సమస్యల సుడిగుండంలో ఇంటర్ విద్య | The government has granted 46 colleges | Sakshi
Sakshi News home page

సమస్యల సుడిగుండంలో ఇంటర్ విద్య

Published Wed, Jul 30 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

సమస్యల సుడిగుండంలో ఇంటర్ విద్య

సమస్యల సుడిగుండంలో ఇంటర్ విద్య

మంచిర్యాల సిటీ : జిల్లాలో ఇంటర్ విద్య సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేయడానికి 1990 సంవత్సరానికి ముందు ప్రభుత్వం 46 కళాశాలలు మంజూరు చేసింది. మొదటి విడతగా మంజూరైన 15 కళాశాలలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచి 2009 వరకు దశలవారీగా 30 కళాశాలలు మంజూరయ్యాయి. వీటిలోని 13 కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే తరగతులు నిర్వహించడం గమనార్హం. 14 ఏళ్లుగా అరకొర సౌకర్యాలతో 30 కళాశాలలు నెట్టుకొస్తున్నాయి.
 
వీటిలో 15 కళాశాలలకు నిధులు మంజూరై పనులు పునాదులకే పరిమితమయ్యాయి. కొన్ని కళాశాలల్లో వసతులు లేకపోవడం, పోస్టులు భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులే బోధించడం, పక్కా భవనాలు లేకపోవడంతో విద్యార్థులు చేరడం లేదు. జిల్లాలోని రె బ్బెన, కౌటాల కళాశాలల్లోనే 300కు పైగా అడ్మిషన్లు అవుతున్నాయి. మిగతా కళాశాలలు 100 నుంచి 150అడ్మిషన్లకు పరిమితమవుతున్నాయి.
 
ఒక్కో కళాశాలకు ఖర్చు ఏడాదికి రూ.2.50 కోట్లు

ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఏడాదికి వే తనాలు, ఇతరత్రా అవసరాలకు కలిపి రూ.2.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జిల్లాలోని 46 కళాశాలలకు ఏడాదికి రూ.115 కోట్ల ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో ఒక ఇంటర్ మీడియట్ విద్యార్థికి ఏడాదికి సగటున రూ.33 వేలు ఖర్చు చేస్తున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంత ఖర్చు చేసినా ఇంటర్ విద్య సుడిగుండంలో చిక్కుకొని ఉండటం శోచనీయం.
 
పక్కా భవనాలు..
ఆదిలాబాద్(బాలురు), ఆదిలాబాద్(బాలిక లు), ముథోల్, ఉట్నూర్, మంచిర్యాల, భైంసా, నిర్మల్(బాలురు), నిర్మల్(బాలికలు), కాగ జ్‌నగర్, చెన్నూర్, బెల్లంపల్లి(బాలురు), బోథ్, ఖానాపూర్, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ కళాశాలలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి.
 
భవనాలు లేనివి..
కుభీర్, సారంగాపూర్, దిలావార్‌పూర్, సిర్పూర్(టి), లోకేశ్వరం, కాసిపేట, బెల్లంపల్లి(బాలిక లు), జన్నారం, దండేపల్లి, తలమడుగు, రెబ్బె న, దహెగాం, ఇచ్చోడ కళాశాలలకు భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. కౌటాల కళాశాల అటవీ శాఖ భవనంలో కొనసాగుతోంది. తానూర్ మం డలానికి ఈ విద్యాసంవత్సరం మంజూరైంది. తరగతులు ఎక్కడ నిర్వహించాలో అధికారలకే తెలియాలి.
 
పాక్షికంగా ఉన్నవి..
కెరమెరి, మందమర్రి, బెజ్జూరు, తిర్యాణి, నేరడిగొండ, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, మామడ, తాంసి, బేల, నూర్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, వాంకిడి, జైపూర్ కళాశాలలకు భవనాలు పాక్షికంగా తయారు కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కడెం కళాశాల భవనం కూడా పాక్షికంగా తయారైంది. ఈ కళాశాలో మూడు గదులే పూర్తి కావడంతో ప్రథమ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. ద్వితీయ సంవత్సరం తరగతులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు.
 
భవన నిర్మాణాలు ఆలస్యం
భవన నిర్మాణాలకు అధికారుల సహకారం, కాం ట్రాక్టర్లు మందుకు రాకపోవడం, నిధుల మం జూరులో ఆలస్యం, వచ్చిన నిధులకు వెంటనే ప నులు ప్రారంభించక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఆసిఫాబాద్, రె బ్బెన, మామడ, కౌటాల మండలాల కళాశాలల కు రూ.65లక్షలు మంజూరైనప్పటికీ పనులు ప్రా రంభం కాలేదు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఒ ప్పందం పక్కాగా లేకపోవడంతో పనులు ఆల స్యం అవుతున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సిర్పూర్(టి) కళాశాలకు ఏడాదిన్నరకు అధికారులు స్థలం మంజూరు చేశారంటే  ఇంటర్ విద్యపై జిల్లా ఉన్నతాధికారులకు ఉన్న పట్టింపుకు తార్కాణం.
 
సిబ్బంది లేక ఇబ్బంది
ప్రతి ప్రభుత్వ కళాశాలకు సరిపడేంత అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బందిలో ముగ్గురు అ టెండర్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఒక జూని యర్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు అవసరం. జిల్లాలోని చాలా కళాశాలలకు బోధనేతర సిబ్బంది లేరు. 80 శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం మంజూరైన తానూర్ కళాశాలకు కనీసం ప్రిన్సిపాల్ పోస్టును కూడా అధికారులు మంజూరు చేయలేదంటే అధికారుల చిత్తశుద్ధి ఇంటర్ విద్యపై ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
ప్రభుత్వ విద్యార్థులు.. బోధన రుసుం..
ప్రతి ప్రభుత్వ కళాశాలలో హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంపీసీ, బైపీసీ నాలుగు గ్రూపులు ఉన్నాయి. ప్ర తి గ్రూపునకు 55 సీట్ల చొప్పున 45 కళాశాలల్లో నాలుగు గ్రూపులకు కలిపి ఒక సంవత్సరం కో ర్సుకు 9,900సీట్లు ఉంటాయి. వీటిలో ప్రథమ సంవత్సరంలో ఆర్ట్స్‌గ్రూప్‌లో 3,000, సైన్స్‌గ్రూ ప్‌లో 1,500మంది విద్యార్థులు చేరుతున్నారు. ప్రథమ సంవత్సరంలో అనుత్తీర్ణులు కావడంతో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య 3,500 చేరుకుంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం లో 7వేల మంది విద్యార్థులకు సగటున రూ. 400చొప్పున రూ.32లక్షలు చెల్లించడం విశేషం.
 
ప్రైవేటు విద్యార్థులు.. బోధన రుసుము..
జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రైవేటు విద్యార్థులు 40 వేల మంది చదువుతున్నారు. ఆర్ట్స్‌లో 24 వేలు, సైన్స్‌లో 16 వేల మంది వి ద్యార్థులు ఉన్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు రూ. 1,600, సైన్స్ విద్యార్థులకు రూ.1,980 చొప్పున ఒక్కొక్కరికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్ట్స్ విద్యార్థులకు రూ.3.84 కోట్లు, సైన్స్ విద్యార్థులకు రూ.3.16 కోట్లు చెల్లిస్తోంది. జిల్లాలో ప్రైవేటు విద్యార్థులకు ఏడాదికి రూ.7 కోట్లు ప్రభుత్వం చెల్లించడం విశేషం.
 
కొసమెరుపు..
జిల్లాకు ఒక ఆర్‌ఐవో ఉంటారు. ఆర్‌ఐవో కేవ లం పరీక్షల నిర్వహణ, ప్రైవేటు కళాశాలల పర్యవేక్షణ, అనుమతి వరకే పనిచేస్తారు. ప్రభుత్వ కళాశాలల పర్యవేక్షణ చేయాల్సింది డీవీఈవో. ఇతను కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రభు త్వ కళాశాలలను పర్యవేక్షణ చేయాలి. డీవీఈవో కు ఇటీవలనే తెలంగాణ ఆర్‌జేడీగా అదనపు బా ద్యతలు అప్పగించారు. తెలంగాణలోని 385 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రెండు జిల్లాల అధికారిగా తన పనితీరులో న్యాయం చేయని అధికారి తెలంగాణలోని 385కళాశాలలకు ఏమేరకు తన పనితీరును చూపిస్తారో రాష్ట్ర ఉన్నతాధికారులకే తెలియాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement