japhargadh
-
సౌకర్యాలు లేకున్నా.. సత్తా చాటారు
ఫలితాల్లో జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిన జఫర్‌గఢ్ {పభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీలో 905 మార్కులు సాధించిన కళాశాల విద్యార్థి బాలాజీ నూరు శాతం ఫలితాలు సాధించిన వెలుగు గురుకుల పాఠశాల జఫర్‌గఢ్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి స్థాయిలో వసతులు లేనప్పటికీ ఆధ్యాపకుల అంకిత భావం, విద్యార్థుల పట్టుదలతో ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు వచ్చారుు. కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు సమస్యలతో సతమతమవుతూనే మరోవైపు ఏ ఏటికాయేడు ఫలితాల శాతం పెరుగుతూ వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో 81 మంది విద్యార్థు లు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 73 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యూరు. కళాశాల ఎంపీసీ విద్యార్థిని వీరబత్తిని బాలాజీ 905 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచా డు. బైపీసీలో రాధిక 850 మార్కులు సాధించ గా, సీఈసీలో ఆకుల అపర్ణ 795 మార్కులు సాధించారు. వెలుగు గురుకుల కళాశాలలో వంద శాతం ఉత్తీర్ణత మండలంలోని ప్రభుత్వ వెలుగు గురుకుల కళాశాల విద్యార్థులు కూడా ఇంటర్ సెకండియర్‌లో తమ ప్రతిభ చాటారు. కళాశాలలో మొత్తం 73 మంది విద్యార్థులకు గాను 73 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బైపీసీలో జి.రమ 908 మార్కులు సాధించగా, ఎంపీసీలో పి.కళ్యాణి 873 మార్కులు సాధించారు. ఈ కళాశాలలో కూడా ప్రతి ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతూ వస్తోంది. జఫర్‌గఢ్ ప్రభుత్వ మోడల్ కళాశాల నుంచి 45 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో 882 మార్కులు రాగా, బీపీసీ, సీఈసీ విభాగాల్లో 890 మార్కులు సాధించారు. గతంలో ఎన్నడూలేని విధంగా జూనియర్ కళాశాలతోపాటువెలుగు గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ సెకండియర్‌లో ప్రతిభను చాటి ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధిం చడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక తరగతులతోనే అత్యుత్తమ ఫలితాలు : దయాకర్‌రెడ్డి, జీజేసీ ప్రిన్సిపాల్ ఈ యేడు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. వీటి ఫలితంగానే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాస్ కావడమేగాక ఎక్కువ మార్కులు సాధించారు. పరీక్ష ఫలితాల్లో మా కళాశాల జిల్లాలోనే ద్వితీయ స్థానం రావడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఎక్కువ మార్కులు రోజువారి తరగతులతోపాటు అధ్యాపకులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వీటి ఫలితంగానే ఎంపీసీ విభాగంలో నాకు 905 మార్కులు వచ్చాయి. కళాశాలలో అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో బాగుంది. - బాలాజీ, ఎంపీసీ(905) వసతులు లేకున్నా విద్య బోధన బాగుంది కళాశాలలో పూర్తి స్థాయి వసతులు లేకున్నా అధ్యాపకుల విద్యా బోధన ఎంతో బాగుంది. వారి వల్లనే నేను ఎక్కువ మార్కులు సాధించా. - అపర్ణ సీఈసీ(795) -
వడగళ్ల నష్టాన్ని చూడొచ్చారు..
జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం తిమ్మంపేట, చిన్నపెండ్యాల, గవిచర్లలో పర్యటన పంట క్షేత్రాలను పరిశీలించిన అధికారులు కడగండ్లపై నివేదిక అందజేసిన కలెక్టర్ వరంగల్, న్యూస్‌లైన్ : గత నెలలో జిల్లాలో కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర అధికారుల బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. మూడు రోజుల పాటు కురిసిన వడగళ్లు జిల్లాలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అకాల వర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపెద్ద వడగళ్లు పడడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతాలను కేంద్ర బృందం పర్యటించింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట గ్రామంలో మొక్కజొన్న, వరి, మామిడి, సపోటా తోటలను పరిశీలించింది. రైతులతో చర్చించి పంటలు, నష్టపోయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ధ్వంసమైన ఇండ్లు, మృతి చెందిన పశువుల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌ఘనపురం మండలం చిన్నపెండ్యాల గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో వివిధ మండలాల్లో వడగండ్ల వాన వల్ల నష్టపోయిన పంటలు, ధ్వంసమైన ఇండ్లు, మృతి చెందిన పశువులకు సంబంధించిన ఛాయ చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లాలో వడగండ్ల వాన వలన నష్టపోయిన పంట వివరాలను జిల్లా కలెక్టర్ జి.కిషన్ కేంద్ర బృందానికి వివరించారు. వ్యవసాయ పక్షాన జరిగిన నష్టంపై నివేదిక సమర్పించారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 22కోట్ల పరిహారాన్ని కోరుతూ నివేదిక అందించారు. ఇందులో వెయ్యి హెక్టార్లలో పత్తి, 13వేల హెక్టార్లలో మొక్కజొన్న, 13వేల హెక్టార్లలో వరి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు. ఉద్యవనశాఖ నుంచి 4436.65 హెక్టార్లలో మిర్చి, పండ్లు, కూరగాయాల తోటలకు జరిగిన నష్టాన్ని తెలియజేశారు. 8169 మంది రైతులు నష్టపోయారని, రూ. 4.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు వివరించారు. వ్యవసాయ శాఖతో పాటు రెవిన్యూ, ఉద్యావనశాఖ, రోడ్లు,భవనాలు, విద్యుత్‌శాఖ అధికారులు తమ శాఖలపరంగా జరిగిన నష్టంపై నివేదిక అందించారు. కలెక్టరేట్లో సమావేశం అనంతరం సంగెం మండలం గవిచర్లలో దెబ్బతిన్న పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పూర్తిగా నష్టపోయారనే అంచనాకు అధికారులు వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు బి.కళ్యాణచ క్రవర్తి, ఆర్పి సింగ్, పంకజ్ త్యాగి, టిజిఎస్ త్యాగి, ఎన్ఎస్ మోది, డీఆర్ఓ సురేంద్రకరణ్, వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ జి.రామారావు, ఉద్యాన వన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎంవి అక్బర్ తదితరులు పాల్గొన్నారు.