలు... విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు పరీక్షల ముందు రోజు విద్యార్థులు, తల్లి దండ్రులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్లి వివరాలను చూసుకుంటే పరీక్ష ప్రారంభం రోజున ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పాత కేంద్రాల్లో ఏ హాల్‌టికెట్ నంబర్ నుంచి ఏ హాల్‌టికెట్ నంబర్ వారికి సెంటర్ ఉంది.. మిగతా వారికి సమీపంలోని ఏ భవనంలో అదనంగా కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేశామన్న వివరాలు తెలుసుకోవచ్చు. జూన్ 7నే ఆ వివరాలను పాత కేంద్రాల వద్ద నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచుతాం. గంట ముందే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తాం కాబట్టి విద్యార్థులు అదే రోజు వెళ్లినా సమీపంలోని (కిలోమీటర్ పరిధిలోపే) కొత్త కేంద్రం వివరాలు పొందవచ్చు. ఆ వివరాలను తెలియజేసేందుకు సహాయకులను నియమిస్తాం. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రానికి వెళ్లే క్రమంలో మొదటిరోజు కొద్దిగా ఆలస్యమైనా అనుమతిస్తాం. విద్యార్థుల ప్రత్యక్ష తనిఖీ (ఫ్రిస్కింగ్) ఉండదు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్క్‌లు అందజేస్తాం. విద్యార్థులూ వాటిని తెచ్చుకోవచ్చు. మంచినీళ్ల బాటిళ్లను కూడా అనుమతిస్తాం. పరీక్ష కేంద్రాలన్నింటినీ కెమికల్‌తో శానిటైజ్ చేస్తాం. పక్కాగా జాగ్రత్తలు.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే 5,34,903 మంది విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు పక్కా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించేలా ఒక బెంచీపై ఒకరే కూర్చొని పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను పెంచాం. పాత కేంద్రాలు 2,530 ఉండగా మరో 2,005 కేంద్రాలను గుర్తించాం. అవసరమైతే ఇంకా కేంద్రాలను పెంచాలని డీఈవోలను ఆదేశించాం. స్కూళ్లల్లోని అదనపు గదులను వినియోగించుకోవడంతోపాటు కాలేజీల భవనాలు, ఫంక్షన్ హాళ్లు, ఆడిటోరియాలను తీసుకొని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. భౌతికదూరం పాటించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి 20 స్కూళ్లకు కలిపి ఒక జోన్‌గా చేశాం. అందులో నాలుగు సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయా జోన్లలో వాటికి సమీపంలోని (కిలోమీటర్ లోపే) భవనాల్లోనే అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కంటైన్మెంట్ జోన్లలో ఎక్కువ మంది ఉంటే ప్రత్యేక కేంద్రం.. ప్రస్తుతం రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు తక్కువే ఉన్నాయి. హోం క్వారంటైన్లో సంబంధిత ఇళ్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. జూన్ ఒకటో తేదీ వరకు చూస్తాం. ఆలోగా హోం క్వారంటైన్లో ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోని పిల్లలు ఎవరైనా ఉన్నారా? కంటైన్మెంట్ జోన్లలో విద్యార్థులు ఎంత మంది ఉంటారన్న లెక్కలు తీస్తున్నాం. కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చే విద్యార్థులు తక్కువ మంది ఉంటే వారికి ప్రత్యేక గదులను కేటాయించి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తాం. ఒకవేళ కంటైన్మెంట్ జోన్లలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అక్కడే ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలకు వచ్చే వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఉంటే వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తాం. -
స్వయంగా పరీక్ష రాసిన వీణావాణీలు
వెంగళరావునగర్: విధి పరీక్షను చిర్నవ్వుతో ఎదుర్కొంటూనే పాఠాలు నేర్చుకున్న అవిభక్త కవలలైన వీణావాణీలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన టెన్త్ పరీక్షలకు హాజరై తమ ఆత్మస్థైర్యాన్ని చాటి తమలాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చారు. స్టేట్‌హోంలోని బాలసదన్ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న ప్రతిభా హైస్కూల్లోని పరీక్షా కేంద్రానికి ఉదయం 8.45 గంటలకు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వీరిని తీసుకొచ్చారు. బాలసదన్ ఇన్చార్జి సఫియా బేగంతో పాటు మరో సహాయకురాలు వీరితో పాటు వెంటవచ్చారు. పరీక్ష రాసేందుకు వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం స్క్రైబర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వారిద్వారా పరీక్ష రాసేందుకు వీణావాణీలు తిరస్కరించారు. దీంతో వీణావాణీలు స్వయంగానే తెలుగు పరీక్షను రాశారు. నంబర్లు కన్పించక కొద్దిసేపు అయోమయం కాగా, పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేసిన గదులు, విద్యార్థుల హాల్‌టికెట్ల నంబర్లతో అంటించిన నోటీసు బోర్డులో వీణావాణీల హాల్ టికెట్ నంబర్లు లేకపోవడంతో కొద్దిసేపు అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రతిభా హైస్కూల్లో 11 గదులను (2022188183 నుంచి 2022188402 వరకు) ఏర్పాటు చేశారు. అయితే వీణావాణీల నంబర్ మాత్రం 2022188403/404గా ఉన్నాయి. వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో నోటీసుబోర్డులో అంటించలేదని స్కూల్ నిర్వాహకులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
మార్చి 19 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 2020, మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్ ఖరారుచేసి ప్రకటించిం ది. ఎస్ఎస్సీ రెగ్యులర్, ప్రైవేటు, ఒకేషనల్, ఓఎస్ఎస్సీ విద్యార్థులకు ఈ టైం టేబుల్ వర్తిస్తుందని తెలిపింది. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:15 గంట ల వరకు కొనసాగుతాయని పే ర్కొంది. ద్వితీయ భాష పరీక్ష, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, పేపరు–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంట ల వరకు ఉంటాయని వెల్లడించిం ది. అలాగే కాంపోజిట్ కోర్సు ప్ర థమ భాష పేపర్–2 పరీక్ష 10:45 గంటల వరకు, ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష 11:30 గంటల వరకు కొనసాగుతాయని వివరించింది. విద్యార్థులకు పరీక్షలో ఆఖరి అరగంట ముందు ఆబ్జెక్టివ్ పేపర్‌ను ఇస్తారని చెప్పింది. -
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షల షెడ్యూల్ మార్చి 23 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 మార్చి 24 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 మార్చి 26 : సెంకండ్ లాంగ్వేజ్ మార్చి 27 : ఇంగ్లీష్ పేపర్ 1 మార్చి 28 : ఇంగ్లీష్ పేపర్ 2 మార్చి 30 : గణితం పేపర్ 1 మార్చి 31 : గణితం పేపర్ 2 ఏప్రిల్ 01 : సైన్స్ పేపర్ 1 ఏప్రిల్ 03 : జనరల్ సైన్స్ పేపర్ 2 ఏప్రిల్ 04 : సోషల్ స్టడీస్ పేపర్ 1 ఏప్రిల్ 06 : సోషల్ స్టడీస్ పేపర్ 2 ఏప్రిల్ 07 : సంస్కృతం, అరబిక్, పెర్షియన్ సబ్జెక్ట్ ఏప్రిల్ 8 : ఒకేషనల్ పరీక్షలు -
ఎంత పరీక్ష పెట్టావు తల్లీ...
సాక్షి, పెనగలూరు: పెనగలూరు మండలం కొం డూరు పంచాయతీ ఉప్పరపల్లెకు చెందిన ఓర్సు పెంచలమ్మ, తండ్రి రమణయ్య దంపతులకు ఏకైక కుమార్తె కావేరి. ఒకే కుమార్తె కావడంతో తల్లి దండ్రులు అపురూపంగా పెంచారు. ఎంతగానంటే కుమార్తె పరీక్షకు వెళుతున్నా వదిలి పెట్టలేనంతగా. పరీక్షల నేపథ్యంలో పెనగలూరు మోడల్‌స్కూల్‌కు ప్రతిరోజూ వచ్చి పరీక్షరాసి వెళుతోంది. ఏకైక కుమార్తె కావడంతో తల్లి తోడుగా వచ్చేది. రోజూ లాగానే కావేరి బుధవారం కూడా పరీక్షకు ఇంటినుంచి బయలుదేరింది. నీవు వచ్చేంతవరకు ఎదురు చూస్తుం టానమ్మా అని చెప్పి బడిబయట ఓ చెట్టుకింద కూర్చుంది. పరీక్షరాస్తున్న సమయంలో తల్లి అనంతలోకా లకు వెళ్లిపోయింది. చెట్టుకింద కూర్చున్న పెంచలమ్మకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పోలీసులు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షరాసి అనంతరం బయటకు వచ్చిన కావేరి విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. -
మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ లాంగ్వేజి కాంపోజిట్ కోర్సు పేపర్–1 పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, పేపర్–2 పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 వరకు జరగనుంది. ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం ప్రకటన విడుదల చేసింది. -
ఎస్ఎస్సీ పరీక్షలో హైటెక్ మోసం: నలుగురి అరెస్టు
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారాన్ని మరవకముందే మరో షాకింగ్ వ్యవహారం బయటపడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్టాఫ్ట్ సెలక్షన్ కమీషన్(ఎస్ఎస్సీ) పరీక్షలో హైటెక్ మోసానికి సంబంధించిన వ్యవహారం వెలుగుచూసింది. పక్కా ప్రణాళికతో మోసానికి పాల్పడుతున్న హైటెక్ రాకెట్ ముఠాకు చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 50లక్షల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజయ్(30), సోను(31), గౌరవ్(24), పరంజీత్(24) అనే నలుగురు ఆన్లైన్ పరీక్ష తప్పకుండా పాస్ చేయిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి రూ. 5 - 10లక్షల వరకూ సొమ్మును వసూలు చేసినట్లు చెప్పారు. టీమ్ వ్యూయర్ అనే సాఫ్ట్వేర్ సాయంతో ఈ నలుగురు ఎస్ఎస్సీ వారు నిర్వహిస్తున్న సీహెచ్ఎస్ఎల్ టైర్-1 పరీక్షలో మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారానికి సూత్రధారి ఢిల్లీ సేల్స్ టాక్స్ డిపార్టమెంట్లో పనిచేస్తున్న హర్పాల్గా పోలీసులు గుర్తించారు. హర్పాల్కు ఈ ముఠాతో సంబంధం ఉందని మీర్పుత్ పోలీసులకు సమాచారం అందడంతో వారు ఉత్తర ఢిల్లీ డిస్ట్రిక్ట్ పోలీసులతో కలిసి హర్పాల్ ఇంటిమీద దాడిచేశారు. ఇంత కాలం మాన్యువల్‌గా నిర్వహించిన ఈ పరీక్షలో అవకతవకలకు అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో గత కొంతకాలం నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. -
ఎస్ఎస్సీ స్కామ్ : కేంద్రం వివరణ కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రశ్నాపత్రాల లీక్ కుంభకోణంపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని వివరణ కోరింది.ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల స్కామ్‌పై సమాధానం ఇవ్వాలని ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. ఫిబ్రవరి 21న నిర్వహించిన పరీక్షలు సాంకేతిక కారణాలతో మార్చి 9న తిరిగి నిర్వహిస్తామని ఎస్ఎస్సీ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్ఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజిపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో భారీ నిరసనలు చేపట్టింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధుల ఆందోళనలకు తలొగ్గిన కేంద్రం ఈ అంశంపై సీబీఐ విచారణకు ఈనెల 5న కేంద్రం అంగీకరించింది. -
‘ఎస్ఎస్సీ స్కామ్‌పై విచారణకు డిమాండ్’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించిన పరీక్షలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సీబీఐచే విచారణ జరిపించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఎస్ఎస్సీ ఎగ్జామ్ కుంభకోణంపై సీబీఐ విచారణను పలువురు అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారని..ఇది వారి భవిష్యత్‌కు సంబంధించిన అంశమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఉద్యోగార్థుల డిమాండ్‌కు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం ట్వీట్ చేశారు. కాగా, ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్ఎస్సీ ఎగ్జామ్‌లో ప్రశ్నాపత్రం ముందుగానే లీకైందని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలతో వారు సెలక్షన్ కమిటీ సభ్యులను కలిసి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
11వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫీజు గడువు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుంచి నిర్వహించే ఇంటర్మీడియెట్, ఎస్సెస్సీ పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు ఇప్పటివరకు ఫీజు చెల్లించకపోతే.. వారు తత్కాల్ కింద ఈనెల 11వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 10న తుది గడువు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ పొందేందుకు రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులు ఈనెల 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీ ఆర్థిక కార్పొరేషన్ వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.