
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం ఉత్తర్వులు (జీవో 37) విడుదల చేశారు. పరీక్షల నిర్వహణతో పాటు స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం)లో పాల్గొనే వారందరి రెమ్యునరేషన్‌ను ప్రభుత్వం పెంచింది.
ఎమ్మెల్సీ, వరీక్షల డైరెక్టర్ హర్షం
ఉత్తర్వులు ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ టి.కల్పలత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ డైరెక్టరేట్ తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు.
2016 తరువాత రెమ్యునరేషన్ ఇప్పుడే పెరిగిందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వైఎస్సార్‌టీఎఫ్ నేత జాలిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో..
Comments
Please login to add a commentAdd a comment