ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన పరీక్షలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సీబీఐచే విచారణ జరిపించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ కుంభకోణంపై సీబీఐ విచారణను పలువురు అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారని..ఇది వారి భవిష్యత్‌కు సంబంధించిన అంశమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఉద్యోగార్థుల డిమాండ్‌కు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం ట్వీట్ చేశారు. కాగా, ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్‌లో ప్రశ్నాపత్రం ముందుగానే లీకైందని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలతో వారు సెలక్షన్ కమిటీ సభ్యులను కలిసి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment