
ఇటలీలో భూకంపం, రోమ్ లోనూ భూప్రకంపనలు
రోమ్ : ఇటలీలో తీవ్ర భూకంపం సంభవించింది. రోమ్ నగరంతో పాటు సెంట్రల్ ఇటలీలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. స్వల్పకాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీని ప్రభావంతో పురాతన భవనాలు నేలమట్టం కాగా, పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు రోమ్ లోనూ భూప్రకంపనలు వచ్చాయి.