ఫలితాల్లో జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిన జఫర్‌గఢ్
{పభుత్వ జూనియర్ కళాశాల
ఎంపీసీలో 905 మార్కులు సాధించిన కళాశాల విద్యార్థి బాలాజీ
నూరు శాతం ఫలితాలు సాధించిన వెలుగు గురుకుల పాఠశాల
జఫర్‌గఢ్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి స్థాయిలో వసతులు లేనప్పటికీ ఆధ్యాపకుల అంకిత భావం, విద్యార్థుల పట్టుదలతో ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు వచ్చారుు. కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు సమస్యలతో సతమతమవుతూనే మరోవైపు ఏ ఏటికాయేడు ఫలితాల శాతం పెరుగుతూ వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో 81 మంది విద్యార్థు లు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 73 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యూరు. కళాశాల ఎంపీసీ విద్యార్థిని వీరబత్తిని బాలాజీ 905 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచా డు. బైపీసీలో రాధిక 850 మార్కులు సాధించ గా, సీఈసీలో ఆకుల అపర్ణ 795 మార్కులు సాధించారు.
వెలుగు గురుకుల కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత
మండలంలోని ప్రభుత్వ వెలుగు గురుకుల కళాశాల విద్యార్థులు కూడా ఇంటర్ సెకండియర్‌లో తమ ప్రతిభ చాటారు. కళాశాలలో మొత్తం 73 మంది విద్యార్థులకు గాను 73 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బైపీసీలో జి.రమ 908 మార్కులు సాధించగా, ఎంపీసీలో పి.కళ్యాణి 873 మార్కులు సాధించారు. ఈ కళాశాలలో కూడా ప్రతి ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతూ వస్తోంది.
జఫర్‌గఢ్ ప్రభుత్వ మోడల్ కళాశాల నుంచి 45 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో 882 మార్కులు రాగా, బీపీసీ, సీఈసీ విభాగాల్లో 890 మార్కులు సాధించారు. గతంలో ఎన్నడూలేని విధంగా జూనియర్ కళాశాలతోపాటువెలుగు గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ సెకండియర్‌లో ప్రతిభను చాటి ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధిం చడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రత్యేక తరగతులతోనే అత్యుత్తమ ఫలితాలు : దయాకర్‌రెడ్డి, జీజేసీ ప్రిన్సిపాల్
ఈ యేడు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. వీటి ఫలితంగానే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాస్ కావడమేగాక ఎక్కువ మార్కులు సాధించారు. పరీక్ష ఫలితాల్లో మా కళాశాల జిల్లాలోనే ద్వితీయ స్థానం రావడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది.
అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఎక్కువ మార్కులు
రోజువారి తరగతులతోపాటు అధ్యాపకులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వీటి ఫలితంగానే ఎంపీసీ విభాగంలో నాకు 905 మార్కులు వచ్చాయి. కళాశాలలో అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో బాగుంది.
- బాలాజీ, ఎంపీసీ(905)
వసతులు లేకున్నా విద్య బోధన బాగుంది
కళాశాలలో పూర్తి స్థాయి వసతులు లేకున్నా అధ్యాపకుల విద్యా బోధన ఎంతో బాగుంది. వారి వల్లనే నేను ఎక్కువ మార్కులు సాధించా.
- అపర్ణ
సీఈసీ(795)
సౌకర్యాలు లేకున్నా.. సత్తా చాటారు
Published Wed, Apr 29 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement
Advertisement