చేవెళ్ల (రంగారెడ్డి) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్ బోర్డు రీజినల్ జాయింట్ డైరెక్టర్ మల్‌హర్‌రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య, కోర్సుల వివరాలను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్జేడీ మల్‌హర్‌రావు విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల సంఖ్య మరింత పెరగాలని, ప్రభుత్వ కళాశాలల్లోనే తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపాలని పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాపవుట్స్‌ను తగ్గించి, సంఖ్యను పెంచడానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చిందని తెలిపారు.
జూనియర్ కళాశాలలో ఆర్జేడీ తనిఖీలు
Published Mon, Dec 14 2015 5:00 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement