National Centre for Seismology
-
ఆ ప్రాంతంలో భూకంపాల ముప్పు అధికం
న్యూఢిల్లీ: భూగర్భంలో ఇండియా, ఆసియన్ ఫలకాలు కలిసే చోట, లద్దాఖ్ ప్రాంతంలో ఫాల్ట్‌లైన్ క్రియాశీలకంగా ఉందని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలోని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల అక్కడ భూకంపాల సంభవించే అవకాశాలు అధికమని తేలింది. లద్దాఖ్‌లో తరచుగా కొండ చరియలు విరిగి పడుతుండడానికి టెక్టానిక్ ప్లేట్ల క్రియాశీలతే కారణమని తెలిపింది. ఈ పరిశోధన ఫలితాలు టెక్నోఫిజిక్స్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. (లద్దాఖ్, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం) కాగా.. లద్దాఖ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. హిమాలయ ప్రాంతంలో గత 15 రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి. -
ఢిల్లీలో మళ్లీ భూకంపం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మళ్లీ భూమి స్వల్పంగా కంపించింది. సోమవారం మధ్యాహ్నం తక్కువ తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఇది 2.7గా నమోదైంది. కాగా నిన్న (ఆదివారం) కూడా ఢిల్లీలో భూకంపం వచ్చింది. వరుసగా భూమి కంపించడంతో జనం భయాందోళనలకు గురి అవుతున్నారు. కాగా నగరంలోని కొన్ని ప్రాంతాలలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ( ఎన్సీఎస్) తెలిపింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం గానీ , ప్రాణ నష్టంగానీ వాటిల్లలేదు. 24 గంటలలో ఢిల్లీలో భూమికంపించడం ఇది రెండవ సారి. సోమవారం నాటి భూకంప కేంద్రం భూమికి 5 కిమీల లోతున మాత్రమే ఉండగా ఆదివారం భూకంప కేంద్రం 7 కిమీల లోతున ఉందని జాతీయ భూకంప కేంద్రం (ఎన్సీఎస్) డైరక్టర్ జెఎల్ గౌతం చెప్పారు. -
ఢిల్లీలో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం తక్కువ తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఇది 3.5గా నమోదైంది. భూప్రకంపనలతో జనం ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగెత్తారు. ఈ భూకంప కేంద్రం ఢిల్లీలోని వజీరీబాద్‌లో 8 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి వార్తలు వెలువడలేదు. -
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదు అయింది. అయితే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని జాతీయ భూకంప పరిశోధన సంస్థ వెల్లడించింది. అలాగే సునామీ వచ్చే సూచనలు కూడా లేవని తెలిపింది. ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. -
భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భూకంపం
న్యూఢిల్లీ : భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదు అయింది. ఈ మేరకు జాతీయ భూకంప పరిశోధన సంస్థ వెల్లడించింది. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ చోటు చేసుకున్నట్లు సమాచాం అందలేదు. మంగళవారం మధ్యాహ్నాం 3.42 కి భూమి స్వల్పంగా కంపించింది. భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు చెప్పారు.