
సాక్షి, హైదరాబాద్: మార్చిలో నిర్వహించే పదోతర గతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపునకు తత్కాల్ స్కీంలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువు విధించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును రూ.1,000 ఆలస్య రుసుముతో చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత గడువు పొడిగించేది లేదని పేర్కొ న్నారు.
మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజర య్యేవారే ఆ తరువాత జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. కావున ఒకసారి ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఫీజు మొత్తాన్ని ఫిబ్రవరి 6లోగా ట్రెజరీలో జమచేయాలని, అదేరోజు నామినల్ రోల్స్‌ను కూడా డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు.