
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేపట్టిన సహాయక చర్యలు
గ్రేటర్ నోయిడా : నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో భవనంపై పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోమారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాలోని సాహ్ బెరి గ్రామంలో మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలి పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవనంపై పడింది.
దీంతో నాలుగంతస్తుల భవనం కూడా కుప్పకూలి అందులో నివాసముంటున్న18 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. నాణ్యతాపరమైన లోపాల వల్లే భవనం కుప్పకూలి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment