EARTH QUAKES
-
Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!
ప్రపంచంలో 2023లో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వీటివల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ప్రపంచంలో వచ్చిన కొన్ని ప్రధాన భూకంపాల గురించి తెలుసుకుందాం..! ఫిబ్రవరి 6: టర్కీ-సిరియా భూకంపం ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ, మధ్య ప్రాంతంలో భూమి రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో కంపించింది. సిరియాలో ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 7.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూమిలోపల 95 కిమీ లోపల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ విపత్తులో అపార ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపంలో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 50,783 మంది కాగా.. సిరియాలో 8,476 మంది మృత్యువాతపడ్డారు. టర్కీ జనాభాలో 1.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని అంచనా. సుమారు 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. మార్చి 18: గుయాస్ భూకంపం, ఈక్వెడార్ దక్షిణ ఈక్వెడార్‌లో 2023 మార్చి 18న భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఎల్ ఓరో, అజువే, గుయాస్ ప్రావిన్స్‌లలో భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 446 మంది గాయపడ్డారు. 16 మంది మరణించారు. ఈక్వెడార్ జనాభాలో దాదాపు సగం మంది 8.41 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితులయ్యారు. దేశంలోని మొత్తం 24 ప్రావిన్సుల్లోని 13 ప్రావిన్సుల్లో భూమి కంపించింది. మార్చి 21: ఆఫ్ఘనిస్థాన్ భూకంపం 2023, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 1000 కిలోమీటర్ల వైశాల్యంలో భూమి కంపించింది. ఆప్ఘనిస్థాన్‌లోని 9 ప్రావిన్స్‌లలో ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితమయ్యారు. కనీసం 10 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. 665 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, క్వెట్టా, పెషావర్లలో ప్రకంపనలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో కారకోరం హైవే మూసుకుపోయింది. బునెర్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయి 40 మంది గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. సెప్టెంబరు 8: మొరాకో భూకంపం 2023 సెప్టెంబరు 8న మొరాకోలోని మరకేష్-సఫీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8-6.9 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 2,960 మంది ప్రాణాలు కోల్పోయారు. మరకేష్‌లోని చరిత్రాత్మక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్, అల్జీరియాలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. మొరాకో చరిత్రలో నమోదు చేయబడిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇది ప్రధానమైంది. 1960 అగాదిర్ భూకంపం తర్వాత దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. 2023లో టర్కీ-సిరియా భూకంపం తర్వాత ఇందులోనే అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. 1,00,000 మంది పిల్లలతో సహా మరకేష్, అట్లాస్ పర్వతాల పరిసర ప్రాంతాల్లో 2.8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అక్టోబర్ 7: హెరాత్ భూకంపం, ఆఫ్ఘనిస్తాన్ 2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడం భారీ నష్టాన్ని కలిగించింది. మొదటి రెండు భూకంపాలు అక్టోబర్ 7న హెరాత్ నగరానికి సమీపంలో సంభవించాయి. అక్టోబర్ 11, 15 తేదీల్లో అదే ప్రాంతంలో మరో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయి. ఈ భూకంపాల్లో 1,482 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,100 మందికి గాయాలయ్యాయి. 43,400 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1,14,000 మందికి మానవతా సహాయం అవసరమైందని అంచనా. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో సరైన ఆస్పత్రి సౌకర్యాలు అందలేదు. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నవంబర్ 3: నేపాల్ భూకంపం 2023 నవంబర్ 3న నేపాల్ కర్నాలీ ప్రావిన్స్‌లోని జాజర్కోట్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 375 మంది గాయపడ్డారు. పశ్చిమ నేపాల్, ఉత్తర భారతదేశం అంతటా భూప్రకంపనలు కనిపించాయి. 2015 నుంచి నేపాల్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. మరణాల్లో జాజర్కోట్ జిల్లాలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరణించిన వారిలో 78 మంది పిల్లలు కూడా ఉన్నారు. నేపాల్‌లోని పదమూడు జిల్లాల్లో దాదాపు 62,039 ఇళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో 26,550 ఇళ్లు కుప్పకూలాయి. నవంబర్ 17: మిండనావో భూకంపం, ఫిలిప్పీన్స్ 2023 నవంబర్ 17న ఫిలిప్పీన్స్ మిండనావో ద్వీపంలోని సారంగని ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 11 మంది మరణించారు. 730 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగున ఉన్న ఇండోనేషియాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 644 ఇళ్లు కూలిపోగా.. 4,248 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదీ చదవండి: Year End 2023: అన్నీ మంచి శకునములే! -
మోత కష్టం, లేత కొండలవి!
ప్రకృతిని లెక్కజేయని మనిషి తత్వం తీరని ఉపద్రవాలు తెస్తోంది. ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణ మౌతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జనిత కరోనా మహమ్మారి నుంచి... అదే చైనా నేలపై వెయ్యేళ్లలో లేని వర్షాలు జనావాసాలను ముంచెత్తడం వరకు ఇవన్నీ ప్రకృతి చెబుతున్న పాఠాలే! అయినా మనిషి నేర్చుకుంటున్నదెక్కడ? అనావృష్టి, అతివృష్టి, ఎన్నడూ లేని ఎండలు, వరదలు– వడగాలులు, కరుగుతున్న ధ్రువాలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు... ఈ రోజు ప్రపంచమంతా అసాధారణ వాతావరణ పరిస్థితుల్ని చవిచూసి, దుష్ఫలితాలు అనుభవిస్తోంది. అర్ధ శతాబ్దిలో లేని వర్షాలు అయిదారు రోజుల పాటు మహారాష్ట్రను ముంచెత్తి అతలాకుతలం చేశాయి. హిమాచల్ ప్రదేశ్, సిర్మౌర్ జిల్లాలో తాజాగా కొండ చరియ విరిగి, క్షణాల్లో వంద మీటర్ల మేర జాతీయ రహదారి అమాంతం లోతైన లోయలోకి జారిన తీరు గగుర్పాటు కలిగించింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేదు గానీ, వందలాది వాహనాలు ఎటూ వెళ్లే దారిలేక కొండల్లో చిక్కుబడిపోయాయి. ఈ వారంలోనే కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగి తొమ్మిది మంది యాత్రికులు మరణించారు. ఒక్క హిమాచలే కాదు, ఉత్తరాఖండ్ తదితర హిమాలయ రాష్ట్రాల్లో ఇది తరచూ జరుగుతోంది. ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగించేలా జలవిద్యుత్ ప్రాజెక్టులు, బహుళ అంతస్తు భవనాలు, అడ్డదిడ్డం రోడ్లు, ఆ క్రమంలో... అడవుల్ని నరకడం వంటి మానవ చర్యలు భూమ్యావరణ స్థితికి భంగం కలిగిస్తున్నాయి. ప్రమాదాల్ని ఆహ్వానించి విపత్తులు పెంచుతున్నాయి. భూభౌతిక పరిణామ ప్రభావాలకు తోడు మానవ ప్రమేయ కారణాలు, తాజాగా తలెత్తిన పర్యావరణ మార్పు ప్రతికూల తలు వెరసి కొత్త సమస్యలు తెస్తున్నాయి. విపత్తుల్ని ఇంకా తీవ్రం చేస్తున్నాయి. వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, విపత్తులు... తట్టుకునే (రెసిలియెన్స్), సమర్థంగా ఎదుర్కొనే (మిటిగేషన్), ఏదోలా సర్దుకునే (అడాప్టబిలిటీ) సామర్థ్యాల్నిచ్చే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. ఇందుకు అవసరమైన నిర్దిష్ట కార్యాచరణలో వరుస ప్రభుత్వాలు విఫలమౌతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత యువ పర్వతశ్రేణి హిమాలయాలు. భారత–యూరేషియా ప్లేట్లు ఢీకొంటున్న ప్రక్రియ వల్ల టిబెట్ పీఠభూమి, హిమాలయాలు ఏర్పడ్డాయి. 50 మిలియన్ సంవ త్సరాల కింద మొదలైన ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అందుకే, అత్యంత ఎత్తుగా, సున్ని తంగా, కుదురుకుంటున్న స్థితిలో ఉంటాయీ పర్వతాలు. దానికి తోడు హిమంతో కప్పుకొని ఉండటం కూడా సున్నితత్వం పెంచేదే! ఏ ఆరావళి పర్వతశ్రేణి లాగో, మరే తూర్పు–పశ్చిమ కను మల్లాగానో పురాతన శ్రేణి కాదిది. మానవ కల్పిత పర్యావరణపరమైన ఒత్తిళ్లను హిమాలయాలు తట్టుకోలేవు. కొత్తగా పోసిన ఇసుక రాసిలాగా కిందకు జారే తత్వం ఎక్కువ! పొరలు గట్టిపడలేదు కనుక కొండచరియలు విరిగిపడటం సహజం. దానికి తోడు విశ్వవ్యాప్తంగా పెరిగిన కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్యాల వల్ల భూతాపోన్నతి పెరుగుతోంది, మంచు కరుగుతోంది. మేఘ విస్పోటనాల వల్ల నిమిషాల్లో కుంభవృష్టి కురిసి కొండ చరియలు అమాంతం విరిగిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోకుండా చేస్తున్న మానవ ప్రమేయ, ప్రేరిత చర్యలు విపత్తులు పెంచి, సమస్యను జటిలం చేస్తున్నాయి. గడచిన ఒకటిన్నర దశాబ్దాలుగా హిమాలయ రాష్ట్రాల్లో తలెత్తిన ఎన్నో ఉపద్రవాలకు, ప్రాణ–సంపద నష్టాలకు మనం ప్రత్యక్ష సాక్షులం. ఇక ప్రకృతి, పర్యావరణపరమైన నష్టాలకు కొలతలే లేవు! కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి... చార్ధామ్ పుణ్యక్షేత్ర సముదాయపు దారుల్ని చుట్టుముట్టి, కన్నీళ్లు మిగిల్చిన పెద్ద జలవిలయాన్ని లోగడ మనం చూశాం. ఇదంతా భూకంప ఆస్కారపు మండలమే (సీస్మిక్ జోన్)! రిక్టర్ స్కేల్ పైన 3, 4, 5 నమోదయ్యే భూకంపాలు తరచూ జరిగేవే! 1999లో మన దగ్గర, 2015లో నేపాల్ (ఖాట్మండు)లో పెద్ద భూకంపాలొచ్చి తీరని నష్టం జరిగింది. ఇంకో పెద్ద భూకంపానికి ఆస్కారం ఉందని భౌగోళిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో... సహజ నదీ ప్రవాహాలకు అడ్డుకట్టలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, పట్టణీకరణ, అశాస్త్రీయ రహదారుల ఏర్పాటు, ఆ మేర అడవుల నరికివేత... ఇవన్నీ విఘాతాలే! స్తంభం నుంచి ఊడి నేలకొరిగిన విద్యుత్ వైర్‌తో ప్రమాద ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. దానికి మనిషో, మరే జంతువో తగులుకున్నప్పుడది ప్రమాదం కింద మారుతుంది! హిమాలయ పర్వత సానువుల్లో విపత్తు ఆస్కారం నిరంతరం ఉంటుంది. పనిగట్టుకొని మనిషి అందులోకి చొర బడి, సదరు ఆస్కారాన్ని విపత్తుగా మారుస్తున్న సందర్భాలే ఎక్కువ. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధన వాడకం తగ్గించడమనే కారణం చూపి, చౌక జలవిద్యుత్తు ఉత్పత్తి పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు. స్వార్థం హద్దులు దాటుతోంది. సహజ జలధారల్ని అడ్డగించి, 25 శాతం నీటిని రిజర్వాయర్లలో బంధించి, 75 శాతం నీటిని టన్నెల్స్ ద్వారా పంపించడం ప్రమాదహేతువని నేపాల్ భూకంపాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ, 2018–19 లో సట్లెజ్లోయ ప్రాంతాన్ని సందర్శించిన పార్లమెంట్ (ఇంధన) స్థాయీ సంఘం, ప్రస్తుత జలవిద్యుదుత్పత్తి 10,547 మెగావాట్లు, దీన్ని రెట్టింపు చేసుకోవచ్చు, చేసుకోండని సూచించడాన్ని ఎట్లా అర్థం చేసు కోవాలి? అందుకే, ప్రభుత్వాలకు ప్రజా ప్రయోజనాలు కల్పించే తెలివిడే కాదు, ప్రకృతిని పరిరక్షించి విపత్తుల నుంచి వారిని కాపాడే ఇంగితం, దూరదృష్టి కూడా ఉండాలి. -
ఆ ప్రాంతంలో భూకంపాల ముప్పు అధికం
న్యూఢిల్లీ: భూగర్భంలో ఇండియా, ఆసియన్ ఫలకాలు కలిసే చోట, లద్దాఖ్ ప్రాంతంలో ఫాల్ట్‌లైన్ క్రియాశీలకంగా ఉందని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలోని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల అక్కడ భూకంపాల సంభవించే అవకాశాలు అధికమని తేలింది. లద్దాఖ్‌లో తరచుగా కొండ చరియలు విరిగి పడుతుండడానికి టెక్టానిక్ ప్లేట్ల క్రియాశీలతే కారణమని తెలిపింది. ఈ పరిశోధన ఫలితాలు టెక్నోఫిజిక్స్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. (లద్దాఖ్, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం) కాగా.. లద్దాఖ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. హిమాలయ ప్రాంతంలో గత 15 రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి. -
చైనాలో వరుస భూకంపాలు
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో రెండు వరుస భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల్లో 12 మంది మృతి చెందగా 125 మంది గాయపడ్డారని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 10:55 గంటలకు (స్థానిక కాలమానం) రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మొదటి భూకంపం రాగా, రెండవది మంగళవారం సంభవించిందని చైనా భూకంప విభాగం తెలిపింది. చాంగింగ్ కౌంటీలోని యిబిన్ నగరానికి దగ్గర్లో భూమికి 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు యిబిన్, జుయోంగ్ పట్టణాల మధ్య ఉన్న రహదారి బీటలు వారడంతో ఆ దారిని మూసివేశారు. దాదాపు ఒక నిమిషం పాటు భవనాలు ఊగాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఊగిసలాట కారణంగా పలు భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. మరణాల్లో అత్యధిక శాతం భవనాల కింద చిక్కుకొన్నవారివే ఉన్నాయన్నారు. గాయాలపాలైన 53 మందిని చాంగింగ్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని రక్షక బృందం తెలిపింది. -
దూసుకొస్తున్న మహా ప్రళయం..!
సాక్షి, వెబ్ డెస్క్ : రింగ్ ఆఫ్ ఫైర్ తీరంలో వరుస భూ ప్రకంపనలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతంలో ఆవరించిన ఉన్న ‘రింగ్ ఆఫ్ఫైర్ జోన్’లో కదలిక వల్ల జపాన్, గ్వామ్, తైవాన్, అలస్కా, ఫిలిప్పీన్స్‌లో భూ కంపాలు విలయతాండవం సృష్టించాయి. అన్నిటి కన్నా తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని కలిగించింది. అతి త్వరలో భారీ భూకంపాలు మరోసారి పసిఫిక్ తీర ప్రాంత దేశాలపై విరుచుకుపడబోతున్నాయని కొందరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తైవాన్‌లో సంభవించిన భూ కంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.4గా నమోదు కాగా, గ్వామ్లో 5.7, 5.6, 5.4, 4.9 తీవ్రతలతో పలుమార్లు భూమి కంపించింది. ఫిబ్రవరి 11 నుంచి ఇప్పటివరకూ జపాన్ తీర ప్రాంతంలో మూడు సార్లు భూమి తన ప్రకోపాన్ని ప్రదర్శించింది. ఆదివారం కూడా 4.8 తీవ్రతతో తైవాన్‌లో తీరప్రాంతంలో భూమి కంపించింది. ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఎప్పటినుంచో గాఢ నిద్రలో ఉన్న ఓ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ నేపథ్యంలో రింగ్ ఆఫ్ ఫైర్‌లో మొదలైన కదలికలు మానవాళిని అతలాకుతలం చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా.. మరికొందరు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. రింగ్ ఆఫ్ ఫైర్‌లో వస్తున్న కదలికలు సాధారణమైనవేనని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న భూకంపాల్లో 90 శాతం రింగ్ ఆఫ్ ఫైర్ ఆవరించిన ప్రాంతంలోనే వస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న అగ్ని పర్వతాల్లో నాలుగింట మూడో వంతు రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఉన్నాయి. భూమి ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏంటి? రింగ్ ఆఫ్ ఫైర్ అనేది గుర్రపు నాడ ఆకృతిలో ఉంటే ఓ డిజాస్టర్ జోన్. రింగ్ ఆఫ్ ఫైర్ బెల్ట్ ప్రాంతంలో 450కి పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. టెక్టోనిక్ ప్లేట్స్ తరచూ కదులుతూ ఈ అగ్నిపర్వతాల విస్ఫోటనానికి కారణం అవుతుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ బెల్ట్ భూమి క్రెస్ట్కు కనెక్ట్ అయి ఉండటం వల్ల భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జరిగే నష్ట తీవ్రత ఊహించలేనంతగా ఉంటుంది. న్యూజిలాండ్ ద్వీపం నుంచి ఆసియా, అమెరికా తీర ప్రాంతాలను తాకుతూ దక్షిణ అమెరికాలోని చిలీ వరకూ రింగ్ ఆఫ్ ఫైర్ విస్తరించి ఉంది. అంటే 40 వేల కిలోమీటర్ల దూరం పాటు భారీ భూకంప వలయం భూమిపై ఉందన్నమాట. రింగ్ ఆఫ్ ఫైర్‌లో కొన్ని చోట్ల సబ్డక్షన్ జోన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానిపై మరొకటి అమర్చి ఉన్నాయి. ఈ కారణంగానే సముద్ర గర్భంలో భూ కంపాలు సంభవించినప్పుడు భారీ సునామీలు మానవాళిపై విరుచుకుపడుతున్నాయి. -
'మహా ప్రళయం కోరల్లో న్యూజిలాండ్'
వెల్లింగ్టన్ : పెను భూకంపాలు న్యూజిలాండ్ ద్వీపంలో విధ్వంసం సృష్టిస్తాయని సోమవారం జియాలజిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. న్యూజిలాండ్‌కు చేరువలో ఉన్న హికురంగీ పీఠభూమిలో వస్తున్న కదలికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ పెను భూకంపాల ధాటికి న్యూజిలాండ్‌పై భారీ సునామీలు విరుచుకుపడతాయని వెల్లడించారు. 2011లో జపాన్‌లో భూకంపం వల్ల వచ్చిన విపత్కర పరిస్థితులు న్యూజిలాండ్‌లోనూ కనిపిస్తాయని చెప్పారు. కాగా, సోమవారం 4.1 తీవ్రతతో న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ సాధారణ భూకంపం సంభవించింది. 9.0 కంటే అధిక తీవ్రతతో తొలుత భూకంపాలు సంభవించి, అనంతరం పెను సునామీలు న్యూజిలాండ్‌ను ముంచెత్తుతాయని జియాలజిస్టులు చెప్పారు. సునామీ నుంచి తప్పించుకునేందుకు న్యూజిలాండ్ ప్రజలకు కేవలం ఏడే నిమిషాలు సమయం ఉంటుందని హెచ్చరించారు. రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానిపై మరొకటి చేరడంతో జపాన్ పెను భూకంపం వచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు న్యూజిలాండ్ వద్ద కూడా అదే జరగబోతోందని అన్నారు. 2004లో ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో 9.1 భూకంపం సంభవించి పెను సునామీ 2,50,000 మందిని బలిగొంది. -
భూప్రకంపనలతో పరుగులు తీసిన ప్రజలు..
సాక్షి, భద్రాద్రి : ప్రజలు సాయంత్రం సమయంలో పనులు చేసుకుంటుండగా భూప్రకంపనలు కలకలం రేపాయి. ఈ భూప్రకంపనలు జిల్లాలలోని రామవరంలో చోటుచేసుకున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించిన శబ్ధం వినిపంచడంతో ప్రజలు ఇళ్లు, దుకాణాల నుంచి బయటకు పరుగులు తీశారు. రామవరం ప్రధాన సెంటర్లోని కొన్నిచోట్ల సింగరేణి, కిన్నెరసాని నీటిసరఫరా పైపులైన్లు పగిలిపోయి నీరు బయటకు వస్తోంది. భూప్రకంపనల కారణంగానే పైపులైన్లు పగిలిపోయి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. గతంలో ఇక్కడ సింగరేణి సంస్థ 2 ఇంక్లెన్ భూగర్భ గనని నడిపిందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అది మూతపడిందని, దాని ప్రభావంతోనే భూ ప్రకంపనలు ఏర్పడి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
భూకంపాల పరిశోధన సంస్థతో ‘నన్నయ’ ఒడంబడిక
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : అహ్మదాబాద్‌లోని భూకంపాల పరిశోధన సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీ సహకార పరిశోధనపై అవగాహన ఒడంబడికను కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన అంగీకార పత్రాలపై శుక్రవారం యూనివర్సిటీ వీసీ ఛాంబర్లో భూకంపాల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎం.రవికుమార్, నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పరస్పరం సంతకాలు చేశారు. భూకంపాలకు సంబంధించి జరిపే పరిశోధనల వల్ల కలిగే ప్రయోజనాలు, భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాలపై ఉభయులు చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోది ప్రోత్సాహంతో ఈ సంస్థ దేశంలో అనేక ప్రాంతాల్లో భూకంపాలకు సంబంధించి పలు అంశాలపై పరిశోధనలు చేస్తుందన్నారు. అనంతరం యూనివర్సిటీలోని జియాలజీ విభాగం అధిపతి డాక్టర్ కేవీ స్వామి, వారి బృందంతో కూడా భూకంపాల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎం.రవికుమార్ చర్చించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ టి.మురళీధర్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.లింగారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎ.మట్టారెడ్డి, ఇంజినీర్ ఏవీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఎనలిటికల్ స్కిల్స్ పరీక్ష ఫీజు రద్దు ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 29న నిర్వహించనున్న ఎనలిటికల్ స్కిల్స్ అనే ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన నాలుగో సెమిస్టర్ పరీక్షకు విద్యార్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. ఈనెల ఒకటిన జరిగిన ఈ పరీక్ష మోడల్ మారడంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల విజ్ఞప్తుల మేరకు పరీక్ష రద్దు చేసి, తిరిగి 29న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. అయితే ఇందుకుగాను ప్రతి విద్యార్థి రూ.250 ఫీజు చెల్లించాలనడంపై ‘తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి’ అనే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఫీజును రద్దు చేసి, గతంలో ఇచ్చిన హాల్ టికెట్లతో పాత సెంటర్లలోనే నేరుగా పరీక్షకు హాజరుకావొచ్చన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చన్నారు. -
ఇటలీలో భూకంపం, రోమ్ లోనూ భూప్రకంపనలు
-
ఇటలీలో భూకంపం, రోమ్ లోనూ భూప్రకంపనలు
రోమ్ : ఇటలీలో తీవ్ర భూకంపం సంభవించింది. రోమ్ నగరంతో పాటు సెంట్రల్ ఇటలీలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. స్వల్పకాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీని ప్రభావంతో పురాతన భవనాలు నేలమట్టం కాగా, పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు రోమ్ లోనూ భూప్రకంపనలు వచ్చాయి. -
మనకూ భూకంపాలను ముందే గుర్తించే వ్యవస్థ
న్యూఢిల్లీ: భూకంపాలు ప్రపంచంలో ఎక్కడైనా ఊహించని విపత్తును సృష్టిస్తున్న విషయం తెల్సిందే. భూకంపాలు వచ్చే విషయాన్ని కొన్ని క్షణాల ముందు కనుక్కున్నా కొన్ని వేల ప్రాణాలను రక్షించుకోగలం. అపార నష్టాన్ని తగ్గించుకోగలం. భూప్రకంపనలను కనీసం 30 సెకన్ల ముందు కచ్చితంగా కనుక్కొనే అత్యాధునిక ‘వార్నింగ్ అండ్ సెక్యూరిటీ’ వ్యవస్థను త్వరలో మన దేశంలోనూ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రస్తుతం మన దేశంలో ఉపయోగిస్తున్న ప్రకంపనల హెచ్చరిక వ్యవస్థ ప్రాథమిక ప్రకంపనలను గుర్తించి మాత్రమే అలారం ద్వారా పౌర అధికారులను హెచ్చరించగలదు. కానీ ఇప్పుడు కొత్తగా నెలకొల్పబోతున్న వ్యవస్థ ప్రాథమిక ప్రకంపనలను కూడా కనీసం 30 సెకన్ల ముందు గుర్తించి హెచ్చరించగలదు. 2010లో చిలీలో వచ్చిన భూప్రకంపనలను 30 సెకన్ల ముందు కనుక్కోవడం వల్ల అక్కడ అపార ప్రాణ, ఆస్తి నష్టాలను నియంత్రించగలిగారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇంతకుమించిన ఆధునిక వ్యవస్థలేదు. ‘ఎర్త్‌క్వేక్ వార్నింగ్ అండ్ సెక్యూరిటీ’గా పిలిచే ఈ వ్యవస్థలో సెక్యూరిటీ ఫీచర్లు ఉండడం మరీ విశేషం. ఈ వ్యవస్థ ద్వారా నగరాల్లో అపార నష్టానికి కారణమవుతున్న ఎలక్ట్రిక్, ఎనర్జీ వ్యవస్థలను నిలిపివేయవచ్చు. ఫ్లడ్ వాటర్ వ్యవస్థ దెబ్బతినకుండా చూడొచ్చు. ఆకాశ హర్మ్యాల్లోని లిఫ్టులను క్షణాల్లో నిలిపివేయవచ్చు. కెమికల్ ప్లాంట్స్, లాబరేటరీలను, హాస్పత్రులను రక్షించుకోవచ్చు. అదే సమయంలో అత్యవసర ద్వారాలను తెరవవచ్చు. నగరాల్లోని అన్ని ముఖ్యమైన వ్యవస్థలకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధించి ఇవన్నింటినీ సాధించవచ్చు. ఈ వ్యవస్థ వైర్లెస్ ద్వారా కూడా నగరమంతటా పనిచేస్తోంది. ఈ వ్యవస్థను భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతం విస్తీర్ణం, భూకంపాల తీవ్రతను బట్టీ భారీ అలారాలను మోగిస్తుంది. వెంటనే ఆటోమేటిక్‌గా సెక్యూరిటీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. జర్మనీకి చెందిన ‘సెక్టీ ఎలక్ట్రానిక్స్’ కంపెనీ ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో ఇప్పటికే 25 దేశాలు ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇదే కంపెనీ ఇండియన్ పార్టనర్ ‘టెర్రా టెక్కామ్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా భారత్‌కు అందిస్తోంది. దేశంలో దీన్ని జనవ రి లేదా ఫిబ్రవరిలో ఏర్పాటు చేయబోతోంది. -
భూకంపాలతో బహుపరాక్
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరంలో రాజధాని ప్రాంతంగా పేర్కొన్న విజయవాడ-గుంటూరు బెల్ట్ అంతా ప్రకృతి వైపరీత్యాలకూ, భూకంపాలకూ కేంద్రం కాగలదని జాతీయ స్థాయి నివేదికలు, ఐక్యరాజ్య సమితి స్థానిక సంస్థలతో జరిపిన సర్వేలు కొన్ని వెల్లడించాయి. భూకంపాలు (చిన్నవీ, పెద్దవీ) సంభవించగల ప్రాంతాలలో, ఇంతకుముందు పేర్కొన్న అయిదు జోన్లు సహా తాజాగా పరిస్థితులు మారుతున్నాయని అంచనా. ఇలా భూకంపాల స్వరూపాలు తారుమారవు తున్న ప్రాంతాల్లో విజయవాడ-గుంటూరు రాజధాని ప్రాంతం కూడా ఉందని భోగట్టా! ‘వాతావరణం, పర్యావరణాలలో శరవేగంగా వస్తున్న మార్పులు నేడు మానవాళి ఉనికికే ప్రమాదకరంగా ఉన్నాయి. ఇతర జీవరాశులకూ ఉపద్రవం తెస్తున్నాయి. ముంచుకొస్తున్న ఈ విలయాన్ని అన్ని దేశాలు గుర్తించాలి.’ అలన్ రస్‌బ్రిడ్జర్ (‘ది గార్డియన్’ ఎడిటర్-ఇన్-చీఫ్ ఇంటర్వ్యూ నుంచి) ప్రకృతిలో ఇటీవల కాలంలో గతంలో కంటే చాలా ఎక్కువగా, తర చుగా దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. అవే కొన్నిచోట్ల సునామీలుగా మారుతున్నాయి. మరికొన్నిచోట్ల భూకంపాలుగా, పెనుభూకంపాల రూపంలో కల్లోల పరుస్తున్నాయి. ఈ ఉత్పాతాలు పలు దేశాలను ముప్పెరగొంటున్నాయి. నేపాల్‌ను అతలాకుతలం చేసిన తాజా ఉప ద్రవం వంటి వాటికి ప్రధాన కారణాలలో ఒకటిగా భూమిని కుళ్ల బొడవ డాన్ని అలన్ పేర్కొన్నారు. భూ ఉపరితలాన్నే కాకుండా, భూమి పైపొర లను చీల్చుకువెళ్లి కుళ్లపొడుస్తూ వనరుల కోసం మానవావసరాల పేరిట, స్వలాభాపేక్షాపరుల స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొట్టడం గురించే ఆయన ప్రస్తావించారు. భూకంపం ఒక శాశ్వత హెచ్చరిక మన ఇరుగుపొరుగు హిమాలయ దేశం నేపాల్‌లో నిన్న మొన్న ప్రజల ప్రాణాలకూ, ఆస్తులకూ, చారిత్రక కట్టడాలకూ అపార నష్టం కలిగిస్తూ సంభవించిన భూకంపం (రిక్టర్ స్కేలు మీద 7.6గా నమోదైంది) ఒక గొప్ప అవసరాన్ని గుర్తు చేసింది. ప్రపంచ మానవాళి, శాస్త్ర సాంకేతిక నిపుణులు ఇకనైనా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కాకుండా, సమష్టిగా సమన్వయంతో మున్ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అది మరీ మరీ హెచ్చరిస్తున్నది. చరిత్రలో అగ్నినీ, చక్రాన్నీ, చక్రగతినీ కనుగొన్నది లగాయితూ మానవ జాతి నిరంతర తపనతో సాగిస్తున్న ప్రగతిపథం ఉద్దేశం ఏది? సహ మానవుల జీవితాలను సుఖమయం చేయడానికి ఎప్పటికప్పుడు వినూత్న ఆవిష్కరణలతో అభ్యుదయాన్ని సాధించడం కోసమే. మనిషి దానినే సాధిస్తున్నాడు. ఇంటర్నెట్ (అంతర్జాలం) నుంచి, నానో టెక్నాలజీ (సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానం) నుంచి నానా రకాల పరిజ్ఞానాల దాకా మనిషి ఎగబాకాడు. ఇందుకు ఆనందించని వారంటూ ఎవరూ ఉండరు. కాకపోతే ఈ ఉపరితల సౌభాగ్యాన్ని చూసుకునే మురిసిపోకూడదు. భూగర్భంలో మనకు తెలియకుండా సాగుతున్న కదలికలను, దాని ఫలితాలను, పరిణామాలను చెప్పే పరిజ్ఞానం మనకు ఎంతో అవసరం. అలాగే, అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో వెలువడుతున్న తాపశక్తి గురించి, విషవాయువుల గురించి కూడా మనం తెలుసుకుని అందుకు తగ్గట్టు మెలగవలసిన అవసరం ఉంది. మనిషిని పులకరింతలు జలదరింప చేయడం తెలుసు. అలాగే భూమికీ పులకరింతలు ఉన్నాయి. భూ ఉపరితల చెక్క (బిరుసైన భాగం) కింద ఖండాల పర్యంతం పరుచుకుని ఉండే శిలాఫలకాలకూ పులకరింత ఉంటుంది. అలాంటి పలకలు చిట్లి, విడిపోతున్న సమయంలో ఆ ఒత్తిడికి లోపలి పొరలలో ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పలకలు (ప్లేట్స్) పరస్పరం ఢీకొన్నప్పుడు - చిన్నవైతే స్వల్పభూకంపాలూ, పెద్దగా ఢీకొంటే పెద్ద భూకంపాలూ సంభవిస్తాయి. పెద్ద భూకంపాల సంగతి వేరే చెప్పనక్కరలేదు. ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా ఉంటుంది. అదొక పెను విషాదం. ఈ నష్టాల తీవ్రతను తెలియచేసే, పలకల కదలికలను వివరించే అధ్యయనాన్ని ‘ప్లేట్ టెక్టానిక్స్’ అంటారు. భూఖం డాల మధ్య అంతర్లీనంగా సాగుతున్న ఈ మాలోకాన్ని గమనించిన భూగర్భశాస్త్ర, సాంకేతిక ప్రవీణులు దేశాలలో, ఆయా ప్రాంతాలలో, స్థాయి, తీవ్రత లను బట్టి భూకంపం సంభవించగల విభాగాలను గుర్తించారు. వాటిని మండలాలుగా పిలుస్తూ, స్థాయిని బట్టి విభజించారు. ఇప్పటికీ అంతుచిక్కని భూరహస్యం అయితే ఒకటి. ఎంతటి మనో విజ్ఞానశాస్త్రవేత్త అయినా మనిషి లేదా మాన సిక రోగి మనసులోని మర్మాన్నీ మాయనూ ఎలా సంపూర్ణంగా గ్రహించ లేడో, ప్లేట్ టెక్టానిక్స్ నిపుణులు కూడా భూగర్భంలో పలకలలో వచ్చే పరిణామాలను పూర్తిగా గ్రహించలేరు. అయితే ఏ రెండు ప్రాంతాల మధ్య తన వికృత చేష్టలను ప్రదర్శించవచ్చునో భూకంప క్రమానికి తెలుసునని అనిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్టే, ప్రతి 44 సంవత్సరాలకు ఒకసారి హిమా లయ ప్రాంతం భూకంపాలకు కేంద్రం అవుతోందని వీటి చరిత్రను బట్టి కనుగొన్నారు. అలాగే ఆ ప్రాంతం ఆ వికారపు చైతన్యానికి లోనుకాని సమయంలోనే, దక్షిణ భారత ప్రాంతాలు అదే వికారపు చైతన్యానికి లోనవుతూ ఉండడమూ చరిత్రే. 1800 సంవత్సరం నుంచి సంభవించిన భూకంపాలను అధ్యయనం చేసిన శాస్త్ర, సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. నిజానికి మనకు తెలిసిన పురా చరిత్రలో, ప్రపంచంలో సంభవించిన అత్యంత ఘోరమైన ఉపద్రవాలు 20వ శతాబ్దంలోనే పెల్లుబికినట్టు దాఖ లాలున్నాయి! మాంట్ పీలీ అగ్నిపర్వతం (వర్జిన్ ఐలెండ్స్) బద్దలైనది మొదలు ఉత్తరకాశీ, లాతూర్, జబల్పూర్, చామోలీ, భుజ్, సమత్రా, ముజఫరాబాద్ (1991-2005) వరకూ దాదాపు 300 పెను భూకంపాలు సంభవించినట్టు రికార్డులు తెలుపుతున్నాయి. విజయవాడ ప్రాంతానికి పెరిగిన ముప్పు మన దక్షిణ భారతంలో, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో రాజధాని ప్రాంతంగా పేర్కొన్న విజయవాడ-గుంటూరు బెల్ట్ అంతా ప్రకృతి వైపరీత్యాలకూ, భూకంపాలకూ కేంద్రం కాగల ప్రమాదం ఉందని జాతీయ స్థాయి నివేదికలు, ఐక్యరాజ్య సమితి స్థానిక సంస్థలతో జరిపిన సర్వేలు కొన్ని వెల్లడించాయి. భూకంపాలు (చిన్నదీ, పెద్దదీ) సంభవించగల ప్రాంతాలలో ఇంతకు ముందు పేర్కొన్న అయిదు జోన్లలో కూడా తాజాగా పరిస్థితులు మారుతున్నాయని అంచనా. అంచనాలు తారుమారవుతున్న ప్రాంతాల్లో విజయవాడ-గుంటూరు రాజధాని ప్రాంతం కూడా ఉందని అంచనా. మన కోస్తా ప్రాంతం ‘మూడవ జోన్’లో ఉంది. ఈ ‘జోన్’ను మధ్యస్థ తీవ్ర భూకంపనలకు గురవుతున్న ప్రాంతంగా నిపుణులు నిర్ధారించారు. పెద్ద భూకంపాలకు కేంద్రంగా నాల్గవ జోన్‌ను, భీకర భూకంపాల ప్రాంతాన్ని ఐదో జోన్గానూ పేర్కొన్నారు. ఈ అంచనాల దృష్ట్యానే, విజయవాడ- గుంటూరు ప్రాంతాన్ని, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘త్రిపుల్ ఐటీ’ పరిశోధనా సంస్థ జరిపిన సర్వే ప్రకారం ఈ ప్రాంత (తక్కువ అడుగుల్లోనే నీరు పడుతుంది కాబట్టి) భూమి పొరల్లోనే భూకంపాలకు అనువైన 26 రకాల దోషాలు బయటపడ్డాయని తేలింది. ‘‘పెను ఉపద్రవానికి గురయ్యే దాకా పైకి సుఖంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణ భుజ్, జబల్పూరులే. 2001లో పెను భూకంపం చుట్టబెట్టే దాకా భుజ్ సురక్షితమనే భావించాం. అలాగే సురక్షిత ప్రాతంగా భావించిన జబల్పూరును 1997లో భూకంపం కుదిపేసిందని మరవరాదు’’ అని ‘త్రిపుల్ ఐటీ’ సంస్థ సర్వే నిపుణులు స్పష్టం చేశారు! అందుకే, ప్రజాధనంతో డ్యాములు కట్టుకున్నాం, వ్యవసాయ భూము లకు నీళ్లందించేందుకు ఇరిగేషన్ కాల్వలు తవ్వుకున్నాం, కాని ఆహార పంటలు, పండ్లు, కూరగాయలందించే అలాంటి వ్యవసాయ భూముల్ని ‘కాంక్రీట్ అడవులు’గా మార్చేసే పక్షంలో డ్యాములు, కాల్వలు నిర్మించుకున్న ప్రయోజనం కాస్తా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆ సంస్థ పరిశోధనా బృందం హెచ్చరించింది. విజయవాడకు 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రాంతాల పరిస్థితి ప్రస్తుత రాజధాని నిర్మాణ పద్ధతి వల్ల అధ్వానమవుతుం దని నిపుణుల భావన. అలాగే ఒకనాడు భూకంపాలకు దూరంగా ఉందను కున్న భారత భూఖండం ఇటీవల అనేక భూకంపాలకు గురవుతోంది. కనుకనే, లోగడ తక్కువ తీవ్రతతో భూకంపాలకు గురిచేసే ‘రెండవ జోన్’లో ఉన్న విజయవాడ ప్రాంతాలని ఇప్పుడు ఎక్కువ తీవ్రత కల భూకంపాలకు గురి కాగల అవకాశాలు ఉన్నదిగా నిర్ణయించి మూడవ జోన్లో చేర్చవలసి వచ్చిందని గమనించాలి. కాబట్టే ప్రపంచంలో ఎక్కడా ముందుగానే భూకంపాలను కచ్చితంగా ఊహించే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఇంకా దృఢంగా కాళ్లూనుకోలేదని శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకే సుప్రసిద్ధ చిలీ కవి పాబ్లో నెరుడా కూడా ‘భూమి సూక్తం’ ఒకటి వినిపించి పోయాడు: ‘‘బహుశః ఈ భూమే మనకు బోధించగలదు అంతా నశించిందను కున్నప్పుడు కూడా నేను సజీవంగానే ఉన్నానని భూమి రుజువు చేస్తుంది’’ సుమా! అందుకే జీవితోత్సవ ఊరేగింపు కొనసాగుతూనే ఉండాలంటారు కాబోలు! (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
భూమాతకు కోపంవస్తే...భూకంపమే..
-
తీరంలో అన్నింటా ముప్పే
* ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్ల తాకిడి అధికమే * నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, విశాఖ , శ్రీకాకుళం, విజయనగరాల్లో తుఫాను గాలుల ప్రభావం ఎక్కువ * కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలపై తరచుగా వరదల ప్రభావం * సముద్ర మట్టం పెరుగుదలవల్ల కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఉప్పునీరు చొరబాటు * గణాంకాలు, గ్రాఫులు, మ్యాపులతో విశ్లేషించిన శివరామకృష్ణన్ కమిటీ * అన్ని అంశాలను పరిగణించి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని సూచన సాక్షి, హైదరాబాద్: తూర్పు తీర ప్రాంతంలో తరచూ సంభవించే తుఫాన్లు, భూకంపాలు తదితర విపత్తులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ఇందుకోసం కమిటీ ప్రతి అంశాన్ని గణాంకాలు, అధ్యయనాలు, గ్రాఫ్‌లు, మ్యాపులతో సహా నివేదించింది. కమిటీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలిలా ఉన్నాయి. ఏతూర్పు తీర ప్రాంతంలో ప్రమాదాలు, విపత్తులు ఎక్కువగా సంభవించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్ల ధాటి అధికం. గడిచిన దశాబ్దంలో రాష్ట్రంలో తుఫాన్లు సంఖ్య అధికంగానే నమోదయ్యాయి. ప్రతి రెండేళ్ళకోసారి రాష్ట్రం తుఫాను ధాటికి గురవుతూనే ఉంది. నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాల్లో తుఫాను గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సముద్రం మట్టం పెరుగుదలతో ఉప్పునీరు ఆంధ్ర తీరంలోని గోదావరి, కృష్ణా డెల్టాల్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఏ ఏపీలో డెల్టా, తీర ప్రాంతాల్లో వరదలు తరచు సంభవిస్తున్నాయి. కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు కృష్ణా, గోదావరి నదుల తీరాన కేంద్రీకృతమై ఉన్నాయి. 2009 అక్టోబరు-నవంబరులో వచ్చిన వరదలు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వరదల బారిన పడే నగరాల్లో విజయవాడ, గుంటూరు, నెల్లూరులు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ క్యాపిటల్ జోన్ చుట్టూ ఉన్న అంశాన్ని గమనించాలి. ఏ మిగిలిన తీర ప్రాంత నగరాలతో పోలిస్తే విశాఖపట్టణానికి రక్షణ ఉంది. ఇక్కడ టోపోగ్రఫీ, కోస్టల్ లైన్ ఇందుకు కారణం. ఈ పట్టణ, నగరాలతో పోలిస్తే క్యాపిటల్ జోన్లో భవిష్యత్తులో పలు తుఫాన్లకు, సూపర్ సైక్లోన్స్కు ప్రాణ నష్టం, భవనాల డ్యామేజీ, వ్యాపార ఆటంకాలు అనేకమున్నాయి. ఏ రాష్ర్టంలో సగటున వార్షిక వర్షపాతం 1000 మిల్లీమీటర్లుగా నమోదవుతోంది. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కరువు ఛాయలు అధికం. ఇక్కడ 30 మండలాల్లో 40 శాతం కంటే అధికంగా తరచూ కరువు ఉంటుంది. 20-40 శాతం కరువు బారిన పడే 115 మండలాల్లో అధికంగా ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలున్నాయి. వీజీటీఎంకు భూకంప ప్రమాదం ఆంధ్రప్రదేశ్ భూకంపాలకు సంబంధించి జోన్-2, 3 లలో ఉంది. ఇది తక్కువ ప్రభావమే చూపుతుంది. కానీ విజయవాడ పరిసరాల్లోని 150 కిలోమీటర్ల రేంజ్లో భూకంప ప్రమాదాలకు ఆస్కారం ఉందని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) జరిపిన సీస్మిక్ మైక్రో-జోనేషన్ అధ్యయనంలో వెల్లడైంది. ఇదంతా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) రీజన్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలు పొంచి ఉన్నందున దాన్ని గమనంలోకి తీసుకుని నిర్ణయాలు జరగాలి. 1917లో విజయనగరంలో 5.5 ఎం, 1967లో ఒంగోలు ప్రాంతంలో 5.4 ఎం.గా రెండు పెద్ద భూకంపాలు నమోదయ్యాయి. కాకినాడ, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రిలలో తక్కువ రిస్క్‌గా ఉన్నాయి. తక్కువ నాణ్యతతో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడితే మాత్రం ప్రమాదం అధికంగా ఉంటుంది. అహ్మదాబాద్‌లో 2001లో భుజ్ భూకంపమే దీనికి ఉదాహరణ.