న్యూఢిల్లీ: భూగర్భంలో ఇండియా, ఆసియన్ ఫలకాలు కలిసే చోట, లద్దాఖ్ ప్రాంతంలో ఫాల్ట్‌లైన్ క్రియాశీలకంగా ఉందని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలోని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల అక్కడ భూకంపాల సంభవించే అవకాశాలు అధికమని తేలింది. లద్దాఖ్‌లో తరచుగా కొండ చరియలు విరిగి పడుతుండడానికి టెక్టానిక్ ప్లేట్ల క్రియాశీలతే కారణమని తెలిపింది. ఈ పరిశోధన ఫలితాలు టెక్నోఫిజిక్స్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. (లద్దాఖ్, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం)
కాగా.. లద్దాఖ్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. హిమాలయ ప్రాంతంలో గత 15 రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి.
Comments
Please login to add a commentAdd a comment